• search
 • Live TV
తూర్పుగోదావరి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అమెరికావాసికి గ్రామ సచివాలయ సేవలు .. 15 రోజుల్లో బర్త్ సర్టిఫికెట్ .. కితాబిస్తున్న ఎన్నారై

|

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ సచివాలయాల సేవలపై హర్షం వ్యక్తమవుతోంది. గ్రామ సచివాలయాల ప్రారంభ సమయంలో పలు విమర్శలు ఎదురైనప్పటికీ, ప్రస్తుతం గ్రామాలలోని ప్రజలకు కావలసిన అన్ని సేవలను గ్రామ సచివాలయాలు నిర్ణీత సమయంలోనే అందిస్తున్న నేపథ్యంలో ప్రజల నుండి సానుకూలత వ్యక్తం అవుతోంది. ఒక్క గ్రామవాసుల నుండే కాకుండా ప్రవాసాంధ్రుల నుండి కూడా గ్రామ సచివాలయాల సేవలపై హర్షం వ్యక్తమవుతోంది. తాజాగా ఓ ఉదంతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది.

ఏపీకి శకుని చంద్రబాబు .. నిరూపిస్తే ఉరేసుకుంటా, రాజకీయాల నుండే తప్పుకుంటా : కొడాలి నానీ ఫైర్ ఏపీకి శకుని చంద్రబాబు .. నిరూపిస్తే ఉరేసుకుంటా, రాజకీయాల నుండే తప్పుకుంటా : కొడాలి నానీ ఫైర్

బర్త్ సర్టిఫికెట్ కోసం కలెక్టర్ కు మెయిల్ చేసిన ఎన్నారై

బర్త్ సర్టిఫికెట్ కోసం కలెక్టర్ కు మెయిల్ చేసిన ఎన్నారై

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కొత్తపేట మండలం పలివెల గ్రామానికి చెందిన ఎఱ్ఱాప్రగడ కృష్ణ కిషోర్ దాదాపు పదేళ్ల క్రితం అమెరికాలోని చికాగో వెళ్లి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తూ అక్కడే ఉంటున్నారు. ఆయనకు గ్రీన్ కార్డ్ ఇమ్మిగ్రేషన్ నిమిత్తం బర్త్ సర్టిఫికెట్ అవసరం కాగా, కేవలం పదిహేను రోజుల్లోనే బర్త్ సర్టిఫికెట్ ను అందించారు పలివెల గ్రామ సచివాలయ సిబ్బంది. కరోనా కారణంగా స్వయంగా రాలేని పరిస్థితిలో ఉన్న ఆయన తన బర్త్ సర్టిఫికెట్ కోసం కలెక్టర్ మురళీధర్ రెడ్డిని ఆన్లైన్లో సంప్రదించగా, సానుకూలంగా స్పందించిన కలెక్టర్ అవసరమైన ధృవీకరణ పత్రాలను తెప్పించుకొని పరిశీలించి బర్త్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు.

ఆన్లైన్ ద్వారా 15 రోజుల్లోనే బర్త్ సర్టిఫికెట్ తీసుకున్న కృష్ణ కిషోర్

ఆన్లైన్ ద్వారా 15 రోజుల్లోనే బర్త్ సర్టిఫికెట్ తీసుకున్న కృష్ణ కిషోర్

దీంతో సంబంధిత సిబ్బంది
ద్వారా ప్రొసీజర్ నిర్వహించి, వీఆర్వో కే శ్రీనివాస్ ద్వారా విచారణ జరిపించి చివరకు పలివెల గ్రామ సచివాలయం 2 కార్యదర్శి కే సురేష్, డిజిటల్ అసిస్టెంట్ లాజెరస్ సహాయంతో ఆన్లైన్ లోకి డేటా ఎంట్రీ చేసి ఆయన బర్త్ సర్టిఫికెట్ ను ఈమెయిల్ ద్వారా దరఖాస్తుదారునికి పంపించారు. ఆన్లైన్ ద్వారా 15 రోజుల్లోనే బర్త్ సర్టిఫికెట్ తీసుకున్న కృష్ణ కిషోర్ సచివాలయ సిబ్బంది పనితీరు పై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామ సచివాలయాల సేవలపై కితాబిస్తూ కలెక్టర్ కు లేఖ .. రూ. 1.10లక్షల విరాళం

గ్రామ సచివాలయాల సేవలపై కితాబిస్తూ కలెక్టర్ కు లేఖ .. రూ. 1.10లక్షల విరాళం

ఏపీలో గ్రామ సచివాలయ వ్యవస్థ పనితీరును అభినందిస్తూ కలెక్టర్ కి లేఖ రాసిన ఆయన, సచివాలయాల ద్వారా ప్రజలకు సత్వర సేవలు అందిస్తూ ఉండడం గొప్ప విషయమని పేర్కొన్నారు. తాను అమెరికా నుండి పలివెల వెళ్లి వచ్చేందుకు ఒక లక్షా పదివేల రూపాయలు ఖర్చు అయ్యేదని తెలిపిన ఆయన ,ఆ మొత్తాన్ని కలెక్టర్ కి పంపించి కలెక్టర్ సూచించిన మేరకు నిధులను వినియోగించాలని కోరారు. తనకు సకాలంలో బర్త్ సర్టిఫికెట్ ఇవ్వటం వల్లే గ్రీన్ ఇమ్మిగ్రేషన్ పని పూర్తయ్యింది అని చెప్పారు.

  AP New Districts: 7 Police Commissionerates ఏపీ పోలీస్ వ్యవస్థకు సరికొత్త రూపం...! | Oneindia Telugu
  సచివాలయాల తీరు శభాష్ అంటూ మెచ్చుకోలు

  సచివాలయాల తీరు శభాష్ అంటూ మెచ్చుకోలు

  కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఎన్ఆర్ఐ కృష్ణ కిషోర్ పంపించిన మొత్తంలో గ్రామ కార్యదర్శి సురేష్ కు ఐదు వేల రూపాయల రివార్డును ప్రకటించారు. మిగతా మొత్తాన్ని గ్రామ సచివాలయ అభివృద్ధికి కేటాయిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ విషయం తెలిసిన ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి గ్రామ సచివాలయ సిబ్బందిని, సంబంధిత అధికారులను అభినందించారు. ప్రవాసాంధ్రులకు కూడా వారు రాకుండానే త్వరితగతిన పనులు చేసి పెడుతున్న సచివాలయాల పనితీరు శభాష్ అంటూ తెగ మెచ్చుకుంటున్నారు.

  English summary
  Errapragada Krishna Kishore hails from Palivela village in Kottapeta zone of East Godavari district and moved to Chicago, USA almost ten years ago to work there as a software engineer. He needed a birth certificate for a green card immigration, but was given a birth certificate in just fifteen days by the staff of the Palivela village secretariat. He wrote a letter to the Collector expressing his happiness over this. Rs 1.10 lakh was donated to development projects.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X