• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కోహ్లీ, అనూష్కశర్మపై సెక్సీయెస్ట్ కామెంట్స్ రచ్చ: కామెంటరీ బాక్స్‌లో గవాస్కర్: మరోసారి క్లారిటీ

|

ముంబై: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కేప్టెన్ విరాట్ కోహ్లీ, ఆయన భార్య బాలీవుడ్ నటి అనూష్క శర్మపై తాను సెక్సీయెస్ట్ కామెంట్స్ చేశానంటూ వచ్చిన వార్తలపై లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఐపీఎల్ 2020 సీజన్ 13వ ఎడిషన్‌లో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో శుక్రవారం రాత్రి ఢిల్లీ కేపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ కామెంటరీ బాక్స్‌లో ఆయన ప్రత్యక్షం అయ్యారు. తాను చేసిన వ్యాఖ్యలపై మరోసారి క్లారిటీ ఇచ్చారు.

  IPL 2020 : Don’t Trust Headlines, Hear What I Said - Sunil Gavaskar || Oneindia Telugu

   Fit India 2020: ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన విరాట్ కోహ్లీ...ప్రధాని మోడీతో ఆన్‌లైన్ ముచ్చట Fit India 2020: ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన విరాట్ కోహ్లీ...ప్రధాని మోడీతో ఆన్‌లైన్ ముచ్చట

  హెడ్‌లైన్లు నమ్మొద్దు

  హెడ్‌లైన్లు నమ్మొద్దు

  విరాట్ కోహ్లీ, అనూష్క శర్మలపై తాను ఎలాంటి సెక్సీయెస్ట్ కామెంట్స్ చేయలేదని సునీల్ గవాస్కర్ క్లారిటీ ఇచ్చారు. హెడ్‌లైన్లను మాత్రమే చదివి వదిలేయడం సరి కాదని, వార్త సారాంశం మొత్తాన్నీ చదవాలని సూచించారు. ఏదైనా చెబితేా.. దాన్ని సారాంశాన్ని అర్థం చేసుకోవాలని అన్నారు. లాక్‌డౌన్ సమయంలో విరాట్ కోహ్లీ ప్రాక్టీస్‌కు దూరం అయ్యారని మాత్రమే తాను చెప్పాలనని వెల్లడించారు. తన ఇంటి టెర్రస్‌పై అనూష్క శర్మ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ ఎలా ప్రాక్టీస్ చేశాడనే విషయాన్ని సోషల్ మీడియాలో విడుదలైన ఓ వీడియో ద్వారా అందరూ చూశారని గుర్తు చేశారు.

  అనూష్క శర్మ బౌలింగ్‌లో

  అనూష్క శర్మ బౌలింగ్‌లో

  అనూష్క శర్మ బౌలింగ్‌లో మాత్రమే విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ చేశాడని అర్థం వచ్చేలా తాను మాట్లాడానని సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను మరీ మరీ చూడాలని తాను కోరుతున్నానని, ఆ తరువాత ఏం చెప్పదలచుకున్నారో చెప్పండని ఆయన ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు. తాను ఎలాంటి సెక్సీయెస్ట్ కామెంట్స్ చేయలేదని, ఎవ్వర్నీ కించపరచలేదని చెప్పారు. లాక్‌డౌన్‌లో ఇంటి పట్టునే ఉండటం వల్ల విరాట్ కోహ్లీ ప్రాక్టీస్‌ను కోల్పోయాడని, అందుకే మ్యాచ్‌లో లయ తప్పాడని తాను వ్యాఖ్యానించానని అన్నారు.

   కోహ్లీ వైఫల్యంపై సునీల్ గవాస్కర్..

  కోహ్లీ వైఫల్యంపై సునీల్ గవాస్కర్..

  ఐపీఎల్-2020 సీజన్ 13వ ఎడిషన్‌లో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ మధ్య గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ నాసిరకంగా ఫీల్డింగ్ చేశాడు. బ్యాక్ అండ్ బ్యాక్ క్యాచ్‌లను వదిలేశాడు. దాని ఫలితంగా కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ టీమ్ భారీ స్కోరును సాధించింది. ఛేజింగ్‌లో చెలరేగిపోయే కోహ్లీ.. బ్యాటింగ్‌లోనూ రాణించలేకపోయాడు. అయిదు బంతులను ఎదుర్కొన్న అతను ఒక పరుగుకే అవుట్ అయ్యాడు.

  అసలేంటీ కామెంట్స్..

  అసలేంటీ కామెంట్స్..

  అయిదు బంతులను మాత్రమే ఆడిన విరాట్ కోహ్లీ.. షెల్డన్ కాట్రెల్ బౌలింగ్‌లో రవి బిష్ణోయ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు. అప్పటికి జట్టు స్కోరు నాలుగు పరుగులే. కొండంత లక్ష్యం ముందున్నప్పటికీ.. దాన్ని అందుకునే స్థాయిలో ఆడలేకపోయాడు. విరాట్ కోహ్లీ అవుటైన వెంటనే టీమిండియా లెజెండరీ బ్యాట్స్‌మెన్ సునీల్ గవాస్కర్.. ఓ హాట్ కామెంట్ చేశాడు. డబుల్ మీనింగ్ వచ్చేలా మాట్లాడాడు. `లాక్‌డౌన్ సమయంలో అతను ఇంట్లో అనూష్య శర్మ బంతులతో ప్రాక్టీస్ చేశాడు` అంటూ ఓ హాట్ కామెంట్ విసిరాడు. అది కాస్తా కోహ్లీ ఫ్యాన్స్‌నే కాదు.. ఇటు అనూష్మ అభిమానులను కూడా ఆగ్రహానికి గురి చేసింది.

  English summary
  “Watch the video again. Listen to it again and then say whatever you want. Don’t trust the headlines, watch the video on your own. My conscience is clear,” Sunil Gavaskar added.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X