తూర్పుగోదావరి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

15న వైసీపీలోకి తోట త్రిమూర్తులు: జగన్ ఇచ్చిన ఆఫర్ ఇదే: అయ్యన్న సోదరుడు సైతం..!!

|
Google Oneindia TeluguNews

అనేక తర్జన భర్జనల తరువాత తూర్పు గోదావరి సీనియర్ నేత..టీడీపీ మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు టీడీపికి రాజీనామా చేసారు. కొద్ది కాలంగా జరుగుతన్న ప్రచారానికి తెర దించారు. తన అనుచరలతో సమావేశమైన తోట త్రిమూర్తులు తాను టీడీపీని వీడటానికి గల కారణాలను విశ్లేషించారు. అనుచరులు సైతం ఆయన నిర్ణయానికి మద్దతు ప్రకటించారు. తాను ఏ పార్టీలో పని చేసినా ప్రజల పక్షాన నిలిచానంటూ త్రిమూర్తులు చెప్పుకొచ్చారు. తనతో బీజేపీ నేతలు సైతం మంతనాలు సాగించారని..అయితే ఇప్పుడు ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో వైసీపీలో చేరాలని భావిస్తున్నట్లు వివరించారు. దీనికి అనుచరుల నండి అభిప్రాయ సేకరణ చేసారు. వారు సైతం మద్దతు తెలపటంతో ఈ నెల 15న ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో త్రిమూర్తులు వైసీపీలో చేరనున్నారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేసినట్లు సమాచారం. ఇదే సమయంలో త్రిమూర్తులతో పాటుగా టీడీపీ లో మంత్రిగా పని చేసిన అయ్యన్న పాత్రుడు సోదరుడు సన్యాసి పాత్రుడు సైతం వైసీపీలో చేరనున్నారు.

<strong>18న వైసీపీలోకి తోట త్రిమూర్తులు..! మరో ఇద్దరు మాజీలు: సైతం జగన్ గ్రీన్ సిగ్నల్...!!</strong>18న వైసీపీలోకి తోట త్రిమూర్తులు..! మరో ఇద్దరు మాజీలు: సైతం జగన్ గ్రీన్ సిగ్నల్...!!

టీడీపికి త్రిమూర్తులు గుడ్ బై..
ఎన్నికల ముందు నుండి సాగుతున్న ప్రచారానికి తోట త్రిమూర్తులు తెర దించారు. ఆయన తన అనుచరులు..కార్యకర్తలతో సమావేశమయ్యారు. టీడీపీలో ఉన్న పరిస్థితులను వివరించారు. తాను టీడీపీ వీడాలని భావిస్తున్నట్లుగా చెప్పారు. దానికి మద్దతు దారులు సైతం సై అన్నారు. ఆ వెంటనే తనకు బీజేపీ నుండి ఆ పార్టీ జాతీయ నేత రాం మాధవ్ తో పాటుగా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ బీజేపీలోకి ఆహ్వా నించారని వివరించారు. తాను ఏ పార్టీలో ఉన్న తనను ఎన్నుకున్న ప్రజలు..నమ్ముకున్న కార్యకర్తల కోసం పని చేసానని చెప్పుకొచ్చారు. టీడీపీలో ఒక సామాజిక వర్గానికే ప్రాధాన్యత లభిస్తోందని..ఎన్నికల సమయంలో సహకారం అందించలేదని చెప్పుకొచ్చారు. టీడీపీలో ఇమడలేని పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు తూర్పు గోదావరి పర్యటనకు వచ్చిన సమయంలోనూ ఆయన సమీక్షలకు తోట త్రిమూర్తులు దూరంగానే ఉన్నారు. ఎన్నికల ఫలితాల తరువాత టీడీపీ నుండి పోటీ చేసిన కాపు వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలతో ఆయన సమావేశం ఏర్పాటు చేసారు. పార్టీలో ఏ రకంగా ఇబ్బందులు ఎదుర్కొందీ అందులో చర్చించారు. ఆ తరువాత చంద్రబాబుతో సమావేశమైన సమయంలో పార్టీ మారేందుకు తాము సమావేశం ఏర్పాటు చేయలేదని చెప్పుకొచ్చారు. కానీ, ఆయన టీడీపీలో ఇబ్బంది పడుతున్నారని..ఖచ్చితంగా పార్టీ మారుతారనే ప్రచారం సాగినా..ఆయన బయటపడలేదు. ఇక, ఇప్పుడు అనుచరుల సమక్షంలో టీడీపీకి గుడ్ బై చెప్పిన త్రిమూర్తులు తాను త్వరలోనే వైసీపీలో చేరుతున్నట్లుగా ప్రకటించారు.

Thota Trimurthulu resigned for TDP decided to join in YCP

చక్రం తిప్పిన బోస్ .. ఎమ్మెల్సీ పదవి హామీ...
పార్టీ మారే సమయంలో తర్జన భర్జన పడిన తోట త్రిమూర్తులను వైసీపీలోకి ఆహ్వానించటంతో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్ర బోస్ చక్రం తిప్పారు. గతంలో తోట త్రిమూర్తులు ఆయన మీద గెలిచినా.. ఇప్పుడు వైసీపీలోకి తీసుకురావటంలో బోస్ దే కీలక పాత్ర. ఆయన నేరుగా ముఖ్యమంత్రి జగన్ తో చర్చించి.. స్పష్టమైన హామీ ఇచ్చారు. దీంతో..మరింత ఆలస్యం చేయకుండా తోట త్రిమూర్తులు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిక పైన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 15న త్రిమూర్తులు తన అనుచరులతో కలిసి ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. అదే విధంగా వైసీపీ నుండి ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఆయనకు తూర్పు గోదావరి జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం సాగినా..ముఖ్యమంత్రి మాత్రం పార్టీ బాధ్యతలు కంటే ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని.. పార్టీ కోసం పని చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. దీనికి త్రిమూర్తులు సైతం అంగీకరించారు. ఇక, ఆయనతో పాటుగా అదే జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు సైతం వైసీపీలో చేరుతారని సమాచారం. ఇక..తాజాగా టీడీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సోదరుడు సన్యాసి పాత్రుడు సైతం అదే ముమూర్తంలో వైసీపీలో చేరనున్నారు. ఇప్పటికే వీరి చేరికలకు మేఖ్యమంత్రి జగన్ ఆమోద ముద్ర వేసారు. త్వరలోనే మరి కొంత మంది తూర్పు గోదావరి నేతలు వైసీపీలో చేరుతారని సమాచారం.

English summary
Thota Trimurthulu resigned for TDP decided to join in YCP. He conducted meeting with his followers taken decision to join YCP in 15th of this month. YCP offer him MLC.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X