టీడీపీ మహా పాదయాత్ర ... కుప్పంలో టెన్షన్ .. టీడీపీ వర్సెస్ వైసీపీ పోటాపోటీగా
కుప్పం రైతుల తాగునీటి , తాగునీటి సమస్యలు నివారించడం కోసం హంద్రీనీవా ఎత్తిపోతల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ టిడిపి మహా పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే . హంద్రీనీవా జలాల సాధన పేరు టిడిపి మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టడంతో కరోనా నేపథ్యంలో టిడిపి మహా పాదయాత్రకు పోలీసులు అనుమతించలేదు. దీంతో టిడిపి మహా పాదయాత్ర చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఉద్రిక్తతలకు కారణమవుతోంది.
టీడీపీ సీనియర్లలో కమిటీల కుంపటి ... చంద్రబాబు బుజ్జగింపుల పర్వం సక్సెస్ అవుతుందా ?

హంద్రినీవా జలాల సాధనకు టీడీపీ పాదయాత్ర ... వైసీపీ కూడా పోటీగా
టిడిపి మహా పాదయాత్ర చేపట్టిన నేపథ్యంలో టిడిపి పాదయాత్రకు నిరసనగా అటు వైసీపీ శ్రేణులు రంగంలోకి దిగాయి. టీడీపీ నేతల తీరుకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ర్యాలీ చేయడానికి సిద్ధపడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కుప్పం నియోజకవర్గంలో టిడిపి మహా పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు టిడిపి నాయకులను గృహనిర్బంధం చేశారు. ఎక్కడికక్కడ టీడీపీ నేతలను అరెస్టు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.

టిడిపి మహా పాదయాత్ర అడ్డుకోవడం అప్రజాస్వామికం : చంద్రబాబు ఫైర్
టిడిపి మహా పాదయాత్ర అడ్డుకోవడం అప్రజాస్వామికం అంటూ ఫైర్ అయ్యారు. కుప్పం నియోజకవర్గంపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను గర్హిస్తున్నాం అని ఆయన వ్యాఖ్యానించారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వస్తున్న టిడిపిపై అణచివేత చర్యలకు ఖండిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో పులివెందులకు నీళ్లు ఇచ్చామని, చీనీ చెట్లు ఎండిపోకుండా కాపాడమని కానీ కుప్పం నియోజకవర్గంపై కావాలని కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పం రైతులు సాగునీటి సమస్యలు, తాగునీటి ఎద్దడిని తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

టీడీపీ పాదయాత్ర సిగ్గుచేటు : వైసీపీ ఫైర్
మరోవైపు టిడిపి మహా పాదయాత్ర సిగ్గుచేటు అంటూ వైసిపి నేతలు మండిపడుతున్నారు . చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో హంద్రీనీవా కాలువ పనులు ఎందుకు పూర్తి చేయించ లేక పోయారు అంటూ ప్రశ్నిస్తున్నారు. టిడిపి అధినేత చంద్రబాబు దశాబ్దాలుగా కుప్పం నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని ఆరోపిస్తున్నారు . వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండి హంద్రీనీవా పనులు పూర్తికి కృషి చేస్తూనే ఉన్నారని కానీ చంద్రబాబు ఓర్వలేక పోతున్నారని మండిపడ్డారు.

భారీగా పోలీసులు .. కుప్పంలో ఉద్రిక్తత
కుప్పం ప్రజలపై చంద్రబాబుది కపట ప్రేమ అంటూ నిప్పులు చెరిగారు వైసీపీ నేతలు.
ఎలాగైనా మహా పాదయాత్రను కొనసాగించాలని టిడిపి, టిడిపి నేతల తీరుకు నిరసనగా మరో ర్యాలీ చేయాలని వైసిపి నేతల ఈ ప్రయత్నాల నేపథ్యంలో కుప్పంలో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. భారీగా పోలీసులు మోహరించి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇరువర్గాలను కంట్రోల్ చేస్తున్నారు.