చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీయం సొంత జిల్లాలో టిడిపికి షాక్ : కిర‌ణ్ సోద‌రుడి గెలుపు కు చెక్‌..!

|
Google Oneindia TeluguNews

టిడిపి అధినేత చంద్రబాబు సొంత జిల్లాలో టిడిపి కి షాక్ త‌గిలింది. ముఖ్య‌మంత్రి 2014 ఎన్నిక‌ల్లో ఏరి కోరి సీటు ఇచ్చిన మైనార్టీ నేత పార్టీని వీడారు. ఇప్పుడు ఇది చంద్ర‌బాబు కే కాదు..మాజీ ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డి సోద‌రుడు కిషోర్ గెలుపు మీద ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంది. చిత్తూరు జిల్లాలో రాజ‌కీయంగా పై చేయి సాధించేందుకు టిడిపి - వైసిపి ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఇందులో భాగంగా జిల్లాలో రాజ‌కీయంగా రంజుగా మారింది.

చిత్తూరు జిల్లా పీలేరు నియోజ‌వ‌ర్గం లో టిడిపి కి మాజీ ఇన్‌ఛార్జ్..మైనార్టీ నేత ఇక్బాల్ మ‌హ‌మ్మ‌ద్ రాజీనామా చేసారు.

Tdp senior leaders resigned Party : Shock for Tdp in Chittoor
ఆయనతో పాటు మరో 20మంది నేతలు కూడా టీడీపీకి రాజీనామా చేశారు. పాతిక సంవత్సరాలు టీడీపీకి సేవ చేసి ఎంతో నష్టపోయామని ఇక్బాల్‌ వాపోయారు. 2014లో కిరణ్‌కుమార్‌ రెడ్డి కుటుంబం మీద పోటీచేయాలని తన మీద చంద్రబాబు ఒత్తిడి తీసుకవచ్చారని.. అందుకే పోటీచేశానన్నారు. అయితే ఎన్నికల తరువాత నల్లారి కిషోర్‌కుమార్‌ రెడ్డిని టీడీపీలో చేర్చుకునేటప్పుడు తనకు నామినేటెడ్‌ పదవిని ఇస్తానని చెప్పిన చంద్రబాబు తరువాత పట్టించుకోలేదన్నారు. పైగా కిషోర్‌ కుమార్‌ రెడ్డికి ఇన్‌చార్జీ బాధ్యతలను ఇవ్వడమే కాకుండా.. కార్పోరేషన్‌ పదవిని కూడా ఇచ్చారన్నారు. సీఎంను కలిసి అనేక సార్లు తాను పడుతున్న ఇబ్బందుల గురించి చెప్పానన్నారు. సీయం తో పాటుగా అన్నివిధాల ఆదుకొంటా మని సీఎం రమేష్‌ కూడా హామీ ఇచ్చారని తెలిపారు. అంతేకాకుండా టీడీపీ అధికారంలోకి వచ్చాక క్యాబినేట్‌ పదవిని ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.. కానీ ఇప్పటివరకు న్యాయం జరగలేదని ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు.

చిత్తూరు జిల్లాలో నారా - న‌ల్లారి కుటుంబాల మ‌ధ్య రాజ‌కీయంగా వైరుధ్యం ఉంది. అయితే, మాజీ ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డి సోద‌రుడు కిషోర్ కుమార్ రెడ్డి టిడిపి లో చేర‌టం తో ఆయ‌న‌కు కిర‌ణ్ కుటుంబానికి రాజ‌కీయంగా పెట్ట‌ని కోట లాంటి పీలేరు బాధ్య‌త‌లు చంద్ర‌బాబు అప్ప‌గించారు. 2014 లో సైతం ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుండి కిషోర్ స‌మైక్యాంధ్ర పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయారు. అక్క‌డ వైసిపి అభ్య‌ర్ధి రామ‌చంద్రా రెడ్డి గెలుపొందారు. ఆ ఎన్నిక‌ల్లో టిడిపి మైనార్టీ ల‌కు ఇచ్చిన సీటు ఇదొక్క‌టే. ఇక‌, ఇప్పుడు పాతికేళ్లుగా టిడిపి కోసం ప‌ని చేసిన బ‌ల‌మైన మైనార్టీ నేత రాజీనామా తో టిడిపి తో పాటుగా.. కిషోర్ కుమార్ రెడ్డి గెలుపు మీద ప్ర‌భావం ప‌డుతుంద‌ని స్థానిక నేత‌లు విశ్లేషిస్తున్నా రు. అయితే, టిడిపి నేత‌లు ఇక్బాల్ ను స‌ముదాయించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నా.. తన రాజీనామా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని ఆయ‌న స్పష్టం చేస్తున్నారు.

English summary
CM home dist Chittor TDP senior leader Iqbal Mohmmed resgined from party. Since 25 years he working in TDP and contested from Pileru in 2014 elections as TDP candiate. He dissatisfied with TDP leaders attitude.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X