• search
  • Live TV
ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఏలూరు తాగునీటిలో సీసం, నికెల్ లేవు.. పూర్తి నివేదిక నాలుగు రోజుల్లో : సీఎం జగన్ తో హెల్త్ కమీషనర్

|

ఏలూరు లో వింత వ్యాధికి కారణం తాగునీరు కాదని, తాగునీటిలో ఎలాంటి సమస్య లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ప్రజల అనారోగ్యానికి కారణం రియాక్షన్ మాత్రమేనని ఆయన తెలిపారు. ఏలూరు ఘటనపై సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో తాజా పరిస్థితులను కమిషనర్ ముఖ్యమంత్రికి వివరించారు.

కౌలు రైతుల రుణాలపై బ్యాంకర్లపై సీఎం జగన్ అసంతృప్తి .. ఆ మార్గాలపై ఫోకస్ పెట్టాలని సలహాకౌలు రైతుల రుణాలపై బ్యాంకర్లపై సీఎం జగన్ అసంతృప్తి .. ఆ మార్గాలపై ఫోకస్ పెట్టాలని సలహా

 ప్రజలు అస్వస్థతకు గురి కావడానికి కారణాలు పూర్తిగా నిర్ధారణ కాలేదు

ప్రజలు అస్వస్థతకు గురి కావడానికి కారణాలు పూర్తిగా నిర్ధారణ కాలేదు

ప్రజలు అస్వస్థతకు గురి కావడానికి గల కారణాలు ఇంకా పూర్తిగా నిర్ధారణ కాలేదు అని చెప్పిన ఆరోగ్య శాఖ కమిషనర్, మరి కొన్ని పరిశోధనా ఫలితాలు రావాల్సి ఉందని, మరో నాలుగు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. తాగునీటిలో నికెల్, సీసం లేవని తేలిందని కేంద్ర దర్యాప్తు సంస్థ ఇచ్చిన నివేదికల ఆధారంగా ఈ విషయం వెల్లడైందని పేర్కొన్నారు.
అయితే ఏలూరులో ప్రజలు తీసుకునే ఆహారంలో సీసం ఏమైనా ఉండొచ్చేమో అని భావిస్తున్నామని, వివిధ పురుగు మందుల వాడకం, ఆహారంలో వివిధ కారకాలు కలవడం వంటి కారణాలతో ఇది ఒక రియాక్షన్ గా వచ్చినట్లుగా భావిస్తున్నామన్నారు.

రక్త నమూనాల్లో నికెల్ , సీసం .. తాగు నీటిలో లేవు

రక్త నమూనాల్లో నికెల్ , సీసం .. తాగు నీటిలో లేవు

ఈ అంతుచిక్కని మిస్టరీ తేల్చడానికి మరో నాలుగు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
అయితే బాధితుల రక్త నమూనాల్లో సీసం, నికెల్ , బియ్యంలో మెర్క్యురీ అధిక మోతాదులో ఉన్నట్లుగా తేలిందన్నారు వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్. జాతీయ సంస్థలు రెండోసారి ఇచ్చిన నివేదికలో కూడా సీసం, నికెల్ ఉన్నట్లుగా ఆయన పేర్కొన్నారు. కానీ తాగునీటిలో మాత్రం సీసం, నికెల్ లేవని నివేదికలు స్పష్టంగా చెబుతున్నాయి అన్నారు.

గాలిలోనూ మోతాదుకు మించి లెడ్, నికెల్ లేవన్న కాలుష్య నియంత్రణ మండలి

గాలిలోనూ మోతాదుకు మించి లెడ్, నికెల్ లేవన్న కాలుష్య నియంత్రణ మండలి

గాలిలో మోతాదుకు మించి లెడ్, నికెల్ లేవని కాలుష్య నియంత్రణ మండలి కూడా తేల్చిందని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు ఫిట్స్ వచ్చిన వారిలో 80 శాతం బాధితులు మాంసాహారం తీసుకోలేదని అయినప్పటికీ చేపలు, మాంసాహారం పైన కూడా పరిశోధన జరుపుతున్నామని పేర్కొన్నారు. కేసులు నమోదు ఉన్నంతవరకు వైద్య శిబిరాలను కొనసాగిస్తామని కమిషనర్ భాస్కర్ సీఎం జగన్మోహన్ రెడ్డికి వివరించారు.

మరో నాలుగు రోజుల పాటు ఉత్కంఠ . ఏలూరు వాసుల్లోనూ టెన్షన్

మరో నాలుగు రోజుల పాటు ఉత్కంఠ . ఏలూరు వాసుల్లోనూ టెన్షన్

ఎట్టి పరిస్థితుల్లోనూ ఏలూరు వింత వ్యాధికి సంబంధించి కారణం తెలుస్తుంది అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సమయంలో మరో నాలుగు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు చెప్పడం అసలు ఏలూరులో వింత వ్యాధికి కారణం ఏంటి అన్న ఉత్కంఠకు తెరదించకుండా కొనసాగేలా చేస్తుంది. నిన్నటి వరకు నీళ్లలో, పాలలో సీసం, నికెల్ వింత వ్యాధికి కారణం అనుకున్న ఏలూరు వాసులు , నిపుణుల బృందం తోపాటు ఇప్పుడు ఇతరత్రా కారకాలను వెతికే పనిలో పడ్డారు.

English summary
State Medical Health Commissioner Bhaskar said the cause of the mysteriuos disease in Eluru was not by drinking water and there was nikel and led content in the drinking water. He said the only reason for the illness of the people in Eluru in West Godavari district was the reaction. The commissioner briefed the chief minister on the latest situation in a video conference organized by CM Jaganmohan Reddy on the Eluru incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X