ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Boy In Borewell: బోరుబావిలో పడిన బాలుడు.. యువకుడి తెగింపుతో ఐదు గంటల నరకయాతనకు తెర..

|
Google Oneindia TeluguNews

ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిన 9 ఏళ్ల బాలుడిని స్థానికులు రక్షించిన ఘటన ఏపీలోని ఏలూరు జిల్లాలో జరిగింది. దాదాపు 5 గంటలకు పైగా బోరుబావిలో ఇరుక్కున్న బాలుడు ఎట్టకేలకు స్థానిక యువకుల సాయంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం గుండుగొలనుకుంటకు చెందిన 9 ఏళ్ల పూర్ణజస్వంత్ బుధవారం సాయంత్రం ఇంటి దగ్గర ఆడుకుంటున్న 400 అడుగుల లోతు ఉన్న బోరు బావిలో ప్రమాదవశాత్తు జారిపడ్డాడు.30 అడుగుల లోతులో ఉన్న బండరాయి వద్ద ఇరుక్కుపోయాడు.

రాత్రి 9 గంటలకు

అప్పటికే జస్వంత్ కోసం వెతకడం ప్రారంభించారు. ఇళ్లు, చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతకడం మొదలు పెట్టారు. కానీ జస్వంత్ ఆచూకీ లభించలేదు. చివరకు రాత్రి 9 గంటల ప్రాంతంలో బోరు బావిలో నుంచి జస్వంత్ కేకలు వేస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. స్థానికులు బోరు బావి వద్దకు చేరుకుని తాళ్ల సహాయంతో బాలుడిని రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే వారి ప్రయత్నం ఫలించలేదు.

Nine-year old boy who fell in borewell rescued by local youth in Eluru

యువకుడి ధైర్యం

స్థానిక యువకుడు సురేష్ ధైర్యంగా నడుముకు తాడు బిగించుకుని బోరుబావిలోకి దిగి బాలుడిని నడుముకు తాడు బిగించి పైకి లాగాడు. ఈ ప్రమాదంలో జస్వంత్ సురక్షితంగా బయటపడడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకోగానే.. భీమడోలు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని బాలుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. సుమారు 5 గంటల పాటు బోరుబావిలో ఉన్న బాలుడు జస్వంత్ ప్రాణాలతో బయటపడడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

English summary
A 9-year-old boy who accidentally fell into a borehole while playing was rescued by the locals
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X