తూర్పుగోదావరి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బోటు తీయడం వారికి ఇష్టం లేదు.. అవకాశమిస్తే రెండు గంటల్లో తీస్తా.. ఓ ఎక్స్ పర్ట్ సంచలనం

|
Google Oneindia TeluguNews

కచ్చులూరు వద్ద గోదావరి లో మునిగిన బోటును బయటకు తీయడానికి అధికారులు విఫలయత్నాలు చేస్తున్నారు. ఉత్తరాఖండ్ నుండి వచ్చిన నిపుణుల బృందం బోటు ఉన్న ప్రదేశాన్ని గుర్తించి, దానిని తీయడానికి ప్రయత్నించి, పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో కొద్ది రోజులు ఆగాలి అని తేల్చి చెప్పింది. అయితే అధికారులు బోటు బయటికి తీయడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు అనుకుంటున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు పశ్చిమగోదావరి జిల్లా పసివేదల కు చెందిన గుల్లా వెంకట శివ అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు షాకింగ్ అనిపించాయి.

బోటులో 93 మంది ఉన్నారన్న మాజీ మంత్రి హర్షకుమార్ ... నిరూపిస్తారా అన్న మంత్రి అవంతిబోటులో 93 మంది ఉన్నారన్న మాజీ మంత్రి హర్షకుమార్ ... నిరూపిస్తారా అన్న మంత్రి అవంతి

బోటు బయటకు తియ్యటం పై ఎక్స్ పర్ట్ శివ సంచలనం

బోటు బయటకు తియ్యటం పై ఎక్స్ పర్ట్ శివ సంచలనం

రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడిన శివ బోటు ప్రమాదాలు జరిగిన సందర్భంలో గతంలో తన అనుభవాలను వాడుకున్న విధానాన్ని చెబుతూ ప్రస్తుత బోటు ప్రమాదం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బోటు బయటకు తీయడం అధికారులకు, మంత్రులకు ఇష్టం లేదని పశ్చిమ గోదావరి జిల్లా పశివేదలకు చెందిన గుల్లా వెంకటశివ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రమాదం జరిగిన రెండో రోజు తాను బోటు జాడను గుర్తించానని , బయటకు తీయడానికి సహకారం కావాలని అడిగానని చెప్పారు.

అధికారులు, మంత్రులకు బోటు తియ్యటం ఇష్టం లేదన్న శివ

అధికారులు, మంత్రులకు బోటు తియ్యటం ఇష్టం లేదన్న శివ

పర్యాటకశాఖ అధికారులు, మంత్రులు, బోటు యజమానులు అందరూ కలిసి తప్పుదోవ పట్టిస్తున్నారన్నారని పేర్కొన్న శివ తనకు అవకాశమిస్తే రెండుగంటల్లో బోటును బయటకు తెస్తానన్నారు. గతంలో మంటూరు-వాడపల్లి మధ్య బోటు మునిగినప్పుడు తానే తీశానని, గతంలో కూడా అనేక లాంచీలు, బోటులను బయటకు తీసిన అనుభవం తనకు ఉందని పేర్కొన్నారు శివ. ఆ అనుభవంతోనే తనను పిలిచారని, ప్రమాదం జరిగిన రెండో రోజే మునిగిన బోటును గుర్తించి లంగరు వేశానన్నారు. అయితే తనకు రన్నింగ్ పంటు, ఐరన్ రోప్ కావాలని అడిగానని చెప్పారు.

ఉత్తరాఖండ్ నుండి నిపుణుల బృందం అవసరమే లేదన్న శివ

ఉత్తరాఖండ్ నుండి నిపుణుల బృందం అవసరమే లేదన్న శివ

తనకు కావలసినవి ఇస్తే రెండు గంటల్లో బోట్ ను బయటకు తీసి చూపిస్తానని శివ పేర్కొన్నారు. 100 , 150 అడుగుల వరకు రోప్ వేసుకుని నది మధ్యలోకి వెళ్లి బోటుకు లంగరు వేసి బయటకు తీసుకురావడానికి తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని అధికారులు మంత్రుల దృష్టికి తీసుకెళితే పట్టించుకోలేదని ఆరోపించారు శివ. బోటు ను గుర్తించడానికి ఉత్తరాఖండ్ నుండి నిపుణుల బృందం అవసరమే లేదని ప్రమాదం జరిగిన రెండోరోజు బోటు జాడను గుర్తించానని శివ పేర్కొన్నారు.

 రెండు గంటల్లో తాను బోటు బయటకు తెస్తానంటున్న శివ

రెండు గంటల్లో తాను బోటు బయటకు తెస్తానంటున్న శివ


ఇక ఉత్తరాఖండ్ నిపుణుల బృందం ఇచ్చిన కెమెరాలు పనిచేయడం లేదని చెప్పిన శివ, ఇప్పటికైనా తనకు అవకాశమిస్తే బోట్ ను బయటకు తెస్తానని స్పష్టం చేశారు. అంతేకాదు రెండు గంటల్లోనే బోట్ ను బయటకు తీసుకువచ్చి తానేంటో నిరూపించుకుంటా అని సవాల్ విసిరారు శివ. బోట్లు, లాంచీలు తీయడంలో ఎక్స్ పర్ట్ అయిన శివ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం గా మారాయి.

శివ వ్యాఖ్యలతో పలు అనుమానాలు

శివ వ్యాఖ్యలతో పలు అనుమానాలు


ఇటీవల హర్షకుమార్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి హర్షకుమార్ కావాలనే బోటును బయటికి తీయడం లేదని, ఒకవేళ తీస్తే ఎక్కువమంది వృత్తులు ఉండే అవకాశం ఉందని బోటులో ప్రయాణం చేసింది 73 మంది కాదు 93 మంది అని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే శివ తాజాగా చేసిన వ్యాఖ్యలు బోటు ప్రమాద ఘటనపై మరిన్ని అనుమానాలకు కారణమవుతోంది.

English summary
Speaking to the media at the Raja Mahendravaram government hospital, Shiva made a sensational comment on the current boat mishap , using his experiences in the past in the boat accidents. Gulla Venkata siva of the West Godavari district remarks that the authorities and ministers do not like to get the boat out. On the second day of the accident, he said he had tracked the boat and asked for assistance in evacuating.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X