వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సహాయం చేద్దాం: బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న ఐదేళ్ల చిన్నారి దృష్టి

Google Oneindia TeluguNews

ఆడపిల్ల పుట్టిందని ఆ తల్లిదండ్రులు ఎంతో సంబరపడ్డారు. మహాలక్ష్మీ తన ఇంట్లో అడుగుపెట్టిందని అబ్బురపడ్డారు. కానీ ఆ ఆనందం ఎంతో కాలంగా ఆ తల్లిదండ్రులతోలేదు. ఆ చిన్నారికి ఐదేళ్లు రాగానే ఓ మహమ్మారి కాటేసింది. దృష్టి అనే ఐదేళ్ల చిన్నారి అప్పటి వరకు డ్యాన్సులు చేస్తూ చాలా సంబరంగా ఉండేది. ఇంట్లో నడియాడుతుంటే ఆ ఇంటికే కల వచ్చేది. ఇప్పుడు ఆ ఇంట్లో సందడి కనిపించడం లేదు. ఎందుకంటే చిన్నారి దృష్టి బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతోంది. అంతేకాదు చూపుకూడా పాక్షికంగా కోల్పోయింది.

తన బిడ్డకు దృష్టి అని పేరుపెట్టుకున్నామని అయితే ఆ చిన్నారి ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతోందని అదే సమయంలో చూపును కూడా క్రమంగా కోల్పోయిందని తల్లి రీతూ మల్హోత్రా ఆవేదన వ్యక్తం చేసింది. మార్చి 2019లో తొలిసారిగా తనకు విపరీతమైన తలనొప్పి ఉందని , సరిగ్గా కళ్లు కనిపించడం లేదని తల్లి రీతూ మల్హోత్రతో చెప్పింది దృష్టి. వెంటనే ఆప్తమాలజిస్ట్ దగ్గరకు తీసుకెళ్లారు. ఎంఆర్ఐ స్కాన్ తీస్తే పాపకు ఉన్న సమస్య తెలుస్తుందని చెప్పారు డాక్టర్. స్కాన్ తీస్తే రీతూకు షాకిచ్చే వార్త చెప్పారు డాక్టర్లు. ఆమె మెదడులో 45 ఎంఎంల కణితి ఉందని చెప్పారు. ఇక పరీక్షలు జరిపే నాటికి చిన్నారి దృష్టి దాదాపుగా చూపు కోల్పోయింది.

Drishti Is Slowly Losing Her Eyesight due to Brain tumor

తన చిన్నారి ఇంతా బాధకు గురవుతోందని అయినప్పటికీ ఇంతకాలం వరకు భరించిందని చెప్పుకుంటూ కన్నీరు మున్నీరైంది రీతూ.తాను డ్యాన్స్ చేస్తే చూసేందుకు రెండు కళ్లు చాలవని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇప్పుడు మంచానికే పరిమితమైన తన కూతురును ఈ స్థితిలో చూడలేక ఉన్నానంటూ భోరున విలపించింది రీతూ. ప్రతిరోజు నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. దృష్టికి తొలిసారిగా మే 9న గురుగ్రాంలోని ఆర్టెమిస్ హాస్పిటల్‌‌లో సర్జరీ జరిగింది. ఆ తర్వాత ఆమె నెలరోజుల పాటు ఆస్పత్రిలోనే ఉంది. ఇక ఇదే సర్జరీ ఆమెలో చాలా మార్పులు తీసుకొచ్చాయి. మెదడులో ఉన్న కణితిని పూర్తిగా తొలగించలేదు. ఆ తర్వాత ఆగష్టు 1న దృష్టికి రెండో సారి సర్జరీ జరిగింది. ఇప్పుడు పూర్తిగా కోలుకోవాలంటే చిన్నారి దృష్టికి రేడియో థెరపీ చేయాలని వైద్యులు సూచించారు.

ఇంత చిన్న వయస్సులో అంత నొప్పిని, అంత బాధను తట్టుకునే శక్తిని భగవంతుడు దృష్టికి ఇచ్చాడనిపిస్తుందని తండ్రి కమల్ మల్హోత్ర చెప్పాడు.ఆమె నోరు తెరచి తమతో చెప్పనప్పటికీ లోపల ఆ బిడ్డ చెందుతున్న ఆవేదన తన కళ్లలో తెలుస్తోందంటూ ఆవేదన చెందారు. ఇక చిన్నారి దృష్టి కోలుకుని సాధారణ స్థితికి చేరుకునేందుకు చాలా కాలం పడుతుందని చెప్పిన కమల్... తప్పకుండా ఈ కఠిన సమయాన్ని దాటుకుని ముందుకు వస్తామనే ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు.

Drishti Is Slowly Losing Her Eyesight due to Brain tumor

రెండవ సర్జరీ జరిగిన సమయం నుంచి దృష్టితో పాటుగానే రీతూ మల్హోత్రా ఉంది. దృష్టి తండ్రి కమల్ ఒక చిరుద్యోగి. ప్రతిరోజు గుర్గావ్ నుంచి తన ఆఫీసు ఉన్న ఢిల్లీకి వెళుతూ వస్తూ ఉంటాడు.రేడియో థెరపీకి ఖర్చు రూ.5 లక్షలు అవుతుంది. ఇప్పుడు ఆ పసిబిడ్డను మీరు మాత్రమే కాపాడగలరు. మీరిచ్చే విరాళం ద్వారా పసిబిడ్డ బతికి మళ్లీ ఆ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. మంచి డ్యాన్సర్ కావాలన్న దృష్టి కోరికను నెరవేరుద్దాం. దృష్టి చికిత్సకు కావాల్సిన రూ. 5లక్షలు తోచినంతలో విరాళంగా ఇద్దాం. దృష్టి వ్యాధి గురించి, ఆమె ఆవేదన గురించి మీ మిత్రులకు చేరవేయండి. అదే సమయంలో దృష్టి గాధను సోషల్ మీడియాలో షేర్ చేసి ఆమె ప్రాణాలను కాపాడండి.

మీరు ఈ చిన్నారి ప్రాణాలు నిలబెట్టేందుకు మీవంతు సహాయం చేయాలంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X