• search
  • Live TV
తూర్పుగోదావరి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మూడు రాజధానులపై రాష్ట్రపతి జోక్యం- రఘురామ లేఖ - జగన్ చర్య రాజ్యాంగ విరుద్ధమంటూ..

|

వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీ సర్కారుపైనే సమరశంఖం పూరించిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇప్పుడు ప్రభుత్వం కీలకంగా భావిస్తున్న మూడు రాజధానులపై రాష్ట్రపతి జోక్యం కోరారు. రాజ్యాంగ విరుద్ధమైన రాజధాని బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా అడ్డుకోవాలని కోరుతూ రాష్ట్రపతికి ఆయన లేఖ రాశారు. ఇందులో 2014లో ఏపీ విభజన నుంచి మొదలుపెట్టి తాజాగా జగన్ సర్కారు రాజధాని బిల్లులను గవర్నర్ వద్దకు పంపడం వరకూ చోటు చేసుకున్న పలు పరిణామాలను ఇందులో వివరించారు. ప్రధాని చేతుల మీదుగా శంఖుస్ధాపన పూర్తి చేసుకున్న అమరావతిని మార్చకుండా జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతిని కోరారు.

జగన్ కు రఘురామ మరో ట్విస్ట్- పార్టీ వేరు, ప్రభుత్వం వేరు- అలా అయితే 20 ఏళ్ల అధికారం..

మూడు రాజధానులపై రాష్ట్రపతికి లేఖ..

మూడు రాజధానులపై రాష్ట్రపతికి లేఖ..

వైసీపీ తరఫున గెలిచిన తర్వాత ఆ పార్టీ విధానాలను విమర్శిస్తూ ఇప్పటికే పలు లేఖలు సంధిస్తున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తాజాగా రాష్ట్రపతికి రెండు లేఖలు రాశారు. ఇందులో ఒకటి ఏపీ మూడు రాజధానుల బిల్లులను అడ్డుకోవాలని కోరుతూ కాగా.. రెండో లేఖ తనకు అదనపు భద్రత కల్పించాలనేది. వీటిలో ముందుగా ఏపీలో రాజధానిని మూడు ముక్కలు చేయకుండా చర్యలు తీసుకోవాలని రాసిన లేఖలో రఘురామరాజు ఏపీ విభజన చట్టం నుంచి ఇప్పటివరకూ చోటు చేసుకున్న పలు పరిణామాలను ప్రస్తావించారు. రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న మూడు రాజధానుల ఏర్పాటులో జోక్యం చేసుకోవాలని రఘురామరాజు రాష్ట్రపతిని కోరారు.

మూడు రాజధానులతో నష్టాలు...

మూడు రాజధానులతో నష్టాలు...

ఏపీలో 2014లో పునర్విభజన చోటు చేసుకున్న తర్వాత విభజన చట్టం ప్రకారం ఏర్పాటైన అమరావతి రాజధానిని విపక్ష వైసీపీ ఆమోదించిందని, పార్లమెంటు గుర్తించిందని, ప్రధాని వచ్చి శంఖుస్ధాపన చేశారని, కానీ వైసీపీ సర్కారు ఇవేవీ పట్టించుకోకుండా పాలనా వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల ఏర్పాటుకు సిద్ధమవుతోందని రఘురామరాజు ఆరోపించారు. రాజధానుల వికేంద్రీకరణ వల్ల చాలా నష్టాలు ఉన్నాయని రాష్ట్రపతికి రాసిన లేఖలో రఘురామరాజు పేర్కొన్నారు. ముఖ్యంగా శాసస, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్ధల కేంద్రాల మధ్య దూరం పెరుగుతుందని, రాయలసీమ నుంచి విశాఖకు 20 గంటల ప్రయాణం ఉంటుందని తెలిపారు. అమరావతి అభివృద్ధిలో భారీగా ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులున్నాయి. రాజధాని మారితే అక్కడ ఏర్పాటైన సంస్దలన్నీ వృథా అవుతాయన్నారు. మూడు రాజధానుల ఏర్పాటుతో రాష్ట్రం రాజకీయంగా, సామాజికంగా చచ్చిపోతుందని రఘురామరాజు తన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలు ప్రాంతాలు, కులాల వారీగా విడిపోతారని, పాలనా శూన్యత, నిర్వహణా వైఫల్యం ఎదురవుతుందన్నారు.

 శాసన ప్రక్రియ ఆగిపోయింది...

శాసన ప్రక్రియ ఆగిపోయింది...

ఈ ఏడాది జనవరిలో మూడు రాజదానుల బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపినా మండలి సెలక్ట్ కమిటీకి పంపిందని, కానీ వైసీపీ సర్కారు తమ బలంతో దీన్ని అసెంబ్లీ సచివాలయంలో అడ్డుకుందని రఘురామరాజు ఆరోపించారు. తాజాగా జూన్ లో రెండోసారి అసెంబ్లీ ఈ బిల్లులను ఆమోదించిందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. ఈ బిల్లులను గవర్నర్ సాయంతో ప్రభుత్వం ఆమోదించుకోవాలని చూస్తోందని, గవర్నర్ వీటిని ఆమోదించకుండా చూడాలని రాష్ట్రపతిని రఘురామరాజు కోరారు. అమరావతి నుంచి రాజదాని తరలింపుపై హైకోర్టులో పలు పిటిషన్లు పెండింగ్‌ లో ఉన్నాయి. ఇలాంటి సమయంలో గవర్నర్ సాయంతో బిల్లులు ఆమోదిస్తే కోర్టు ధిక్కారం అవుతుందన్నారు.

రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని..

రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని..

రాజ్యాంగ విరుద్ధంగా రూపొందించిన మూడు రాజధానుల బిల్లులు గవర్నర్ ఆమోదం పొందకుండా రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని రఘురామరాజు తన లేఖలో కోరారు. వాస్తవానికి గవర్నర్ ఈ బిల్లులను రాష్ట్రపతి అభిప్రాయం కోసం పంపాలని, అప్పుడు రాష్టపతి అటార్నీ జనరల్ అభిప్రాయం మేరకు వీటిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని రఘురామ రాజు గుర్తుచేశారు. కాబట్టి గవర్నర్ నుంచి బిల్లులు తెప్పించుకుని ఇప్పటికైనా వాటిని అటార్నీ జనరల్ కు పంపాలని కోరారు.

English summary
ysrcp's rebel mp raghu rama krishnam raju on tuesday wrote a letter to president ramnadh kovind on three capitals in ap. raghurama raju seek president's intervention in jagan govt's capital trifurcation plans.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X