వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Covid 19: చైనాలో బిజినెస్ మూసేసిన ఫ్రెంచ్ రెనో, కారణమిదే

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి నేపథ్యంలో పలు కంపెనీలు చైనా నుండి బయటకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే డ్రాగన్ కంట్రీ నుండి తమ దేశానికి వచ్చే కంపెనీల కోసం జపాన్ పెద్ద మొత్తంలో ప్యాకేజీని సిద్ధం చేసింది. చైనా నుండి పెట్టుబడులు, పరిశ్రమలు ఉపసంహరించుకోవాలని చాలా కంపెనీలు యోచిస్తున్నాయి. భారత ప్రధానికి ఇటీవల వివిధ పరిశ్రమలు కూడా ఇందుకు సంబంధించి విజ్ఞప్తి చేశాయి. చైనా నుండి కంపెనీలు తరలి వెళ్లేందుకు యోచిస్తున్నాయని, వాటిని ఆకర్షించే ప్రయత్నం చేయాలని లేఖ రాశాయి.

కరోనా ఎంత పని చేసింది?: బంగారం రికార్డ్ ధరలు, మూడేళ్లు ఇంతేనా? రూ.7,000 పెరుగుదల!

చైనాలో మా ప్రధాన వ్యాపారం క్లోజ్

చైనాలో మా ప్రధాన వ్యాపారం క్లోజ్

చైనాలో తమ ప్రధాన వ్యాపారాన్ని క్లోజ్ చేస్తున్నట్లు కార్ల తయారీ కంపెనీ రెనో ప్రకటించింది. ఇక నుండి ఎలక్ట్రిక్, వాణిజ్య వాహనాలపై దృష్టి సారిస్తామని తెలిపింది. స్థానిక డెంగ్‌ఫెంగ్ మోటార్ కార్ప్‌తో కలిసి ఈ ఫ్రెంచ్ కంపెనీ ఏడేళ్లుగా వ్యాపారం చేస్తోంది. కరోనా కారణంగా డిమాండ్ పడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు.

వూహాన్‌లోనే రెనో ఫ్యాక్టరీ

వూహాన్‌లోనే రెనో ఫ్యాక్టరీ

ఆటో ఇండస్ట్రీకు చైనా అతి పెద్ద మార్కెట్. పోటీ ఎక్కువగా ఉండటంతో 2017 నుండి రెనో విక్రయాలు తగ్గిపోయాయి. ఈ ఏడాది మొదటి క్వార్టర్‌లో సేల్స్ 45 శాతానికి పైగా పడిపోయాయి. కరోనాను నియంత్రించేందుకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని చెప్పడంతో డీలర్‌షిప్స్ క్లోజ్ అయ్యాయి. కరోనా పుట్టిన వూహాన్‌లోనే రెనో ఫ్యాక్టరీ ఉంది.

ఎలక్ట్రిక్, వాణిజ్య వాహనాలపై దృష్టి

ఎలక్ట్రిక్, వాణిజ్య వాహనాలపై దృష్టి

అయితే చైనా మార్కెట్లో ఎలక్ట్రిక్, వాణిజ్య వాహనాలపై దృష్టి సారించి ఉనికి చాటుకుంటామని రెనో ప్రకటించింది. ఈజీటీ ఎనర్జీ, ఆటోమోటివ్ కంపెనీ, నిస్సాన్ మోటార్ కంపెనీతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసి ఎలక్ట్రిక్ వాహనాలు ఉత్పత్తి చేస్తామని తెలిపింది. చెల్లించాల్సిన రుణాలు వందల కోట్లలో ఉండటంతో 2019 డివిడెండ్ రద్దు చేస్తున్నామని, చైర్మన్ శాలరీలో కోత విధిస్తున్నట్లు పేర్కొంది.

Recommended Video

PM Modi To Address Nation To Announce Whether The Lockdown Will End Or Not.
ఆర్థికమాంద్యంతో చైనా ఇబ్బంది

ఆర్థికమాంద్యంతో చైనా ఇబ్బంది

ఆటోమొబైల్ రంగానికి దిక్సూచిగా ఉన్న చైనా ప్రస్తుతం ఆర్థికమాంద్యంతో ఇబ్బంది పడుతోంది. ఇప్పుడు రెనో విద్యుత్, కమర్షియల్ వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపింది. కాగా, చైనాలో జాయింట్ వెంచర్ ఫలప్రదం కాలేదని డాంగ్‌ఫెంగ్ పేర్కొంది.

English summary
Renault has decided to stop selling petrol cars in China, pulling out of its lossmaking joint venture with Dongfeng and reversing a strategy put in place with great fanfare by former boss Carlos Ghosn.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X