• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ధోనీ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్: ఆ టాప్ బౌలర్ దూరం: బౌలింగ్ లైనప్ వీక్?: వారి మీదే డిపెండ్

|

అబుధాబి: ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తొలి సీజన్‌లో బోణీ కొట్టి, ఊపు మీదుంది చెన్నై సూపర్ కింగ్స్. ఆడిన తొలి మ్యాచ్‌లోనే టాప్ గేర్‌లోకి దూసుకెళ్లింది. ఆల్‌రౌండర్ ప్రతిభను ప్రదర్శించింది. తొలుత బౌలింగ్‌లో, ఆ తరువాత బ్యాటింగ్‌లో రాణించింది. ఫీల్డింగ్‌లో మెరుపులు మెరిపించింది. ముంబై ఇండియన్స్‌ నిర్దేశించిన లక్ష్యాన్ని అలవోకగా అందుకుంది. ఈ క్రమంలో సెంచరీ పార్ట్‌నర్‌షిప్ నమోదు చేసింది. పరుగులు సాధించడానికి ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్లు ఇబ్బంది పడిన పిచ్‌పై ధారాళంగా రన్లను రాబట్టుకుంది.

డ్వేన్ బ్రావో.. దూరం..

డ్వేన్ బ్రావో.. దూరం..

చెన్నై సూపర్ కింగ్స్‌‌ బౌలింగ్ లైనప్ బలంగా ఉంది. డ్వేన్ బ్రావో, దీపక్ చాహర్, సామ్ కుర్రమ్, లుంగి ఎంగిడి, పియూష్ చావ్లా, రవీంద్ర జడేజా ఎంతటి బ్యాట్స్‌మెన్‌ను అయినా ఇబ్బందులకు గురి చేసేవారే. ఈ బౌలింగ్ కాస్త బలహీనంగా మారే అవకాశాలు ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన బౌలర్ డ్వేన్ బ్రావో.. రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. శనివారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో తలపడిన మ్యాచ్‌లోనూ డ్వేన్ బ్రావో ఆడలేదు. గ్రౌండ్‌లోకి దిగలేదు. గాయం వల్ల అతనికి తుది జట్టులో చోటు దక్కలేదు.

మరో రెండు మ్యాచ్‌లకూ..

మరో రెండు మ్యాచ్‌లకూ..

తాజాగా బ్రావో మరో రెండు మ్యాచ్‌లను మిస్ కాబోతున్నాడు. ఈ విషయాన్ని కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ధృవీకరించాడు. మోకాలి నొప్పితో డ్వేన్ ఇబ్బంది పడుతున్నట్లు తెలిపాడు. వచ్చే రెండు మ్యాచ్‌లకూ దూరం అవుతాడని వెల్లడించారు. ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరఫున కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) టోర్నమెంట్‌ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా బ్రావో మోకాలికి గాయమైంది. అదే అతని చివరి మ్యాచ్. ఐపీఎల్-2020 సీజన్ తొలి మ్యాచ్‌లో ఆడతాడని భావించినప్పటికీ.. కుదరలేదు. గాయం తిరగబెట్టే ప్రమాదం ఉన్నందున.. మరికొంత విశ్రాంతి కల్పించాలని టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. ఫలితంగా మరో రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు.

రాజస్థాన్‌తో నెక్స్ట్ మ్యాచ్..

రాజస్థాన్‌తో నెక్స్ట్ మ్యాచ్..

చెన్నై సూపర్ కింగ్స్ తన తరువాతి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడబోతోంది. ఈ మ్యాచ్ ఈ నెల 25వ తేదీన జరుగనుంది. స్టీవ్ స్మిత్, జోస్ బట్లర్, డేవిడ్ మిల్లర్, బెన్ స్టోక్స్, మనన్ వోహ్రా, రాబిన్ ఊతప్ప, సంజు శాంసన్ వంటి హార్డ్ హిట్టర్లతో బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న రాజస్థాన్ రాయల్స్‌ను చెన్నై సూపర్ కింగ్స్ ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తి కలిగిస్తోంది. అటు బౌలింగ్‌లోను, ఇటు బ్యాటింగ్‌లనూ మెరుపులు మెరిపించగల సత్తా డ్వేన్ బ్రావోకు ఉంది. అలాంటి ఆల్‌రౌండర్ మరో రెండు మ్యాచ్‌లల్లో డగౌట్‌కే పరిమితం కావడం చెన్నై సూపర్ కింగ్స్ విజయావకాశాలపై ప్రభావం చూపొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

English summary
Chennai Super Kings’ head coach Stephen Fleming has confirmed that all-rounder Dwayne Bravo is likely to miss a couple of matches in the 2020 edition of the Indian Premier League (IPL).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X