తూర్పుగోదావరి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తూ.గోలో టూరిస్టుల బస్సు ప్రమాదం.. 7 మంది మృతి

|
Google Oneindia TeluguNews

Recommended Video

#EastGodavari : లోయలో పడ్డ పర్యాటక బస్సు,10 మంది మృతి || Oneindia Telugu

తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళుతున్న ప్రైవేటు టెంపో బస్సు బోల్తాపడి ఎడుగురు మృతి చెందారు. లోయలో నుండి బస్సు పడడంతో పులువురు టూరిస్టులకు తీవ్రగాయాలు అయ్యాయి..గాయాలపాలైన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా మొత్తం 24 మంది పర్యాటకులతో బస్సు మారేడుపల్లి నుండి చింతూరు మీదుగా వెళుతున్న నేపథ్యంలోనే వాల్మీకి కోండ వద్ద ప్రమాదానికి గురై లోయలో పడిపోయింది.

 జారిన హెలికాప్టర్: మహారాష్ట్ర సీఎంకు తప్పిన ప్రమాదం జారిన హెలికాప్టర్: మహారాష్ట్ర సీఎంకు తప్పిన ప్రమాదం

కర్ణాటకకు చెందిన టూరిస్టులు

కర్ణాటకకు చెందిన టూరిస్టులు

కాగా ఉదయం భద్రాచలం నుండి అన్నవరం వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రయాణికులంతా కూడ కర్ణాటక రాష్ట్రాంలోని చిత్రదుర్గ జిల్లాకు చెందినవారు. మొత్తం ఎనిమిది రోజుల టూరుకు గాను కర్టాటక జిల్లాలోని చిత్రదుర్గ జిల్లాకు చెందిన మొత్తం 24 మంది సోమవారం టెంపోలో బయలు దేరారు. ఈ నేపథ్యంలోనే ఉదయం భద్రాచలంలోని సీతారామచంద్రుల దేవాలయాన్ని దర్శించుకుని అనంతరం అన్నవరం వెళ్లారు. కాగా నేపథ్యంలోనే ఉదయం మారేడుపల్లి నుండి బయలు దేరారు.

మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన వారు 5గురు

మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన వారు 5గురు

కాగా ఉదయం మారేడు పల్లినుండి బయలు దేరిన తర్వాత సుమారు 11 కిలోమీటర్ల మేర ప్రయాణించిన తర్వాత ఈ దుర్ఘటన జరిగినట్టు సమాచారం. సంఘటన స్థలంలోనే ఆరుగురు చనిపోగా చికిత్స పోందుతూ మరోకరు మృతి చెందారు. మృతుల్లో వాణి, రమేష్, రుద్రాక్షమ్మ, శ్రీనివాస్ అనే దంపతులు ఉన్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని సమీపంలోని రంపచోడవరం ఆసుపత్రికి తరలించారు. సంఘటన ప్రాంతానికి జాయింట్ కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులు వెళ్లారు.

అత్యంత ప్రమాద స్థలం

అత్యంత ప్రమాద స్థలం

కాగా ప్రమాదం జరిగిన ప్రాంతం దట్టమైన అటవీ ప్రాంతంతోపాటు, ఎత్తుపల్లాలతో కూడుకున్న ప్రాంతన్న ఉన్న ఘాట్‌రోడ్డు . ఈ రోడ్డు గుండా అంత్యంత అనుభవం ఉన్నవారు మాత్రమే వాహానాలను నడిపేందుకు సహసిస్తారని పోలీసులు తెలిపారు. అయితే దారిగురించి సరైన అవగాహన లేకపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. అయితే ప్రమాదం నుండి టెంపో డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. అనంతరం అక్కడి నుండి పారిపోయినట్టు చెబుతున్నారు.మరోవైపు గాయపడ్డవారిని స్థానిక రంపచోడవరం ఆసుపత్రిలో చికిత్స అందింస్తున్నారు. వారిలో నలుగురి పరిస్థితి విషంగా ఉన్నట్టు తెలుస్తోంది.

English summary
At least 8 passengers were killed after the bus they were travelling by fell into a gorge in Andhra Pradesh’s east Godavari forest area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X