చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చావు తప్పి కన్నులొట్టబోయింది.. టిక్‌టాక్ మోజులో పడి అటవీలోకి... ఏం జరిగిందో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

చిత్తూరు : ఔను చావు తప్పి కన్నులొట్టబోయింది. టిక్ టాక్ మాయలో పడి ఓ యువకుడు ప్రాణాలమీదికి తెచ్చుకున్నాడు. వీడియో కోసం వినూత్నంగా ఆలోచించడమే ఆయన చేసిన తప్పిదమైంది. అదీ అడవీలో వీడియో తీద్దామని వెళ్లి .. దారి తప్పిపోయాడు. దీంతో అతను అడవీలో అరణ్యవేదన. స్నేహితులకు లోకేషన్ షేర్ చేసిన ఆచూకీ కనుక్కొవడం చాలా ఆలస్యమైంది.

టిక్‌టాక్ ...

టిక్‌టాక్ ...

చిన్న, పెద్ద అనే తేడా లేనేలేదు. టిక్ టాక్ యాప్‌లో మునిగితేలుతున్నారు. ఇటీవల ఖమ్మం కార్పొరేషన్ ఉద్యోగుల టిక్ టాక్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తర్వాత గాంధీలో ఫిజియో థెరపీ వైద్యులు కూడా అలానే చేశారు. అయితే ఏపీలోని చిత్తూరుకు చెందిన ఓ యువకుడు కూడా టిక్ టాక్ కోసం అటవీలోకి వెళ్లి ప్రాణాలమీదికి తెచ్చుకున్నాడు. అయితే అతని ఆచూకీ కనుక్కొవడం ఆలస్యమైంది. దీంతో తెల్లవార్లు అటవీలో గజ గజ వణికిపోయాడు.

అటవీలో వీడియో ..

అటవీలో వీడియో ..

చిత్తూరు జిల్లా కలకడ మండలానికి చెందిన మురళి తిరుపతి సమీపంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అయితే ఇటీవల అతని ఫ్రెండ్స్ టిక్ టిక్ తెగ చేసేస్తున్నారు. దీంతో అతను కూడా చేయాలనుకున్నాడు. అయితే అందుకోసం అరణ్యానికి ఎంచుకున్నాడు మురళి. చంద్రగిరి మండలంలోని శేషాచలంలో అటవీలోకి వెళ్లాడు. వీడియో కోసం లోకేషన్ చూస్తూ వెళ్లిపోయాడు. ఎలాగోలా వీడియో అయితే తీశాడు. కానీ వచ్చినదారి మరచిపోయాడు. ఇంకేముంది ఎలా వెళ్లాలో తెలియదు. తిరిగి తిరిగి అలసిపోయాడు.

తప్పిపోయిన మురళి

తప్పిపోయిన మురళి

తర్వాత తన స్నేహితులకు ఫోన్ చేశాడు. వాట్సాప్ ద్వారా లోకేషన్ షేర్ చేశాడు. లోకేషన్ వచ్చింది .. కానీ మురళి ఉన్న ప్రాంతాన్ని అతని ఫ్రెండ్స్ తెలుసుకోలేకపోయారు. దీంతో అడవీలోనే ఒకరోజు రాత్రి ఉండిపోయాడు మురళి. దెబ్బకు అతనికి ఫిట్స్ వచ్చాయి. అస్వస్థతకు గురయ్యాడు. అతని ఫ్రెండ్స్ విషయాన్ని పోలీసులకు తెలిపారు. దీంతో వారు అడవీలో ఆ రాత్రే ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. కానీ రాత్రి మాత్రం మురళి ఆచూకీ తెలియలేదు. తెల్లవారిన తర్వాత మురళి ఎలాగోలా కనుగొన్నారు. కానీ అతను సృహలో లేకపోవడంతో వెంటనే తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. అతనికి వైద్యం అందిస్తున్నామని .. ప్రస్తుతం స్థిమితంగా ఆరోగ్యం ఉందని వైద్యులు పేర్కొన్నారు.

English summary
Murali a native of Kalakada Zone in Chittoor district, is studying for a degree final year at a private college in tirupati. Recently, however, his friends have been making a tik tok. he chose to go into the wilderness. He went into the forest at Seshachalam forest in Chandragiri zone. He left the location looking for the video. How the video was taken though. But the one who came road was forgotten.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X