తూర్పుగోదావరి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వామ్మో.. పరీక్ష చేయకున్నా కరోనా పాజిటివ్..? యువకుడు ఆందోళన, వైద్యులకు లేఖ..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ పాజిటివ్ అంటే చాలు గుండె గుబేల్ మంటోంది. అయితే కొన్ని పరీక్షలు నెగిటివ్ కూడా పాజిటివ్ చూపిస్తాయనే విమర్శలు వస్తున్నాయి. కానీ తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం ఒకతన్ని పరీక్షలు చేయకుండానే పాజిటివ్ వచ్చిందని మేసేజ్ పంపించారు. దీంతో సదరు యువకుడు వెంటనే సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కానీ కరోనా టెస్ట్ చేయకున్నా పాజిటివ్ అని రావడంతో అతను, కుటుంబసభ్యులు బెంబేలెత్తిపోయారు.

భారత్‌లో కరోనావైరస్: ఫలితం తేల్చనున్న 'మే’, నిపుణుల సూచనిలివే..భారత్‌లో కరోనావైరస్: ఫలితం తేల్చనున్న 'మే’, నిపుణుల సూచనిలివే..

సామర్లకోట మండలం జీ కొత్తూరుకు చెందిన యువకుడు జ్వరం వచ్చింది. ఈ నెల 25వ తేదీన కాకినాడ ప్రభుత్వాసుపత్రికి వెళ్లాడు. అయితే ఆ రోజు పరీక్షలు చేయకుండా.. వివరాలు మాత్రం నమోదు చేశారు. పరీక్ష చేసే తేదీని ఫోన్ చేసి చెబుతామని పేర్కొన్నారు. తర్వాత ఇతర చోట కూడా పరీక్షలు చేయలేదు. కానీ శనివారం రోజున ఆరోగ్య కార్యకర్తలు యువకుడి ఇంటికొచ్చారు. ఏంటీ అని అడిగితే.. కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందని తెలిపారు.

health staff not conduct virus test but corona positive..

దీంతో ఆ యువకుడు ఆందోళన చెందాడు. కరోనా వైరస్ కోసం తాను రక్త నమూనాలను ఇవ్వలేదు కదా అని అడిగారు. దీనిపై వెంటనే పీహెచ్‌సీ అధికారి ధనలక్ష్మీకి ఫిర్యాదు చేశారు. ఇలా పై అధికారుల దృష్టికి విషయం వెళ్లింది. దీనిపై జీజీహెచ్ సూపరింటెండెంట్‌ను మీడియా ప్రతినిధులు అడగగా.. సమస్య గురించి తనకు తెలిసిందని.. ఏం జరిగిందనే అంశంపై ఆరాతీస్తున్నామని తెలిపారు. కానీ ఆ యువకుడు తొలుత ఆందోళనకు గురయ్యాడు. తర్వాత లేఖ రాయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. క్షేత్రస్థాయిలో ఉండే సిబ్బంది చిన్న అజాగ్రత్త వల్ల పొరపాటు జరిగి ఉంటుంది.

English summary
health staff not conduct virus test in east godavari district samarlakota. but they informed got coronavirus positive.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X