• search
  • Live TV
చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

2014లో జగన్ ఓడిపోయారు.!పాదయాత్ర ఆపారా.?రోజాకు మతి భ్రమించిందన్న తెలుగు మహిళ అధ్యక్షురాలు.!

|

అమరావతి/హైదరాబాద్ : మహానాడు సందర్బంగా తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెట్టిన తీర్మాణాల పట్ల నగరి ఎమ్మెల్యే రోజా స్పందించడం విడ్డూరంగా ఉందని, చరిత్ర తెలుసుకొని మాట్లాడకపోతే ఆమే చేసిన వ్యాఖ్యలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని తెలంగాణ తెలుగు మహిళా అద్యక్షురాలు ప్రోఫెసర్ తిరునగరి జ్యోత్స్న హెచ్చరించారు. రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదని, ఓడిపోయినంత మాత్రాన రాజకీయాలకు దూరంగా ఎలా ఉంటారని, 2014లో ఏపీలో వైసీపి ఓడిపోయిందని, అందుకు నిరసనగా వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను రద్దు చేసుకోలేదు కదా అని ఆమే రోజాను సూటిగా ప్రశ్నించారు. ప్రతి టీడిపి కార్యకర్త గర్వంగా జరుపుకునే మహానాడు గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం రోజాకు తగదని హితవు పలికారు.

మహానాడు తీర్మాణాలపై స్పందించిన రోజా.. గట్టి కౌంటర్ ఇచ్చిన తెలుగు మహిళా విభాగం..

మహానాడు తీర్మాణాలపై స్పందించిన రోజా.. గట్టి కౌంటర్ ఇచ్చిన తెలుగు మహిళా విభాగం..

ఏపీ రాజకీయాలు ఏదో ఒక సంఘటనతో వాడివేడిగా కొనసాగుతూనే ఉంటాయి. నిన్న మొన్నటి వరకూ రాజధాని తరలింపు, కరోనా మహమ్మారి, ఎన్నికల అధికారి మార్పు, ప్రాజెక్టులు, ప్రభుత్వ జీవోలు, విజయపాయి రెడ్డి ట్వీట్లు, చంద్రబాబు ఏపి పర్యటన అనే అంశాల చుట్టూ తిరిగిన రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే మహానాడు కార్యక్రమంపై అధికార పార్టీ వైసీపి నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మహానాడులో కార్యక్రమంలో ప్రవేశపెట్టే తీర్మాణాల గురించి నగరి ఎమ్మెల్యే రోజా స్పందించిన తీరుపట్ల టీడిపి నేతలు భగ్గుమంటున్నారు. తెలుగుదేశం పార్టీ తీర్మాణాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్న రోజా వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు తెలుగు మహిళా నేతలు.

ఓడిపోతే మూలన కూర్చోవాలా.? 2014 తర్వాత మీ నాయకుడు అదే చేసాడా అని ప్రశ్నించిన జ్యోత్న్స..

ఓడిపోతే మూలన కూర్చోవాలా.? 2014 తర్వాత మీ నాయకుడు అదే చేసాడా అని ప్రశ్నించిన జ్యోత్న్స..

అంతే కాకుండా ప్రజలు నవ్వుతుంది తెలుగుదేశం పార్టీ నాయకులను చూసి కాదని, దృష్టి దోషం లేకుండా చూస్తే ప్రజలు ఎవరిని అస్యహ్యించుకుంటున్నారో అర్థం అవుతుందని తెలంగాణ తెలుగు మహిళా అద్యక్షురాలు జ్యోత్స్న మండిపడ్డారు.టెక్నాలజీతో ఎప్పటికప్పుడు అప్ డేట్ అయ్యే తెలుగుదేశం పార్టీ అన్నా, పార్టీని ముందుండి నడిపించే చంద్రబాబు నాయుడు అన్నా వైసీపి నేతలకు వెన్నులో వనుకు పుడుతోందని అభిప్రాయ పడ్డారు జ్యోత్స్న. అంతే కాకుండా సన్ రైస్ ఏపూీ నుండి సేల్ ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని దిగజార్చిన వైసీపి ప్రభుత్వాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్న అంశాన్ని రోజా గ్రహించాలని తిరునగరి జ్యోత్స్న ఎద్దేవా చేసారు.

సొంత పార్టీలోనే కుంపట్లు.. రోజా వాస్తవాలు గ్రహించాలన్న తెలుగు మహిళాద్యక్షురాలు..

సొంత పార్టీలోనే కుంపట్లు.. రోజా వాస్తవాలు గ్రహించాలన్న తెలుగు మహిళాద్యక్షురాలు..

ఇదిలా ఉండగా నగరి నియోజక వర్గంలో రోజా ప్రమేయం లేకుండా ఇతర ఎమ్మెల్యేలు, మంత్రులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఎమ్మెల్యేగా కనీస గుర్తింపు ఇవ్వడానికి కూడా సొంత పార్టీ నేతలు సాహసించడం లేదని, రోజా ముందు ఇంటి సమస్యను చక్కబెట్టుకుని, తర్వాత తెలుగుదేశం గురించి మాట్లాడాలని జ్యోత్స్న హితవు పలికారు. వైసీపిలో గెలిచిన తర్వాత మంత్రి వర్గంలో తీసుకోవడానికి కూడా జగన్ నిరాకరించాడని, రోజా కుమిలిపోతుంటే చూడలేక ఏదో ఒక నామినేటెడ్ పదవిని జగన్ అంటగట్టారని జ్యోత్న్స గుర్తు చేసారు.

అనుచిత వ్యాఖ్యలు చేస్తే క్షమించం.. రోజాకు గట్టి హెచ్చరికలు జారీ చేసిన టీడిపి మహిళా నేత..

అనుచిత వ్యాఖ్యలు చేస్తే క్షమించం.. రోజాకు గట్టి హెచ్చరికలు జారీ చేసిన టీడిపి మహిళా నేత..

వైసీపి చేతగాని పరిపాలన వల్ల యావత్ రాష్ట్రం ఏకంగా ఇరవై సంవత్సరాలు వెన్నకి నెట్టివేయబడిందని తిరునగరి జ్యోత్స్న మండిపడ్డారు. కరోనా కట్టడిలో ఘోరంగా విఫలం అయినందున మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి అవాకులు చవాకులు పేలుతున్నారని, కోర్టులో ఇలా వాగినందుకు ఎలాంటి తీర్పులు వచ్చాయో గ్రహించాలని, వైసీపి అహంకారానికి ప్రజా కోర్టులో తప్పకుండా తగిన గుణపాఠం లభిస్తుందని తెలిపారు. నియంత్రణ కోల్పోయి మరోసారి తెలుగుదేశం పార్టీ పైన, పార్టీ అధినాయకుడు చంద్రబాబు పైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగిన రీతిలో మా తెలుగుమహిళ బుద్ధి చెపుతుందని తిరునగరి జ్యోత్స్న , రోజాను హెచ్చరిస్తున్నాం.

English summary
MLA RK Roja was directly questioned whether the YCP lost in AP in 2014 and YSP chief Jagan Mohan Reddy did not cancel the Padayatra. tdp women wing president has said that it is inappropriate for every TDP activist to make inappropriate comments about the celebrated Mahanadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X