• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కమల భర్త ఎమోషనల్ పోస్ట్ -50ఏళ్ల వయసులో పెళ్లి -బ్రాహ్మణ-యూదు కాంబో -అభాండాలు

|

అమెరికా ఎన్నికల తుది ఫలితాలను సెర్చ్ చేయడం మానేశారా? విజేతలెవరో తేలాక మెజార్టీ లెక్కలు మాకెందుకంటారా? పర్లేదు, మనం ఎంత వెతికినా ఫలితం ''జోబైడెన్ 290 ఓట్లు.. ట్రంప్ 214 ఓట్లు''అనే కనిపిస్తుంది. కనీసం ఇంకో రెండు రోజుల వరకైనా ఆ ఫిగర్ లో మార్పు ఉండబోదు. ఎందుకంటే ఇంకా 12 రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసా....గుతూనే ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ఈనెల 12 దాకా పోస్టల్ బ్యాలెట్లను స్వీకరించే వెసులుబాటు ఉండటంతో ప్రక్రియ నిదా...నంగా నడుస్తోంది. పదవి నుంచి దిగిపోడానికి ఇంకా సమయం ఉండటంతో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన ప్రయత్నాలేవో తాను చేసుకుంటున్నారు. ఇక విజేతలుగా నిలిచిన..

బీహార్ షాక్: విజేతలుగా మోదీ-తేజస్వీ -సీఎం నితీశ్ భారీ మూల్యం -అద్వానీ 30ఏళ్ల కల నెరవేరేలా..

డగ్లస్ ఎమ్హాఫ్ భావోద్వేగం..

డగ్లస్ ఎమ్హాఫ్ భావోద్వేగం..

ప్రెసిడెంట్ ఎలెక్ట్ జోబైడెన్, వైస్ ప్రెసిడెంట్ ఎలెక్ట్, భారత సంతతి సెనేటర్ కమలా హ్యారిస్‌పై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తున్నది. తాజాగా టర్కీ అధినేత తయీప్ ఎర్దొగాన్ సైతం ఆ ఇద్దరికి విషెస్ చెప్పారు. అయితే అందరిలోకి కమలా హ్యారిస్ భర్త డగ్లస్ ఎమ్హాఫ్ సోషల్ మీడియా పోస్ట్ ఒకటి నెట్టింట వైరల్ అయింది. భార్య విజయం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ డగ్లస్ గత వారం ఈ భావోద్వేగ పోస్ట్ చేశారు. కమలాను అప్యాయంగా కౌగిలించుకుని ఉన్న ఓ పాత ఫొటోను పోస్ట్ చేసిన డగ్లస్... దానికి "సో ప్రౌడ్ ఆఫ్ యూ" అనే క్యాప్షన్ జత చేశారు. ఈ భావోద్వేగ పోస్ట్‌కు ఇన్‌స్టాలో ఏకంగా 4,97,209 లైక్స్ వచ్చాయి. ఈ సందర్భంగా..

బీహార్: కొంపముంచిన 11సీట్లు -52 స్థానాల్లో తేడా 5వేల లోపే -అత్యధిక, అత్యల్ప మెజార్టీలివే

అమెరికా ఫస్ట్ ‘సెకండ్ జెంటిల్‌మన్’

అమెరికా ఫస్ట్ ‘సెకండ్ జెంటిల్‌మన్’

డగ్లస్ పోస్టు వైరల్ అయింది. నెటిజన్లు కమల దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఓ ఫాలోవర్ అయితే ‘‘మేడమ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ సెకండ్ జెంటిల్‌మన్'' అంటూ కామెంట్ పెట్టారు. ఇన్‌స్టాగ్రాంలో 12.2 మిలియన్ల ఫాలోవర్స్‌ కలిగిన కమల.. గత శనివారం నాటి విక్టరీ స్పీచ్ సందర్భంలో తన భర్త డగ్లస్‌ను పరిచయం చేస్తూ ‘‘మీట్ ద లవ్ ఆఫ్ మై లైఫ్, డగ్లస్ ఎమ్హాఫ్''అని క్యాప్షన్ ఇచ్చారు. 28 లక్షలకు పైగా లైక్స్ తో ఈ పోస్ట్ కూడా చాలా వైరల్ అయింది. డగ్లస్ కూడా ఈ ఫొటోను రిపోస్టింగ్ చేసి.. ‘‘లవ్ యూ మేడమ్ వైస్ ప్రెసిడెంట్ ఎలెక్ట్'' అని కామెంట్ చేశారు. ఆరేళ్లుగా అన్యోన్య దంపతులుగా వెలుగొందుతోన్న ఈ ఇద్దరూ 50ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవడం గమనార్హం..

