చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ట్యాక్సీ డ్రైవర్ కుమారుడికి ఓపెన్ హార్ట్ సర్జరీ..సహాయం కోసం ఎదురు చూపులు

Google Oneindia TeluguNews

చెన్నై: చెన్నైలో నివ‌సించే ఓ ఆరేళ్ల బాలుడికి అత్య‌వ‌స‌రంగా ఓపెన్ హార్ట్ స‌ర్జ‌రీ చేయాల్సి ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఓపెన్ హార్ట్ స‌ర్జ‌రీ అంటే ఎంత ఖ‌ర్చుతో కూడుకున్నదో మ‌న‌కు తెలుసు. ధ‌నిక కుటుంబాలు సైతం ఓపెన్ హార్ట్ స‌ర్జ‌రీకి అయ్యే ఖ‌ర్చును భ‌రించ‌డానికి వెనుకాడ‌తాయి. అదే దుస్థితిని ఓ నిరుపేద ట్యాక్సీ డ్రైవ‌ర్ ఎదుర్కొంటున్నారు. చెన్నైలో ట్యాక్సీ న‌డుపుకొంటూ జీవనాన్ని సాగిస్తోన్న ఓ వ్య‌క్తి కుమారుడికి ఓపెన్ హార్ట్ స‌ర్జ‌రీని అత్య‌వ‌స‌రంగా నిర్వ‌హించాల్సి ఉంది. స‌కాలంలో ఈ శస్త్ర చికిత్స‌ను చేయ‌క‌పోతే- ఆ బాలుడి జీవించ‌డం క‌ష్ట‌మ‌ని డాక్ట‌ర్లు తెలిపారు. ఓపెన్ హార్ట్ స‌ర్జ‌రీ కోసం 10 ల‌క్ష‌ల రూపాయ‌లు అవ‌స‌రం అవుతాయ‌ని డాక్ట‌ర్లు వెల్ల‌డించారు.

ఆ బాలుడి పేరు దీప‌క్‌. వ‌య‌స్సు ఆరు సంవ‌త్స‌రాలు. అత‌ని తండ్రి చెన్నైలో ట్యాక్సీ డ్రైవ‌ర్‌. త‌ల్లి గ‌జ‌ల‌క్ష్మి గృహిణి. స్థానిక పాఠ‌శాల‌లో చ‌దువుకుంటున్నాడు. మూడేళ్ల కింద‌ట స్కూలుకు వెళ్లిన దీప‌క్‌.. త‌ర‌గ‌తిలోనే కుప్ప‌కూలిపోయాడు. ఈ విష‌యాన్ని ఫోన్ ద్వారా దీప‌క్ తండ్రికి తెలియ‌జేశారు టీచ‌ర్లు. ప‌రుగు ప‌రుగున స్కూలుకు వెళ్లి దీప‌క్‌ను ఎత్తుకుని ఆసుప‌త్రికి తీసుకెళ్లాడు. అత‌ణ్ని ప‌రీక్షించిన డాక్ట‌ర్లు కొన్ని మందుల‌ను ఇచ్చారు. నా కుమారుడు త‌ర‌గ‌తి గ‌దిలో కుప్ప‌కూలిపోయాడ‌ని అంటూ అత‌ను చ‌దువుతున్న స్కూలు నుంచి ఫోన్ కాల్ వ‌చ్చిన రోజు నా జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. కొన్ని నెల‌ల కింద‌టే అత‌నికి మూడేళ్లు నిండాయి. అప్పుడ‌ప్పుడే స్కూలుకు వెళ్ల‌డాన్ని అల‌వాటు చేసుకున్నాడు. ఫోన్ కాల్ వ‌చ్చిన రోజు స్కూలుకు వెళ్లి, నా కుమారుడిని ఆసుప‌త్రికి తీసుకెళ్లాను.. అని దీప‌క్ తండ్రి వెల్ల‌డించారు.

