ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొంపముంచిన చాటింగ్ : వలపు వలలో చిక్కి 4 లక్షలు సమర్పయామి ..!

|
Google Oneindia TeluguNews

ఏలూరు : సోషల్ మీడియా .. ఏదైనా సమాచారం క్షణాల్లో ప్రపంచానికి తెలిపే వేదిక. మంచి, చెడు విషయాల్లో వేగంగా తెలుస్తున్నాయి. అయితే దీనిని కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. ప్రేమ పేరుతో నకిలీ అకౌంట్లు క్రియేట్ చేస్తున్నారు. ఇదేం తెలియని వారు తమతో కనెక్టయ్యారని .. పెళ్లి చేసుకుంటామనే ధీమాతో అడిగిన డబ్బులు అకౌంట్‌లో వేస్తున్నారు.

చిగురించిన స్నేహం.. ఫ్రెండ్లీగా పంపకాలు..! ఎల్లుండి ప్రగతిభవన్​లో కేసీఆర్, జగన్​ భేటీ..!! చిగురించిన స్నేహం.. ఫ్రెండ్లీగా పంపకాలు..! ఎల్లుండి ప్రగతిభవన్​లో కేసీఆర్, జగన్​ భేటీ..!!

ఫేక్ అకౌంట్

ఫేక్ అకౌంట్

ఫేస్‌బుక్ .. సోషల్ మీడియాలో టాప్ సైట్. ఈ మాధ్యమం ద్వారా చిన్నప్పటి స్నేహితుల నుంచి .. బంధువులు కూడా దగ్గరవుతున్నారు. అయితే ఇదే అదనుగా భావించిన కొందరు కేటుగాళ్లు ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్నారు. అమ్మాయిల పేర్లు పెట్టి .. అట్రాక్ట్ చేసే ఫోటో పెట్టి టెంప్ట్ చేస్తున్నారు. ఇలాగే విశాఖపట్టణానికి చెందిన జోమ్మల మహేశ్వరరావు అడ్డంగా బుక్కయ్యాడు. దాదాపు రూ.4 లక్షలు ఖాతాలో వేసన .. మరో రూ.25 వేలు అడగడంతో అప్పుడు మేల్కొన్నాడ. సైబర్ క్రైం పోలీసులకు పిర్యాదు చేయడంతో బండారం బట్టబయలైంది.

కొంపముంచిన సంధ్య పేరు

కొంపముంచిన సంధ్య పేరు

మహేశ్వరరావుకు 2017లో సంధ్య పేరుతో ఫేస్‌బుక్ రిక్వెస్ట్ వచ్చింది. వాస్తవానికి దానిని పంపింది కాకినాడ వద్ద తాళ్లరేవుకు చెందిన కంచుస్తంభం జగదీశ్ అని పోలీసులు గుర్తించారు. ఆ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయడమే అతనిపాలిట శాపంగా మారింది. తర్వాత ఫేస్‌బుక్‌లో స్నేహం కొనసాగింది. చాటింగ్ చేస్తూ .. చేస్తూ ... ఒకరికొకరు చూసుకొకుండానే ప్రేమలో పడిపోయారు. మహేశ్వరరావును నిండా ప్రేమలో ముంచిన కేటుగాడు తన కుటుంబం పేరు చెప్పి డబ్బులు గుంజడం మొదలెట్టాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పి రూ.3 లక్షల 98 వేల 300 గుంజాడు. ఇంతవరకు ఓకే .. అమ్మాయి కదా అని మహేశ్వరరావు నమ్మాడు. కానీ ఇటీవల చాటింగ్ లేదు. ఏం జరిగిందో అనుకున్నాడు. కానీ మళ్లీ లైన్‌లోకి వచ్చిన కేటుగాడు కొత్తనాటకం మొదలెట్టాడు.

పెళ్లి పేరుతో మరో మోసం

పెళ్లి పేరుతో మరో మోసం

తనకు పెళ్లైందని చెప్పాడు. ఇష్టం లేకున్నా ఒత్తిడి చేసి మ్యారేజ్ చేశాడని వివరించాడు. అయితే తాను అమెరికాలో ఉన్నానని చెప్పడంతో సంధ్యపై అనుమానం వచ్చింది. తాను భారత్ వచ్చేస్తానని చెప్పడంతో మహేశ్వరరావుకు సందేహం తలెత్తింది. అందుకోసం రూ.25 వేలు కావాలని కోరడంతో అనుమానం మరింత బలపడింది. దీంతో విశాఖ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు మహేశ్వరరావు. ఫేస్‌బుక్ వ్యవహారంపై విచారణ చేపట్టిన పోలీసులు ..కేటుగాడిని గుర్తించారు. కాకినాడకు చెందిన జగదీశ్ అనే వ్యక్తి సంధ్య పేరుతో అకౌంట్ క్రియేట్ చేశాడని తేలింది. మహేశ్వరరావు ఫిర్యాదు మేరకు జగదీశ్‌ను సైబర్ క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

English summary
Maheshwara Rao got a Facebook request in 2017 under the name Sandhya. It was originally sent to the police at Kakinada by the police. The friendship then continued on Facebook. Chatting .. doing ... falling in love without looking at each other.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X