తూర్పుగోదావరి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిమ్మగడ్డ రాజీనామా -జగన్ ఫర్మానా -ఏపీలో ఆర్టికల్ 356 -సుప్రీం తీర్పు ఇదే: ఎంపీ రఘురామ

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్, జగన్ సర్కారుకు మధ్య విభేధాలు తారాస్థాయికి చేరాయి. అధికారాలన్నీ ఎస్ఈసీకి ఉంటాయన్న సుప్రీం ఆదేశాల దరిమిలా.. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహణకు నిమ్మగడ్డ సిద్ధం కాగా.. కరోనా వల్ల అది కుదరదని ప్రభుత్వం ప్రతిస్పందించింది. దీంతో నిమ్మగడ్డ మళ్లీ కేంద్రం, కోర్టులను ఆశ్రయించనున్నారు. ఈ పరిణామాలపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంపీ ఏమన్నారో ఆయన మాటల్లోనే..

మగాడు గర్భవతి అయ్యింది -బయట పురుషాంగం, లోపల అండాల ఉత్పత్తి -నిజంగా అద్భుతమేమగాడు గర్భవతి అయ్యింది -బయట పురుషాంగం, లోపల అండాల ఉత్పత్తి -నిజంగా అద్భుతమే

సహజీవన సిద్ధాంతం ఏమైంది?

సహజీవన సిద్ధాంతం ఏమైంది?

‘‘ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ రూపొందించామని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తన బాధ్యతగా ప్రభుత్వానికి తెలియజేయడం శుభపరిణామం. కానీ ప్రభుత్వం ఆయనపై దాడికి దిగడం దారుణం. మార్చిలో కరోనా అంటే ఎవరికీ తెలీదు.. తర్వాతి కాలంలో కరోనాతో సహజీవనం ఎలా చేయాలో ముఖ్యమంత్రిగారే విశదీకరించి చెప్పారు. మధ్యలో కేసులు 10వేల వెళ్లినా.. ఇప్పుడు కేసుల్ని 1000 లోపు తగ్గించగలిగారు. కరోనా ప్రభావం తగ్గడం వల్లే జగన్ పాదయాత్ర మూడేళ్ల వార్షికోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు పోటాపోటీగా నిర్వహించారు. మంత్రులు సైతం భారీ సభలు, ర్యాలీలతో తమ ప్రతాపం చూపుకున్నారు. గత 10 రోజుల్లో కనీసం 40 లక్షల మంది ప్రజలు వైసీపీ సభల్లో పాల్గొన్నారు. తద్వారా వైరస్ భయం లేదని వైసీపీ వాళ్లే ప్రకటించినందున ఇక ఎన్నికలు నిరభ్యంతరంగా జరిపే అవకాశం ఏర్పడిందని ఎస్ఈసీ నిమ్మగడ్డకు నేను లేఖ రాశాను.

కొవిడ్-19 వ్యాక్సిన్‌: చైనా అనూహ్యం -భారత్ సహకారం కోరిన జిన్‌పింగ్ -సాంప్రదాయ ఔషధాలతో..కొవిడ్-19 వ్యాక్సిన్‌: చైనా అనూహ్యం -భారత్ సహకారం కోరిన జిన్‌పింగ్ -సాంప్రదాయ ఔషధాలతో..

అడ్డగోలును అడ్డుకోడానికే రాజ్యాంగం..

అడ్డగోలును అడ్డుకోడానికే రాజ్యాంగం..

కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వం దాదాపు సక్సెస్ అయింది. ఇవాళ సినిమా హాళ్లు, బార్లు, స్కూళ్లను కూడా ఓపెన్ చేశాం. కానీ ఎన్నికలు అనేసరికి ఎందుకు బయపడుతున్నారో అర్థంకావట్లేదు. రాజ్యాంగ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు. కానీ ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధంగా లేమని చెప్పడం రాజ్యాంగ విరుద్ధం. ఎలాగంటే.. రేప్పొద్దున కేంద్ర ప్రభుత్వం కూడా ఏవేవో కారణాలు చెప్పి సార్వత్రిక ఎన్నికలను పెట్టదల్చుకోలేమని చెప్పగలదా? అధికార సిబ్బందికి భయాలున్నాయని చెప్పగలదా? ఇలా ప్రతివాడూ అడ్డమైన కారణాలు చెప్పి ఎన్నికలను అడ్డుకునే అవకాశం ఉంది కాబట్టే రాజ్యాంగంలో వాటిపై స్పస్టమైన నిబంధనలు రాశారు. అలాగే, స్వయంప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘం, కోర్టుల ఏర్పాటు జరిగింది.

జగన్ కోటరీ భారీ స్కెచ్ -జస్టిస్ బోబ్డే కీలక తీర్పు -సంచైత క్రిస్టియనే: వైసీపీ ఎంపీ వ్యాఖ్యలుజగన్ కోటరీ భారీ స్కెచ్ -జస్టిస్ బోబ్డే కీలక తీర్పు -సంచైత క్రిస్టియనే: వైసీపీ ఎంపీ వ్యాఖ్యలు

సుప్రీం తీర్పు సుస్పష్టం..

