• search
  • Live TV
చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కుప్పం వీడేది లేదు-పార్టీలో కోవర్టుల్ని తరిమేస్తా- చంద్రబాబు కామెంట్స్

|
Google Oneindia TeluguNews

టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం టూర్ ప్రారంభమైంది. మూడు రోజుల పాటు ఆయన కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా టీడీపీ ప్రక్షాళనతో పాటు సొంత నియోజకవర్గంలో మారుతున్న పరిస్ధితుల్ని చక్కదిద్దాలని ఆయన నిర్ణయించారు. దీంతో ఇవాళ కుప్పంలో అడుగు పెట్టగానే చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కుప్పాన్ని వీడిపోతారంటూ ప్రత్యర్ధులు చేస్తున్న వ్యాఖ్యలపైనా స్పందించారు.

కుప్పంలో చంద్రబాబు

కుప్పంలో చంద్రబాబు

ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు తన క్యాడర్ ను సిద్ధం చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ సొంత నియోజకవర్గం కుప్పంలో తన మూడు రోజుల టూర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవరాజపురంలో భారీఎత్తున తరలివచ్చిన టీడీపీ శ్రేణులు, అభిమానులు చంద్రబాబుకు స్వాగతం పలికారు.కుప్పం పర్యటనలో భాగంగా మాట్లాడిన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రోజుల పాటు గ్రామాల్లో పర్యటిస్తానని, .కార్యకర్తలు, ప్రజలను కలుసుకుంటానని చంద్రబాబు తెలిపారు. తాను ఎప్పుడూ కుప్పం అభివృద్ధి గురించే ఆలోచించానని ఆయన గుర్తుచేశారు. నిత్యావసరాలు తీవ్రభారం గా మారిపోయాయని, పొరుగున ఉన్న రాష్ట్రంలో పెట్రోలు ధర 10 రూపాయలు తక్కువగా ఉందని చంద్రబాబు ఆక్షేపించారు. ఎవడబ్బ సొమ్మని ఓటీఎస్ కు 10 వేలు కట్టమని అడుగుతున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. వాలంటీర్లు బెదిరిస్తే భయపడకండని టీడీపీ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. టీడీపీ వచ్చిన తరువాత పేదల ఇళ్లకు ఉచితం గా రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు.

కుప్పంలో లెక్కలు తేలుస్తా

కుప్పంలో లెక్కలు తేలుస్తా

నన్ను కూడా బుతులు తిట్టే పరిస్థితి కి వచ్చారని వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. రౌడీయిజం చెయ్యడం ఒక్క నిమిషం పని... కానీ అది మన విధానం కాదని గుర్తుచేశారు. కుప్పం లో టీడీపీ కార్యకర్తలను, ప్రజలను ఇబ్బంది పెడుతున్న వారి పేర్లు రాసి పెడుతున్నానని ...అందరి లెక్కలు తేల్చుతామని చంద్రబాబు హెచ్చరించారు.
రెండు ఘటనలు కుప్పం లో తనను బాధించాయని చంద్రబాబు తెలిపారు. మొన్న వచ్చిన ఎన్నికల ఫలితాలు తనను బాధపెట్టాయని, అలాగే కుప్పం లో డబ్బులు పంచే తీరు ఎప్పుడూ లేదని చంద్రబాబు తెలిపారు.

టీడీపీలో కోవర్టుల్ని తరిమేస్తా

టీడీపీలో కోవర్టుల్ని తరిమేస్తా

వెయ్యి, రెండు వేల పంచి ఓట్లు అడిగే పార్టీ కాదు టీడీపీ అని చంద్రబాబు పేర్కొన్నారు. కుప్పం లో ఓటమి అంటూ నన్ను ఎగతాళి చేస్తే....మిమ్మల్ని అన్నట్లు కాదా అని స్ధానికుల్ని చంద్రబాబు ప్రశ్నించారు. మనం కూడా ప్రలోభాలకు లొంగిపోతే ఎలా అని అడిగారు, మనం బాగా పనిచేయాలి....కుప్పం లో కోవర్ట్ లను పంపేస్తా...ప్రక్షాళన చేస్తానంటూ చంద్రబాబు హెచ్చరించారు. రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవని, మేం అనుకుంటే ఇంట్లోంచి బయటకు రాలేరని ప్రత్యర్ధులకు చంద్రబాబు హెచ్చరికలు జారీచేశారు. కుప్పం లో మనం అంతా ఏకం ఐతే పోలీసులు ఏమి చేయగలరంటూ కార్యకర్తల్ని ప్రశ్నించారు. కుప్పం లో కార్యకర్తల ఇష్ట ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటానన్నారు.కుప్పం లో మీరు వద్దన్న నేతలను, నష్టం చేసే వారిని ఉపేక్షించనని తెలిపారు.

YSRCP, TDP పై RGV సెటైర్..మధ్యలో ఆయన పై కూడా | Ap Politics || Oneindia Telugu
 కుప్పాన్ని వదిలివెళ్లనన్న చంద్రబాబు

కుప్పాన్ని వదిలివెళ్లనన్న చంద్రబాబు

నేను నియోజకవర్గం మార్చాలా....ఆ అవసరం ఉందా అని నేరుగా పార్టీ శ్రేణుల్ని చంద్రబాబు ప్రశ్నించారు. నేను కుప్పానికి ముద్దు బిడ్డను....కుప్పం వదిలి ఎక్కడికి పోనన్నారు అవతలివాళ్లు కుప్పం పై హేళన చేస్తే తనకు బాధకలిగిందన్నారు. కుప్పం స్థానిక ఎన్నికల్లో ఓడిపోయిన చంద్రబాబును సభలో చూడాలని జగన్ అన్నాడని, చివరికి కుటుంబ సభ్యులపైన ఆరోపణలు చేసి ఆనందం పొందుతారా అని ప్రశ్నించారు. మళ్ళీ సీఎంగా నే శాసనసభ కు వెళ్తా అని చెప్పాను. సభా గౌరవం కాపాడుతానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం పట్ల తమిళనాడులో స్టాలిన్ ఎంత గౌరవం గా ఉన్నారు...ఇక్కడ జగన్ ఎలా ఉన్నాడని ప్రశ్నించారు. పార్టీ లో ఉన్న ప్రతి కార్యకర్త కు నేను అండగా ఉంటా...ఏ కార్యకర్త పై ఒక్క దెబ్బపడినా...నా పై పడినట్లేనని చంద్రబాబు భరోసా ఇచ్చారు. క్యాడర్ ను ఇబ్బంది పెడుతున్న ఏ ఒక్కరినీ వదిలి పెట్టనని హెచ్చరించారు.

English summary
tdp chief chandrababu naidu on today kick off his tour in kuppam constituency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X