కమలపై భయానక అభాండాలు..

కమలపై భయానక అభాండాలు..

2014లో డగ్లస్‌తో కమలా వివాహం అధికారికంగా జరిగింది. డగ్లస్‌కు ఇది రెండో వివాహం కాగా... కమలాకు మొదటిది. దంపతులిద్దరూ కూడా లాయర్లే. కెరీర్ ఆరంభంలో కమల.. డగ్లస్ దగ్గర జూనియర్ గా పనిచేసేది. ‘‘వారిది లవ్ ఎట్ ఫస్ట్ సైట్''అని మాజీ స్నేహితులు కామెంట్లు చేస్తుంటారు. ప్రత్యర్థులు మాత్రం ‘తన కెరీర్ కోసం కమల పదవుల్లో ఉన్నవాళ్లను వాడుకుంది''అని అభాండాలు మోపారు. లాయర్ నుంచి రాజకీయ రంగంలో ఆమె ఎదుగుదల అంత ఈజీగా సాగిందేమీ కాదు. ‘‘కమల తండ్రి జమైకన్. అంటే అమెరికా కాంటినెంట్. తండ్రి రంగు తప్ప అసలామెకు ఆఫ్రికా మూలాలే లేవు. కెరీర్ లో ఏనాడూ నల్లజాతీయుల కోసం పోరాడలేదు. కేవలం రాజకీయాల కోసమే తన బ్లాక్ ఐడెంటిటీని ముందుకు తెచ్చారు''అని సాక్ష్యాత్తు డొనాల్డ్ ట్రంప్ కొడుకులు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేనా..

  Ys Jagan Congratulates Kamala Harris | Indians, No Need To Celebrate Kamala Harris Win - Netizens
  బ్రాహ్మణ-యూదు కాబినేషన్..

  బ్రాహ్మణ-యూదు కాబినేషన్..

  90వ దశకంలో కమల తన తండ్రికంటే పెద్ద వయసున్న విల్లీ బ్రౌన్(కాలిఫోర్నియా అసెంబ్లీ స్పీకర్)తో డేటింగ్ చేశారని, దీనిపై బ్రౌన్ భార్య గొడవలు కూడా పడ్డారని డెమోక్రాట్ వ్యతిరేక ప్రాపగండా పేర్కొంది. అయితే వీటిని కమల సమర్థవంతంగా తిప్పికొట్టారు. పేరుకు అగ్రరాజ్యం, ఆధునిక దేశం అయినా అమెరికాలోనూ మహిళల పట్ల.. మరీ ముఖ్యంగా రాజకీయ రంగంలో రాణించే ఆడవారి పట్ల ‘క్యారెక్టర్ అసాసినేషన్' కుట్రలను తన చర్యలతోనే ఆమె ఎడగట్టారు. డేటింగ్ ల పరంపరకు ఫుల్ స్టాప్ పెడుతూ.. కమల తన 50వ ఏట డగ్లస్ ను పెళ్లాడింది. ఆమె తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందినది కావడం, ఆయన యూదు జాతీయుడు కావడంతో వీళ్లిద్దరినీ ‘టాంబ్రామ్-జ్యూ'(తమిళ బ్రాహ్మణ-యూదు) కాంబినేషన్ గా గిట్టని వాళ్లు కుళ్లుకుంటారు. కమల దంపతులు మాత్రం వీటిని పట్టించుకోకుండా సాగిపోతుంటారు. మొదటి భార్య ద్వారా డగ్లస్ కు కలిగిన ఇద్దరు పిల్లలూ ప్రస్తుతం కమలతోనే కలిసుంటున్నారు. మామ్ ప్లస్ కమల అనే అర్థంలో ‘మమలా'అని ఆ పిల్లలు పిలచే పిలుపు తన జీవితంలో తీయనైనదని కమల హ్యారిస్ చెబుతుంటారు.

  English summary
  the most heartwarming and emotional message has come from none other than her husband Doug Emhoff, who shared a very short post on Instagram along with a delightful picture. Emhoff shared a picture of him hugging Harris at a picturesque location. The post was captioned: "So proud of you. usus"
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X