deepak needs an urgent open heart surgery but his parents cant afford it

త‌న కుమారుడిని ఆ స్థితిలో చూసి నా భార్య గ‌జ‌ల‌క్ష్మి తీవ్ర ఆందోళ‌న‌కు గురైందని తెలిపారు. తాను ఆమెను ఓదార్చానని, భ‌య‌ప‌డాల్సిందేమీ లేద‌ని చెప్పానని దీప‌క్ తండ్రి అన్నారు. అయితే త‌న అంచ‌నా త‌ప్పయింద‌ని అన్నారు. మందులను వాడ‌టాన్ని మానివేసిన వెంట‌నే దీప‌క్‌ పెద‌వులు, నాలుక నీలం రంగులోకి మారిపోతున్నాయ‌ని, శ్వాస తీసుకోవ‌డానికి కూడా అత‌ను ఇబ్బంది ప‌డ్డాడని అన్నారు. తాము చాలా భ‌య‌ప‌డ్డామ‌ని, అత‌ని ఆరోగ్యానికి ఏమైంద‌ని ఆందోళ‌న చెందామ‌ని అన్నారు. వెంట‌నే దీప‌క్‌ను మ‌ళ్లీ ఆసుప‌త్రికి తీసుకెళ్ల‌గా.. డాక్ట‌ర్లు ప‌రీక్షలు చేశారు. ఆ స‌మ‌యంలో త‌ల్లిదండ్రులు కొన్ని గంట‌ల పాటు ఆసుప‌త్రి వ‌రండాలో న‌ర‌క‌యాత‌న అనుభ‌వించారు. దీప‌క్‌ను ప‌రీక్షించిన సిబ్బంది- డాక్ట‌ర్‌ను క‌ల‌వాల‌ని సూచించారని తెలిపారు. తాను భ‌య‌ప‌డుతూనే డాక్ట‌ర్ క్యాబిన్‌కు వెళ్ల‌గా, ఆయ‌న ముఖంలో విచారం నిండి ఉండ‌టాన్ని తాను గ‌మ‌నించాన‌ని అన్నారు.

దీప‌క్ గుండెలో కొన్ని స‌మ‌స్య‌లు ఉన్నాయి. అత‌ని జీవితం ప్ర‌మాదంలో ప‌డింది.. అని డాక్ట‌ర్ తెలిపార‌ని, అది విన్న త‌న‌కు నోట మాట రాలేదని, తానేమీ చేయ‌లేని స్థితిలో ప‌డిపోయానని దీప‌క్ తండ్రి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌న కుమారుడికి ఆ ప్రాణాంత‌క వ్యాధి ఎలా వ‌చ్చిందనే విష‌యాన్ని తాను న‌మ్మ‌లేక‌పోతున్నానని అన్నారు. అనంత‌రం వేరే ఆసుప‌త్రుల‌కు రిపోర్టులు తీసుకుని వెళ్లి, విచారించ‌గా.. ప్ర‌తి డాక్ట‌ర్ అదే విష‌యాన్ని చెప్పారని ట్యాక్సీ డ్రైవ‌ర్ అన్నారు. డాక్ట‌ర్లు చెప్పింది విని తాము విషాదంలో మునిగిపోయామ‌ని అన్నారు. దీప‌క్‌కు అత్య‌వ‌స‌రంగా చికిత్స అందించాల‌ని డాక్ట‌ర్లు తెలిపారని, అది విన్న త‌రువాత షాక్ నుంచి కోలుకోవ‌డానికి కొంత స‌మ‌యం ప‌ట్టిందని అన్నారు. వెంట‌నే మా కుమారుడి వైద్య చికిత్స‌ను ఆరంభించామ‌ని అన్నారు.

deepak needs an urgent open heart surgery but his parents cant afford it

మూడేళ్లుగా మా కుమారుడి అనారోగ్యం పెరిగిపోతూనే వ‌స్తోంది.దీప‌క్ సొంతంగా న‌డ‌వ‌లేడని, బ‌ల‌వంతంగా ఒక నిమిషం పాటు న‌డిచినా, ఆ వెంట‌నే అత‌ని పెద‌వులు, నాలుక నీలం రంగులోకి మారిపోతాయని అన్నారు. తీవ్రమైన‌ బాధ‌ను అనుభ‌విస్తాడని చెప్పారు. చిన్న చిన్న ప‌నులను చేయ‌డానికి కూడా క‌ష్ట‌ప‌డతాడని, ఆసుప‌త్రి ప‌డ‌క మీద ప‌డుకుని గంట‌ల కొద్దీ ఏడుస్తూ గ‌డుపుతున్నాడని అన్నారు. త‌న ఏకైక కుమారుడి క‌ష్టాన్ని చూస్తే గ‌జ‌ల‌క్ష్మి క‌న్నీరు మున్నీరు అవుతోంద‌ని ట్యాక్సీ డ్రైవ‌ర్ వాపోయారు. ఇంత తీవ్ర‌మైన నొప్పితో బాధ‌ప‌డుతున్న నా కుమారుడిని చూడ‌లేక‌పోతున్నామని క‌న్నీరు మున్నీరు అయ్యారు.

