తూర్పుగోదావరి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మునిగిన బోటు ప్రయాణికులు ఎక్కడ...? ఇంకా లభించని ఆచూకి

|
Google Oneindia TeluguNews

తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు వద్ద గోదావరిలో ప్రమాదానికి గురైన రాయల్‌ వశిష్ట బోటు ప్రమాదంలో సహయచర్యలకు చీకటి పడడంతో బ్రేక్ పడింది. రెండు హెలి కాప్టర్లతో పాటు ప్రత్యేక బృందాల ద్వార గాలింపు చర్యలు చేపట్టినప్పటికి రాత్రి ఎనిమిది గంటల వరకు 8 మృతదేహాలను మాత్రమే వెలికి తీయగల్గిగారు. మధ్యహ్నం గాలింపు చేపట్టిన ప్రయోజం లేకపోవడంతో ఉత్తరఖండ్ నుండి ప్రత్యేక బృందాలు సహయాక చర్యలు చేపట్టనున్నారు.

అయిల్‌ను బట్టి బోటు ప్రాంతాన్ని గుర్తించిన ఎన్డీఆర్ఎఫ్

అయిల్‌ను బట్టి బోటు ప్రాంతాన్ని గుర్తించిన ఎన్డీఆర్ఎఫ్

పడవ మునిగిన ప్రాంతంలో ఆయిల్ మరకలు ఉండడంతో వాటి ఆధారంతో బోటు మునిగిన ప్రాంతాన్ని మాత్రం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గుర్తించాయి. కాగా మునిగిపోయిన బోటు 300 అడుగుల లోతులో ఉన్నట్టు గుర్తించారు. సాధరణంగా ఎవరైన నీటీలో మునిగిపోతే 24 గంటల్లోగా నీటి పైకి తేలుతారు. కాని బోటు మునిగి ముప్పయి ఆరు గంటలు అవుతున్నా కనీసం మృతదేహాలు కూడ బయటికి రాని పరిస్థితి నెలకోంది. దీంతో పలు అనుమానాలను గాలింపు బృందాలు వ్యక్తం చేస్తున్నారు.

నేడు 4 మృతదేహాలు లభ్యం

నేడు 4 మృతదేహాలు లభ్యం

ఈనేపథ్యంలోనే గల్లంతైన బోటులోనే చిక్కుకునే అవకాశం ఉందని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు భావిస్తున్నాయి. లేదంటే విపరీతమైన బురద ప్రాంతం కావడంతో బురదలో చిక్కుకునే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఏది ఏమేన బోటును పూర్తి స్థాయిలో బయటకు తీస్తే గాని ఎంతమంది బోటులో చిక్కుకున్నారనే విషయం తెలిసేందుకు అవకాశం లేదు. కాగా నిన్న సంఘటన జరిగిన తర్వాత 8 మంది మృతదేహాలు బయటపడగా, నేటీ గాలింపు చర్యల్లో మరో నాలుగు మృతదేహాలు లభించాయి.

నీటీ ప్రవాహం తగ్గిన తర్వాతే బోటు వెలికితీత..

నీటీ ప్రవాహం తగ్గిన తర్వాతే బోటు వెలికితీత..

కాగా బోటు మునిగిన ప్రాంతంలో లోతు ఎక్కువగా ఉండటం, ప్రవాహం కూడ ఉధృతంగా ఉండటంతో పడవను వెలికితీసేందుకు ఎక్కువ సమయం పడుతోందని ఎన్డీఆర్‌ఎఫ్ వెల్లడించింది. మొత్తం 73 మందితో వెళ్లిన బోటులో 26 మంది మాత్రమే సురక్షితంగా బయటపడగా 12 మృతదేహాలు లభించాయి. దీంతో ఇంకా 35 మంది ఆచూకి లభించాల్సి ఉంది.మరోవైపు గాలింపు చర్యల్లో భాగంగా ఉభయ గోదావరి జిల్లాల నుంచి 6 ఫైర్‌ టీంలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. వీటితోపాటు శాటిలైట్‌ ఫోన్‌, 12 ఆస్కాలైట్లు, 8 బోట్లను ఉపయోగిస్తున్నారు. రెండు ఎన్డీఆర్‌ఎప్‌ బృందాలు, మూడు రాష్ట్ర బృందాలు పని చేస్తున్నాయి. ఇండియన్‌ నేవీ నుంచి ఒక డీప్‌ డైవర్స్‌ బృందం పని చేస్తోంది. రెండు నేవీ హెలికాప్టర్లు, ఒక ఓఎన్‌జీసీ ఛాపర్‌ను వాడుతున్నట్టు అని ప్రకృతి విపత్తుల నివారణ శాఖ పేర్కొంది.

English summary
still now missing boat travellers not find.but extensive search operations were being carried out by Indian Navy, NDRF, SDRF and state authorities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X