కచ్చులూరులో 144 సెక్షన్ ... బోటు వెలికితీత పనులు నిలిపివేత ..జలసమాధిలోనే 16మంది
గోదావరిలో బోటు వెలికితీత కోసం అధికారులు తీవ్రంగా ప్రయత్నం చేశారు. ఫలితం లేకపోవడంతో బోటు వెలికితీత చర్యలను అధికారులు నిలిపివేశారు. దీంతో బోటును వెలికి తీసేందుకు ప్రయత్నం చేసిన నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఇతర బృందాలు తిరిగి వెళ్లిపోయాయి.
బోటు తీయడం వారికి ఇష్టం లేదు.. అవకాశమిస్తే రెండు గంటల్లో తీస్తా.. ఓ ఎక్స్ పర్ట్ సంచలనం

జలసమాధిలోనే 16 మృతదేహాలు
తూర్పుగోదావరి జిల్లాలోని కచ్చలూరు వద్ద గోదావరి నదిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇప్పటి వరకు 35 మంది మృతదేహాలను వెలికి తీశారు. ఇంకా 16 మంది మృతదేహాలను వెలికి తీయాల్సిన ఉంది. వారిలో ఎవరు బ్రతికి ఉండే పరిస్థితి లేదు అని అధికారులు నిర్ధారించారు. ఎందుకంటే గత ఆదివారం బోటు ప్రమాదం జరిగినప్పటినుంచి నేటి వరకు వారి ఆచూకీ లభించలేదు. ఇక నీటిలో 315 అడుగుల లోతులో మునిగిన బోటును వెలికి తీసేందుకు ఉత్తరాఖండ్ నుండి వచ్చిన నిపుణుల బృందం ప్రయత్నం చేసింది.

ఫలించని బోటు వెలికితీత ప్రయత్నాలు
బోటు జాడను గుర్తించిన నిపుణుల బృందం బోటు నదిలో ఎలా కూరుకుపోయి ఉందో పరిస్థితిని చూడడం కోసం పంపించిన కెమెరాలు బురదలో చిక్కుకు పోవడంతో బోటు ను కనిపెట్టిన కష్టంగా మారిందని పేర్కొన్నారు. అయినప్పటికీ వాటిని వెలికి తీయడానికి వారు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో ఆ చర్యలు నిలిపివేశారు.
కాకినాడ, ముంబైల నుంచి వచ్చిన నిపుణులతో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం మాత్రం శూన్యం .

వెనక్కి వెళ్ళిపోయిన నేవీ, ఎన్డీఆర్ఎఫ్ దళాలు, ఇతర బృందాలు
ఉత్తరాఖండ్ నిపుణుల బృందం శతవిధాల ప్రయత్నించినప్పటికీ, ఇక స్థానికంగా బోట్లను తీయడంలో నిపుణులైన వారి సహాయ సహకారాలు తీసుకున్నప్పటికీ బోటు ను బయటకు తీయడం సాధ్యం కాలేదు . గోదావరి లో ఇప్పుడు ఉన్న వరద ఉధృతితో బోటు వెలికితీత సాధ్యం కాదని నిపుణుల బృందం తేల్చేసింది. ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో బోటు వెలికితీత పనులను అధికారులు నిలిపివేశారు. సహాయక చర్యల్లో పాల్గొన్న నేవీ, ఎన్డీఆర్ఎఫ్ దళాలు, ఇతర బృందాలు కూడా ఘటనా స్థలం నుంచి వెనక్కి వెళ్లిపోయాయి.

కచ్చులూరులో 144 సెక్షన్
ఇంకా ఈ ఘటనలో తమ వారి జాడ తెలియక బాధపడుతున్న కుటుంబాలు తీవ్ర ఆవేదనలో ఉన్నాయి. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇప్పటి వరకు 35 మంది మృతదేహాలను అధికారులు వెలికితీసి సంబంధిత కుటుంబాలకు అందజేశారు. ఇంకా 16 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. కాగా, ప్రమాదం జరిగిన కచ్చలూరు పరిసరాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఇంకా ఆచూకీ తెలియని వారి బంధువులు ఆందోళనలో ఉన్న నేపథ్యంలోనే అక్కడ ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా 144 సెక్షన్ విధించి నట్లుగా తెలుస్తుంది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!