సుప్రీం తీర్పు సుస్పష్టం..


మాకు 151 సీట్లు వచ్చాయి కాబట్టి ఏది చేసినా చెల్లుబాటు అవుతుందని, ఏం చేసినా నడుస్తుందనే ఆలోచన నుంచి జగన్ బయటపడాలి. లేకుంటే ఇంకా ఇబ్బందులు తప్పవు. కేంద్రం నిధులు రావాలంటే ఎన్నికలు తప్పనిసరి అని నిమ్మగడ్డ వివరించినా మావాళ్లకు అర్థం కావట్లేదు. సరిగ్గా ఇలాగే రాజస్థాన్ లో కూడా స్థానిక ఎన్నికలు నిర్వహించబోమని సీఎం అశోక్ గెహ్లాట్ వాదిస్తే.. హైకోర్టు, సుప్రీంకోర్టులు జోక్యం చేసుకుని ఎన్నికలు జరిపిస్తున్నాయి. గతంలో అదే రాజస్థాన్ లో ఒక వివాదం తలెత్తితే.. సుప్రీంకోర్టు కీలక రూలింగ్ ఇచ్చింది.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఏవైతే అధికారాలు ఉంటాయో.. రాష్ట్రాల ఎన్నికల సంఘాలకు కూడా అవే పవర్స్ ఉంటాయని స్పష్టం చేసింది.

సీఎస్ సాహ్ని హద్దు మీరారు..

సీఎస్ సాహ్ని హద్దు మీరారు..

ఒక్కసారి ఎన్నికల కమిషన్ నోటిఫికేష్ ఇచ్చిన తర్వాత ప్రక్రియ ముందుకు వెళ్లాల్సిందే. ఇప్పటికే అన్ లాక్ 6 దశలో ఉన్నాం. ఏపీలో కరోనా లేదని అధికార పార్టీ నేతలే తమ చర్యలతో నిరూపించారు. ఇదంతా జరిగిన తర్వాత కూడా ఎన్నికలు నిర్వహించబోమని చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని.. ఎస్ఈసీ నిమ్మగడ్డకు లేఖ రాయడం బాధ్యతారాహిత్యం. ఆమె తన అధికార హద్దుల్ని దాటి వ్యవహరిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర కేబినెట్ మంత్రులు కొందరు మీడియా ముందుకు వచ్చి.. నిమ్మగడ్డ అజ్నాతవాసి అని, ఆయన తక్షణమే రాజీనామా చేసి టీడీపీలో చేరిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరి అలాంటప్పుడు.. రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు పెట్టని కారణంగా ప్రభుత్వమే పక్కకు తప్పుకోవాలి లేదా ముఖ్యమంత్రినో, మంత్రులు రాజీనామా చేయాలని ప్రజలు అడిగితే పరిస్థిత ఏంటి?

నిమ్మగడ్డ రాజీనామా.. ప్రభుత్వ ఆదేశమా?

నిమ్మగడ్డ రాజీనామా.. ప్రభుత్వ ఆదేశమా?

నిమ్మగడ్డను ఉద్దేశించి.. మంత్రులు అధికార హోదాలోనే మాట్లాడుతున్నారా? లేక వ్యక్తులుగా మాట్లాడుతున్నారా? మంత్రులుగానే మాట్లాడినట్లయితే.. నిమ్మగడ్డను రాజీనామా చేయాలనే డిమాండ్ ను జగన్ ప్రభుత్వ ఫర్మానా(అధికారిక ప్రకటన)గానే భావించాల్సి ఉంటుంది. ఇది అత్యంత దుదృష్టం. ప్రజలకు ఎన్నెన్నో వాగ్ధానాలు చేసిన ప్రభుత్వం ఇప్పుడు వ్యతిరేక దిశలో నిర్ణయాలు తీసుకుంటోంది. కోర్టుల మీద, ఎన్నికల సంఘం మీద దాడులు చేస్తున్నది. వారం రోజులు ఆలస్యం అయినా వీటి పరిణామాలను ఎదుర్కోకతప్పదు. గతంలో హైకోర్టును తీవ్రపదజాలంతో దూషించిన కేసులుగానీ, సీఎం జగన్ జడ్జిలపై చేసిన అనుచితన ఫిర్యాదు వ్యవహారంలోగానీ మూడు నాలుగు రోజుల్లో కొలిక్కిరానుంది. ఇప్పుడు మంత్రుల నోట నుంచి వెలువడినట్లు.. రాష్ట్ర ప్రభుత్వమే గనుక ఎన్నికల కమిషనర్ ను రాజీనామా చేయాలని డిమాండ్ చేసుంటే కచ్చితంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుంది. అప్పుడు..

