ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చింతమనేని ప్రభాకర్ మళ్లీ అరెస్ట్: గృహ నిర్బంధం నుంచి తప్పించుకుని: పోలీసులతో ఘర్షణ

|
Google Oneindia TeluguNews

ఏలూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, శాసనసభా పక్ష ఉపనేత, కార్మికశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అరెస్టుకు నిరసనగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేపట్టిన ఆందోళనలు అరెస్టులకు దారి తీస్తున్నాయి. ఇప్పటికే మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య హౌస్ అరెస్టు అయ్యారు. గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అరెస్టు అయ్యారు. అదే క్రమంలో- చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Recommended Video

Chintamaneni Prabhakar అరెస్ట్, పోలీసులతో చింతమనేని ఘర్షణ, తోపులాట Video

దేవినేని ఉమా, వర్ల రామయ్య హౌస్ అరెస్ట్: టీడీపీ నిరసనల పర్వం: అంబేద్కర్, ఫులే విగ్రహాలకుదేవినేని ఉమా, వర్ల రామయ్య హౌస్ అరెస్ట్: టీడీపీ నిరసనల పర్వం: అంబేద్కర్, ఫులే విగ్రహాలకు

పశ్చిమ గోదావరి జిల్లాలోని కలపర్రు చెక్‌పోస్ట్ వద్ద ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. అచ్చెన్నాయుడు అరెస్టుకు నిరసనగా ధర్నా చేయడానికి బయలుదేరిన ఆయనను హౌస్ అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న చింతమనేని ప్రభాకర్ తన ఇంటికి పోలీసులు రావడానికి ముందే బయటికి వెళ్లిపోయారు. తెలుగుదేశం పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడానికి తన అనుచరులతో కలిసి బయలుదేరారు.

TDP Ex MLA Chintamaneni Prabhakar arrested by the Police

ఆయన ఇంట్లో లేరనే విషయం తెలుసుకున్న తరువాత పోలీసులు గాలించారు. కలపర్రు చెక్‌పోస్ట్ మార్గంలో వెళ్తున్నట్లు తెలియడంతో పోలీసులు అక్కడి కానిస్టేబుళ్లకు సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తం అయ్యారు. చింతమనేనిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. తమ నాయకుడిని అరెస్టు చేయడానికి వీల్లేదంటూ ఆయన అనుచరులు పోలీసులతో ఘర్షణకు దిగారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తమ వాహనంలో తీసుకెళ్లారు. మొత్తంమీద చింతమనేని ప్రభాకర్ అరెస్టు కావడం ఇది 14వ సారి. ఇదివరకు ఆయన పలు కేసుల్లో అరెస్టు అయ్యారు. కారాగార జీవితాన్ని గడిపారు. కొద్దిరోజుల కిందటే బెయిల్ మీద బయటికి వచ్చారు. అదే సమయంలో అచ్చెన్నాయుడు అరెస్టు కావడం, దానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలను నిర్వహించబోయి చింతమనేని మళ్లీ అరెస్టు అయ్యారు.

English summary
Telugu Desam Party senior leader and Former MLA Chintamaneni Prabhakar was arrested by the Police after trying to protest against Former Minister Kinjarapu Atchannaidu arrest in ESI Scam by ACB.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X