ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎస్వీ రంగారావు మేనల్లుడు.. టీడీపీ నేత బడేటి బుజ్జి హఠాన్మరణం

|
Google Oneindia TeluguNews

టీడీపీ నేత..మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి (కోట రామారావు) హఠాన్మరణం చెందారు. ఆయన తాజా ఎన్నికల్లో ఏలూరు నుండి పోటీ చేసి ఓడిపోయారు. ప్రజారాజ్యం ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిన బుజ్జి 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అర్థరాత్రి దాటిన తర్వాత బడేటి బుజ్జికి గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా ఆయన మృతిచెందారు. దీంతో టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరుపున ఏలూరు నుంచి ఆయన మొదటిసారి పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి 24,603 ఓట్లతో బడేటి బుజ్జి భారీ విజయాన్ని అందుకున్నారు. 2014 నుంచి 2019 వరకు ఏలూరు ఎమ్మెల్యేగా ఆయన పనిచేశారు. గత ఎన్నికల్లో మాత్రం 4072ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) చేతిలో బడేటి బుజ్జి ఓటమిపాలయ్యారు. ఆ తరువాత సైతం ఆయన టీడీపీలో యాక్టివ్ గానే పని చేస్తున్నారు.

TDP Ex Mla Badeti Bujji sudden death due to cardiac arrest in mid night

గత ఎన్నికల్లో నానిని ఓడించేందుకు..
బడేటి బుజ్జి ఏలూరు లో మాస్ లీడర్ గా ఉన్నారు. ఆయన దివంగత ప్రముఖ సినీ నటుడు ఎస్వీ రంగారావు మేనల్లుడు. ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల్లో ఏలూరు నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసారు. అక్కడి నుండి వైసీపీ అభ్యర్ధిగా ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) పోటీ చేసారు. అయితే, పోలింగ్ రోజు సాయంత్రం వరకు ఏలూరులో టీడీపీ..వైసీపీ వర్గాల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ సాగింది. ఇక, కౌంటింగ్ సమయంలోనూ బుజ్జి తన గెలుపు పైన ధీమాతోనే కనిపించారు. చివరకు 4072 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఆ తరువాత టీడీపీకి చెందిన కాపు నేతలు కాకినాడలో సమావేశం నిర్వహించిన సమయంలో బడేటి బుజ్జి సైతం కీలకంగా మారారు. అధికారం కోల్పోయిన తరువాత సైతం ఆయన టీడీపీలో యాక్టివ్ గానే కొనసాగుతున్నారు. ఆకస్మికంగా గుండుపోటుకు కు గురైన బుజజిని అర్ద్రరాత్రి ఆస్పత్రి కి తరలిస్తుండగా ..మృతిచెందారు. పార్టీ అధినేత చంద్రబాబు.. మాజీ మంత్రి లోకేశ్ తో సహా..పార్టీ ప్రముఖులు ఈ వార్త తెలుసుకొని షాక్ కు గురయ్యారు.

English summary
TDP leader and Ex Mla Badeti Bujji sudden death caused shock for TDP leaders. He worked as MLA from Eluru from 2014 to 2019. In midnight by Cardiac arrest he wad died.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X