వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Come back Mr IPL: రక్షకుడతడే: నువ్వు లేక: అతనొస్తే గెలుపు గ్యారంటీ: ఫ్యాన్స్ పట్టు

|
Google Oneindia TeluguNews

చెన్నై: రెండు వరుస ఓటములు చెన్నై సూపర్ కింగ్స్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశాయి. టీమ్ మొత్తాన్నీ తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేశాయి. బౌలింగ్, బ్యాటింగ్.. ఆ మాటకొస్తే ఫీల్డింగ్ విభాగంలో టీమ్ బలహీనంగా ఉందనే సందేశాన్ని ఇచ్చాయి. ఈ మూడింటి మధ్య సమతౌల్యం ఘోరంగా దెబ్బతిన్నది. సమన్వయం లేదు.. ఆల్‌రౌండర్ల కొరత ఏర్పడింది. దాని ప్రభావం- టైటిల్ హాట్ ఫేవరెట్ చెన్నై సూపర్‌ కింగ్స్ విజయావకాశాలను ప్రభావితం చేస్తోంది. ఐపీఎల్ వంటి ఫటాఫట్ టోర్నమెంట్‌లో వరుసగా రెండు పరాజయాలను చవి చూడటం అంటే మాటలు కాదు.

చెన్నై టీమ్‌కు తెలుగోడు లేని లోటు: అంబటి అవసరం: గాయంపై ఇదీ అప్‌డేట్: రీఎంట్రీపై ధోనీచెన్నై టీమ్‌కు తెలుగోడు లేని లోటు: అంబటి అవసరం: గాయంపై ఇదీ అప్‌డేట్: రీఎంట్రీపై ధోనీ

మిస్టర్ ఐపీఎల్ కోసం

ఈ పరిస్థితుల్లో.. మిస్టర్ ఐపీఎల్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ పట్టుబడుతున్నారు. అతను మళ్లీ బరిలోకి దిగాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అతనొస్తే గానీ- విజయావకాశాలు మెరుగుపడబోవనీ కుండబద్దలు కొడుతున్నారు. మిడిల్ ఆర్డర్‌లో అతని బ్యాటింగ్.. మిడిల్ ఓవర్లలో అతని బౌలింగ.. మిడాన్‌పై అతని ఫీల్డింగ్.. జట్టును విజయ తీరాలకు చేర్చుతాయనీ అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ గళాన్ని విప్పుతున్నారు. ఈ ఐపీఎల్ సీజన్‌కు దూరంగా ఉండాలనే నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలనీ కోరుతున్నారు.

ఆల్‌రౌండర్ సురేష్ రైనా..

అతనే- సురేష్ రైనా. చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్. సురేష్ రైనా ఈ సీజన్‌లో ఆడట్లేదు. ఇదివరకు టీమ్‌తో కలిసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దాకా వెళ్లిన అతను అర్ధాంతరంగా స్వదేశానికి తిరిగొచ్చాడు. సీజన్‌కు దూరంగా ఉంటున్నాడు. హర్భజన్ సింగ్ టోర్నమెంట్‌లో ఆడట్లేదు. వారిద్దరూ దూరం కావడం వల్ల బ్యాటింగ్, బౌలింగ్ సమతుల్యాన్ని కోల్పోయిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. వ్యక్తిగత కారణాలతో సురేష్ రైనా ఐపీఎల్ టోర్నీకి దూరంగా ఉంటున్నాడు. ఆ కారణాలేమిటనేది బహిర్గతం కావట్లేదు.

రైనా రావాలంటూ..

అదెలా ఉన్నా.. సురేష్ రైనా టోర్నమెంట్ మొత్తానికీ అందుబాటులో లేకపోవడం ఆల్‌రౌండర్‌ను కోల్పోయినట్టయింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో సురేష్ రైనా మెరుపులు మెరిపిస్తాడు. అతని మెరుపు ఫీల్డింగ్‌కు ఇప్పటికే చాలామంది బ్యాట్స్‌మెన్లు బలి అయ్యారు. రనౌట్‌గా తమ వికెట్లను సమర్పించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. మెరుపు క్యాచ్‌కూ అతను పెట్టింది పేరు. గ్రౌండ్‌లో చిరుతలా కదులుతుంటాడు. తన ఆఫ్ స్పిన్ మాయాజాలంలో ఎలాంటి బ్యాట్స్‌మెన్‌ను అయినా ముప్పుతిప్పలు పెడుతుంటాడు. భారీ షాట్లకూ రైనా కేరాఫ్ అడ్రస్. అతను మళ్లీ జట్టుతో కలవాలని, క్రీజ్‌లో దిగాలనీ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

వరుసగా రెండో ఓటమి..

ఆ తరువాత ఆడిన రెండు మ్యాచుల్లోనూ చెన్నై సూపర్‌కింగ్స్ ఓడిపోయింది. రాజస్థాన్ రాయల్స్‌ మ్యాచ్‌లో భారీ స్కోరును ఛేదించలేకపోయింది. రాజస్థాన్ రాయల్స్ టీమ్.. చెన్నైపై 217 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిదంటే.. సురేష్ రైనా, హర్భజన్ సింగ్ లేకపోవడమేననే అభిప్రాయాలు ఉన్నాయి. ఆ మ్యాచ్‌లో 200 పరుగులకు చెన్నై సూపర్ కింగ్స్ ఆలౌట్ అయింది. మిడిల్ ఆర్డర్‌లో సురేష్ రైనా ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదనీ చెబుతున్నారు ఫ్యాన్స్. శుక్రవారం రాత్రి నాటి మ్యాచ్‌లోనూ ఇదే పరిస్థితి. ఢిల్లీ కేపిటల్స్ నిర్దేశించిన 175 పరుగులను అందుకోలేక చతికిలపడింది. ఏడు వికెట్లను కోల్పోయి 131 పరుగుల వద్దే ఆగిపోయింది. ఈ రెండు ఓటుములతో సురేష్ రైనా మళ్లీ వెనక్కి రావాలనే డిమాండ్‌కు కారణమైంది.

English summary
CSK vice-captain Suresh Raina had flown to the UAE along with the team in August, but returned home a week later citing ‘personal reasons’. CSK fans demand for Suresh Raina should rethink his decision and join the team. Fans made Come back Mr IPL, Coma back ChinnaThala as trend.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X