• search
 • Live TV
తూర్పుగోదావరి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

టిడిపిని టచ్ చేయటం మీ నాన్న వైఎస్సార్ వల్లే కాలేదు జగన్ .. వడ్డీతో సహా చెల్లిస్తాం : లోకేష్ ఆగ్రహం

|

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ సర్కార్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పై విరుచుకుపడ్డ లోకేష్ చెత్త పైన కూడా పనులు చేసిన జగన్ ప్రభుత్వం పై ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారని విమర్శించారు. చెత్త పై పన్ను ఇంటి పన్ను తో ప్రజల నడ్డి విరుస్తున్నారని, విద్యుత్ చార్జీల పెంపుతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని లోకేష్ విమర్శించారు. 2024లో టీడీపీ అధికారంలోకి వస్తుందని పేర్కొన్న లోకేష్ తెలుగోడి సత్తా దేశానికి చాటి చెప్పిన ఘనత ఎన్టీఆర్ దని, ఆయన స్థాపించిన పార్టీని టచ్ చేసే దమ్ము ఎవరికీ లేదన్నారు.

  The TDP ranks anointed Nara Lokesh as a great leader | Oneindia Telugu

  తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించిన లోకేష్

  ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన లోకేష్ కు పెద్దాపురం నియోజక వర్గంలో టిడిపి నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సామర్లకోట లో ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్ విగ్రహాలను లోకేష్ ఆవిష్కరించారు. లోకేష్ జిల్లా పర్యటన నేపథ్యంలో టిడిపి శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రాజమండ్రిలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఆదిరెడ్డి కోటమ్మ కుటుంబాన్ని లోకేష్ పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

  2024లో టీడీపీ అధికారంలోకి వస్తుందన్న లోకేష్


  తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పై విరుచుకుపడ్డ లోకేష్ చెత్త పైన కూడా పన్నులు వసూలు చేస్తున్న జగన్ ప్రభుత్వం పై ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారని విమర్శించారు. చెత్త పై పన్ను, ఇంటి పన్ను పెంపుతో ప్రజల నడ్డి విరుస్తున్నారని, విద్యుత్ చార్జీల పెంపుతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని లోకేష్ విమర్శించారు. 2024లో టీడీపీ అధికారంలోకి వస్తుందని పేర్కొన్న లోకేష్ తెలుగోడి సత్తా దేశానికి చాటి చెప్పిన ఘనత ఎన్టీఆర్ దని ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ, అతి తక్కువ కాలంలోనే అధికారంలోకి వచ్చి బడుగు బలహీన వర్గాలకు మేలు చేకూర్చేలా ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుందని లోకేష్ వెల్లడించారు.

  టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి వడ్డీతో సహా చెల్లిస్తాం

  టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి వడ్డీతో సహా చెల్లిస్తాం

  ఇప్పుడు ప్రస్తుత వైసిపి హయాంలో అన్నీ అరాచకాలు జరుగుతున్నాయి అని విమర్శించిన లోకేష్, పాదయాత్ర సమయంలో ప్రజలకు లబ్ధి చేకూరుస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను విస్మరించారని విమర్శించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి వడ్డీతో సహా అన్ని తిరిగి చెల్లిస్తామని పేర్కొన్న లోకేష్, అధికారాన్ని అడ్డంపెట్టుకుని తమను ఏమైనా చేయాలనుకుంటే చేయలేరన్నారు. కొందరు కుల, మత, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి అధికారంలోకి వచ్చారని అలాంటి వారు తెలుగుదేశం భూస్థాపితం అవుతుందని అంటున్నారని కానీ టిడిపిని టచ్ చేయటం వాళ్ల నాయన వైఎస్సార్ వల్లే కాలేదని ధ్వజమెత్తారు .

  టీడీపీ కార్యకర్తల గడ్డం మీద వెంట్రుక కూడా పీకలేరు

  టీడీపీ కార్యకర్తల గడ్డం మీద వెంట్రుక కూడా పీకలేరు


  ఎవరూ టీడీపీ కార్యకర్తల గడ్డం కాదు కనీసం వెంట్రుక కూడా పీకలేరని ఘాటుగా వ్యాఖ్యానించారు. టిడిపి నాయకులు, కార్యకర్తలను అక్రమంగా నిర్బంధిస్తూ కొందరు ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్న లోకేష్ రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగ అమలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మళ్లీ టీడీపీ ప్రభుత్వ పాలనలో వడ్డీతో సహా చెల్లించే బాధ్యత తనదేనని లోకేష్ హెచ్చరించారు. జగన్ రెండున్నరేళ్ల పాలన పై విరుచుకుపడ్డ లోకేష్ జగన్ పాలన అంతా అవినీతిమయం అన్నారు.

  మాయల పకీర్ లాంటి జగన్ రెడ్డి మాయ మాటలతో జనాలను మోసం

  మాయల పకీర్ లాంటి జగన్ రెడ్డి మాయ మాటలతో జనాలను మోసం

  16 వేల కోట్ల లోటు బడ్జెట్ తో ఏర్పడిన రాష్ట్రం కోసం చంద్రబాబు అహర్నిశలు కష్టపడ్డారని లోకేష్ పేర్కొన్నారు . మాయల పకీర్ లాంటి జగన్ రెడ్డి పాదయాత్రలో జనానికి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడన్నారు. జగన్ టాక్స్ దెబ్బకి పెట్రోలు, డీజిల్ ధరలు డబుల్ సెంచరీ దిశగా వెళుతున్నాయన్నారు. జగన్ పాలనలో ఒక్క పరిశ్రమ రాలేదని, ప్రత్యేక హోదా మాటే మరిచిపోయారని, 25 మంది ఎంపీలను గెలిపిస్తే ఢిల్లీ గడగడలాడిస్తామని చెప్పి ఇప్పుడు ఢిల్లీ పెద్దల ముందు గజ గజ వణుకుతున్నారని విమర్శించారు.

  మోడీ కనిపిస్తే చాలు కేసుల మాఫీ కోసం కాళ్ళు పట్టుకునే జగన్ పార్టీ నేతలు

  మోడీ కనిపిస్తే చాలు కేసుల మాఫీ కోసం కాళ్ళు పట్టుకునే జగన్ పార్టీ నేతలు


  ప్రధాని మోడీ కనిపిస్తే చాలు కేసుల మాఫీ కోసం కాళ్లు పట్టుకుంటున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తలుచుకుంటే జగన్ రెడ్డి బయట తిరిగే వారా అని ప్రశ్నించిన లోకేష్ వైసిపి అరాచక పాలన పై పోరాడదామని పిలుపునిచ్చారు. ప్రజలను చైతన్యవంతం చేసి దుర్మార్గ జగన్ రెడ్డి పాలన పై ఉద్యమం చేయకపోతే భవిష్యత్తు తరాలు నష్టపోతాయని లోకేష్ పేర్కొన్నారు.

  English summary
  Nara Lokesh has issued warnings to AP CM Jagan Mohan Reddy. Lokesh said that Jagan Reddy to Remember .. TDP will come to power in future .He made harsh remarks that anarchy had increased during the YCP rule in the state of Andhra Pradesh. Nara Lokesh made the remarks during a visit to east godavari district. he warned jagan cannot touch the TDP which was founded by NTR.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X