కేంద్ర బలగాలతో ఏపీలో ఎన్నికలు..

కేంద్ర బలగాలతో ఏపీలో ఎన్నికలు..

ఏపీలో రాజ్యాంగ వ్యవస్థల విధ్వంసాన్ని అడ్డుకోడానికి అత్యున్నత న్యాయస్థానం.. ఆర్టికల్ 356ను అమలు చేసే అవకాశం ఉంది. తద్వారా ఏపీలో రాష్ట్రపతి పాలన వస్తుంది. అది ఎంతో దూరంలో లేదు. ఆ వెంటనే కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహిస్తారు. నిజానికి.. ప్రజలు ఎంతో విశ్వాసంతో జగన్ ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. సంక్షేమ పథకాల వరకు ఫర్వాలేదు. ప్రభుత్వ ఆస్తులను అమ్మకానికి పెట్టయినా ఆ పంథకాలను కొనసాగిస్తున్నారు. అభివృద్ధి ప్రస్తుతానికి శూన్యం అన్న సంగతి వేరే. పడిందన్నది వేరే సంగతి. అయితే, ఇంత గొప్పగా సంక్షేమాన్ని కొనసాగిస్తూ.. ఓటర్ల అకౌంట్లలోకి కోటానుకోట్ల డబ్బులు వేస్తున్నప్పుడు ఎన్నికలంటే వైసీపీ భయపడాల్సిన అవసరం ఏముంది?

రమేశ్ కుమార్ రాక్షసుడా?

రమేశ్ కుమార్ రాక్షసుడా?

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఏమైనా రాక్షసుడా? సహజీవన సిద్ధాంతం మీరే చెప్పారు కాబట్టి కరోనా అంటే భయమని చెబితే ఎవరూ నమ్మరు. ఏపీలో ప్రస్తుతం ప్రజలకు కరోనా అంటే భయమే లేదు. నిమ్మగడ్డ ఉంటే ఎన్నికల్ని నిష్పక్షపాతంగా నిర్వహిస్తాడనే ఆందోళన ఉన్నా, ఎన్నికలు ఎలా జరిగినా, అత్యధిక స్థానాలు వైసీపీనే గెలుస్తుంది. అత్యధిక స్థానాలను మనమే గెలుస్తామని మా వాళ్లు నమ్మకం ఉంచాలి. మన భయానికి కరోనా ముసుగు వేయడమెందుకు? వైసీపీ శ్రేణులు గత 10 రోజులుగా సింహాల్లా ప్రజల్లోకి వెళ్లి మనం చేస్తోన్న మంచిని ప్రజలకు వివరించారు. ఇంకా భయమెందుకు? రాబోయే రోజుల్లో..

జగన్‌కు మరో దారి లేనేలేదు..

జగన్‌కు మరో దారి లేనేలేదు..

సీఎం జగన్ తన తీరును మార్చుకోకుంటే కోర్టుల జోక్యం తప్పదు. ఎన్నికల కమిషనర్ ను రాజీనామా చేయాలని ప్రభుత్వమే అనడం చాలా తీవ్ర పరిణామం. ఇప్పటికే ఎస్ఈసీ.. గవర్నర్ ను కలిసి జరిగిన విషయాలను నివేదించారు. గవర్నర్ యాక్టివ్ పార్ట్ తీసుకుంటే మంచిది. ఒకవేళ గవర్నర్ కూడా ప్రేక్షకపాత్రకే పరిమితం అయితే.. అప్పుడు కోర్టుల జోక్యం తప్పదు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా తప్పించుకుపోవడాన్ని ఏ కోర్టూ సమర్థించదు. తీరా కోర్టుల ఆదేశంతో ఎన్నికలు జరిగితే.. అప్పుడు ప్రభుత్వం నవ్వులపాలైపోతుంది. అప్పటికీ మేం సహకరించబోమని ఎవరైనా అధికారులు అంటే.. వాళ్లను కోర్టులే పక్కకు ఈడ్చిపారేస్తాయి. వాళ్లపై అన్ని రకాల చర్యలు తీసుకుంటాయి. ఎందుకంటే రాజ్యాంగాన్ని మార్చే అధికారం ఏపీ ప్రభుత్వానికి లేదని గుర్తుంచుకుంటే మంచిది. వ్యక్తిగత విమర్శలకు పోకుండా వ్యవస్థలన్ని గౌరవిస్తూ ఎన్నికలు నిర్వహించడం తప్ప మరో దారి లేనేలేదని సీఎం జగన్ గుర్తించాలి’’ అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.

English summary
narsapuram ysrcp mp raghurama krishnam raju sensational remarks on ap local body elections. amid ap minister kodali nani demands resignation from sec nimmagadda ramesh kumar, ysrcp mp raghurama krishnam raju calls it as cm jagan's farmana(official order). speaking to media in hyderabad on wednesday, the mp hits out at ap govt and cm jagan on local body elections issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X