తూర్పుగోదావరి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాకినాడలో విషవాయివు లీకేజీ, 200 మీటర్ల వరకు ప్రభావం, అస్వస్థతకు గురైన లారీ డ్రైవర్లు..

|
Google Oneindia TeluguNews

తూర్పుగోదావరి జిల్లాలో విష వాయువు లీకేజీ కలకలం రేపింది. కాకినాడ ఆటోనగర్‌లో శుక్రవారం తీవ్ర దుర్వాసన వచ్చింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. మరికొందరు భయపడి పరుగులు తీశారు. సమీపంలోని లారీ డ్రైవర్లు అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు, పరిశ్రమల శాఖ అధికారులు దుర్వాసన వచ్చిన చోటుకి వచ్చారు. నమూనాలను ల్యాబ్‌కి పంపించగా.. దానిని ప్రాథమికంగా అమోనియాగా గుర్తించారు.

gas leak in kakinada.. people fear..

Recommended Video

ఏపి లో సగం కేసులు అక్కడి నుంచే.. Covid19 Situation In Andhra Pradesh || Oneindia Telugu

ఆ వెంటనే ఫైరింజన్లు అక్కడికి చేరుకున్నాయి. ఘటన స్థలంలో నీరు చల్లడంతో వాయువు వాసన తీవ్రత తగ్గింది. కాకినాడ ఆటోనగర్ శివారులో గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లిన 10 రసాయన సీసాల నుంచి విష వాయువులు వెలువడ్డాయి. వారు ఎవరూ.. ఎందుకు వదిలి వెళ్లారనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. విషవాయువు తీవ్రత 200 మీటర్ల వరకు వ్యాపించింది. ఇప్పుడే కాదు మే 31వ తేదీన కూడా సర్పవరంలో వాయువులు లీకయ్యాయి.

English summary
gas leak in kakinada autonagar in friday. local people are feared.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X