డాక్ట‌ర్లు రాసిచ్చిన మందులు ఎందుకు ప‌నిచేయ‌ట్లేద‌నే విష‌యం త‌మ‌కు అర్థం కావ‌ట్లేదని, అత‌న్ని మ‌ళ్లీ ఆసుప‌త్రికి తీసుకెళ్లగా దీప‌క్ జీవితాన్ని కాపాడ‌టానికి ఒకే ఒక్క అవ‌కాశం ఉంద‌ని, అత్య‌వ‌స‌రంగా అత‌నికి ఓపెన్ హార్ట్ స‌ర్జ‌రీ చేస్తే జీవిస్తాడ‌ని, దీనికి 10 ల‌క్ష‌ల రూపాయ‌లు (14,231 డాల‌ర్లు) అవ‌స‌రం అవుతాయ‌ని డాక్ట‌ర్లు తెలిపారని ఆ నిరుపేద ట్యాక్సీ డ్రైవ‌ర్ చెప్పారు. డాక్ట‌ర్లు చెప్పిన మాట విని త‌న‌కు క‌న్నీరు ఆగ‌లేదని అన్నారు. ఎలాంటి క‌ష్ట‌మైన ప‌ని చేసిన‌ప్ప‌టికీ.. అంత మొత్తాన్ని నేను స‌మ‌కూర్చుకోలేనని చెప్పారు. తాను చెప్పింది విని గ‌జ‌ల‌క్ష్మి ఆసుప‌త్రిలోనే కుప్ప‌కూలిపోయిందని,ఎలాగైనా నా కుమారుడిని బ‌తికించు.. అంటూ ప్రాధేయ‌ప‌డింద‌ని దీప‌క్ తండ్రి ఆవేద‌న‌తో వెల్ల‌డించారు.

deepak needs an urgent open heart surgery but his parents cant afford it

కుమారుడికి చికిత్స అందించ‌డం మొద‌లు పెట్టిన‌ప్ప‌టి నుంచీ బ్యాంకుల్లో దాచుకున్న కొద్దిపాటి డ‌బ్బులు, గ‌తంలో కొనుక్కున్న చిన్న చిన్న వ‌స్తువులన్నీ ఆవిరి అయిపోయాయని దీప‌క్ తండ్రి చెప్పారు. త‌న‌ త‌ల్లిదండ్రుల నుంచి కొంత మొత్తాన్ని తీసుకున్నానని, అయితే పేద‌రికం వ‌ల్ల వాళ్లు కూడా అంత భారీగా డ‌బ్బులను ఇవ్వ‌లేక‌పోతున్నార‌ని చెప్పారు. నా కుమారుడి జీవితాన్ని కాపాడుకోవ‌డానికి నాకు ఇక ఇంత‌కంటే మ‌రో దారి లేదు. ఇదే నా చివ‌రి ప్ర‌య‌త్నం. అందుకే- మీ ద‌యార్ద్ర హృద‌య‌మే నా కుమారుడిని కాపాడగ‌లుగుతుంది. ద‌య‌చేసి స‌హాయం చేయండి.. అని దీప‌క్ తండ్రి వేడుకుంటున్నారు.

తెల్ల‌వారు జామున 5 గంట‌ల‌కు త‌న‌ ట్యాక్సీని డ్రైవ్ చేయ‌డం ద్వారా దిన‌చ‌ర్య‌ను ఆరంభిస్తాన‌ని, చెన్నై ర‌ద్దీ రోడ్ల మీదుగా నేను కారును న‌డుపుకొంటూ వెళ్తుంటాన‌ని అన్నారు. త‌న కారులో ఎక్కిన చిట్ట చివ‌రి ప్ర‌యాణికుడిని అత‌ని గ‌మ్య‌స్థానానికి చేర్చేట‌ప్ప‌టికీ రాత్రవుతుంద‌ని, కొన్ని బిస్కెట్ల‌ను తిని ఆసుప‌త్రికి వెళ్తాన‌ని అన్నారు. కొన్నేళ్లుగా త‌న దిన‌చ‌ర్య ఇలాగే సాగుతోంద‌ని అన్నారు. ఏ ఒక్క‌రోజు కూడా ట్యాక్సీని న‌డ‌ప‌క‌పోతే తాను ఆదాయం రాదనే విష‌యం తెలుసని అన్నారు. తాను సంపాదించే ఆదాయంలో ప్ర‌తి పైసా కూడా నా ఆరేళ్ల కుమారుడి జీవితానికి ఎంతో అవ‌స‌రం అవుతుందని ఆ ట్యాక్సీ డ్రైవ‌ర్ వాపోయారు. మీరు దీపక్‌కు సహాయం చేయాలనుకుంటే క్లిక్ చేయండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X