ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుడి మెట్ల వద్దకు చేరకున్న చరిత్ర ఆనవాలు...? మైండ్ బ్లాంక్ అయ్యే వాస్తవాలు..!!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : చరిత్ర ఎంత ఘనంగా ఉంటే మాత్రం ఉపయోగం ఏముంటుంది..? ప్రస్తుతానికి తలదాచుకోవడానికి గూడు, తినడానికి నాలుగు మెతుకులు, కట్టుకోవడానికి సరైన గుడ్డ పొందలేని స్థితిలో ఉన్నప్పుడు గతంలో ఎంత ఘనకీర్తి ఉన్న సుఖమేంటి..? దేశానికి గాని, రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించిన వారి పట్ల ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవరిస్తూ సముచిత స్థావనం కల్పిస్తుంటుంది. అవసరమనుకుంటే ఆర్ధిక సాయం కూడా అందిస్తుంది.

కానీ ఆ కుటుంబానికి వచ్చిన సమస్యలను గత ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోలేదో ఎవరికి అంతుచిక్కని ప్రశ్నగా మారింది. దేశ జాతీయ జెండాకు రూపకల్పన చేసి దేశానికి ఓ వర్ణం, ఓ జాతి, ఓ గతి చూపించిన పింగళి వెంకయ్య కుటుంబం సమస్యల వలయంలో చిక్కుకున్న అంశాన్ని ప్రభుత్వాలు ఎందుకు మర్చిపోయాయో ఎవరికి అర్ధం కావడం లేదు, ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులు కడు దరిద్య్రాన్ని అనుభవిస్తున్నట్టు తెలుస్తోంది.

The history went to temple stairs..? The bitter facts of a Family..!!

ఈ ఫోటోలో గుడి మెట్ల వద్ద కుర్చీలో కూర్చున్న ఆవిడ ఎవరో చాలా మందికి తెలియక పోవచ్చు. అసలు ఎవరికి కూడా అంతగా తెలిసి ఉండకపోవచ్చు. ఈమె మన భారతదేశ జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారికి స్వయానా కోడలు.ఈమె ఏలూరు లోని ఒక గుడి మెట్ల వద్ద బిక్షాటన చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంది.

ఈ విషయాన్ని గుర్తించిన ఆ ఏరియా కలెక్టర్ ఆగష్టు రెండవ తేదీన పింగళి వెంకయ్య గారి జన్మదినం సందర్బంగా ఆయన కుటుంబ సభ్యులను కలసి ఆమె గురించి తెలుసుకుని ఆమె వద్దకు వెళ్ళి పళ్ళు, పలహారాలు అందించి, అమ్మ ఇక నుంచి ప్రభుత్వ ఖర్చుతో నీకు అన్ని రకాల వసతులు కల్పిస్తామని తెలుపగా....ఆమె దానికి ఒప్పుకోలేదు. తాను ప్రభుత్వానికి భారం కాదల్చుకోలేదని స్పష్టంగా వివరించినట్టు తెలుస్తోంది. ఏదైనా ఓల్డేజ్ హోమ్ లో చేరుస్తాము రండి అని చెప్పినా కూడా ఆమె ఒప్పుకోలేదట. నేను ఈ గుడి వద్దనే ఉంటు దైవస్మరణ చేసుకుంటూ బ్రతుకుతాను అని తేల్చిచెప్పిందట ఆ మహోన్నుతరాలు.

మా మావయ్య గారు మహానుభావులు అటువంటి కుటుంబానికి నేను కోడలుగా రావడమే నా అదృష్టం అని చెప్పి, ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేసి ఆయనకి తలవంపులు తీసుకురాలేను నేను అని చెప్పిందట.మహానుభావులు, త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారి కుటుంబ సభ్యులు, స్వయానా ఆయన కోడల్ని ఇలాంటి పరిస్థితుల్లో కలుసుకోవడం చాలా భాదాకరమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

English summary
She is the daughter of the national flag designer of our India, Pingali Venkaiah ji. She will continue to live in a temple at Eluru. The area collector, who identified the matter, was born on the second of August, Pingali Venkayya's birthday, when he learned about her family members and went to her to go to her and provide her with fruits and teeth, She refused to do so.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X