చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రఘురామ.. మిథున్‌పై నోరుపారేసుకోకు, చూస్తూ ఊరుకోం: వైసీపీ నేతలు

|
Google Oneindia TeluguNews

వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత మిథున్ రెడ్డిపై ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఘటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మిథున్ రెడ్డి ఏం చేశారని.. పార్లమెంటరీ పార్టీ నేత కోసం ఎన్నిక పెడితే మూడు ఓట్లు కూడా రావు అని హాట్ కామెంట్స్ చేశారు. అయితే దీనిపై వైసీపీ నేతలు ఘాటుగానే స్పందిస్తున్నారు. మిథున్ రెడ్డిపై నోరు పారేసుకోవద్దని హితవు పలుకుతున్నారు. తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు.

3 ఓట్లు కూడా రావు, అనర్హత వేటు వేయండి, మిథున్ రెడ్డికి రఘురామ కృష్ణరాజు సవాల్3 ఓట్లు కూడా రావు, అనర్హత వేటు వేయండి, మిథున్ రెడ్డికి రఘురామ కృష్ణరాజు సవాల్

ప్యాకేజీల కోసం స్క్రిప్ట్

ప్యాకేజీల కోసం స్క్రిప్ట్

రఘురామపై చిత్తూరు వైసీపీ మైనార్టీ నేత అప్జల్ ఖాన్ ఫైరయ్యారు. ఆయన ప్యాకేజీల కోసం స్కిప్ట్ చదువుతున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్ సీపీ పార్టీ సింబల్, జగన్ ఫేస్ వ్యాల్యూపై ఎంపీగా రఘురామ కృష్ణరాజు గెలిచిన విషయాన్ని గుర్తుచేశారు. కానీ సొంత ఇమేజ్‌తో గెలిచినట్టు గొప్పలు చెబుతారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డు పడుతున్నారని ధ్వజమెత్తారు. మిథున్ రెడ్డిని టార్గెట్ చేయడం మంచి పద్ధతి కాదన్నారు. వైసీపీ ఎంపీ పదవీలో ఉన్నారనే మీకు ఇప్పటివరకు గౌరవిస్తూ వస్తున్నామని తెలిపారు.

మోకాలడ్డుతూ..

మోకాలడ్డుతూ..


నర్సాపూర్ అభివృద్ధి పనులకు కూడా మోకాలడ్డుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేలు చేసే అభివృద్ధిని కూడా అడ్డుకుంటున్నారని ఫైరయ్యారు. ఢిల్లీలో కాలయాపన చేస్తూ.. ప్యాకేజీల కోసం కొందరు స్కిప్ట్ చదువుతున్నారని విమర్శించారు. ఎంపీ పదవికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల కోసం ప్రజల్లోకి వెళ్లాలని.. అప్పుడు ఎవరీ వ్యాల్యూ ఏంటో తెలుస్తుందన్నారు.

Recommended Video

Japan : ఎనిమిదేళ్ల తరువాత Japan నూతన ప్రధానమంత్రి గా Yoshihide Suga ఘన విజయం! || Oneindia Telugu
మూడు ఓట్లు కూడా రావు అని..

మూడు ఓట్లు కూడా రావు అని..


వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత మిథున్ రెడ్డి లక్ష్యంగా నిన్న విమర్శలు చేశారు. తనపై అనర్హత వేటు వేయాలని కోరారు. చట్ట ప్రకారం తనపై అనర్హత వేటు వేయడం వల్ల కాదు అంటూనే.. మిథున్, పార్టీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. ఏ రోజయినా రాష్ట్ర సమస్యలపై మాట్లాడారా అని అడిగారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తారా అని ప్రశ్నించారు. కనీసం రైల్వే జోన్ కోసం చర్చకు పట్టుబట్టారా అని అడిగారు. పార్లమెంటరీ పార్టీ నేత కోసం ఎన్నికలు పెట్టాలని కోరారు. అప్పుడు ఎవరు ఏంటో తెలుస్తోంది అని చెప్పారు.

English summary
ysrcp leaders slams rebel mp raghurama krishna raju for mithun reddy comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X