కూతురు వెంటపడుతున్న యువకుడి మర్మాంగాన్ని రోకలిబండతో చితక్కొట్టిన తండ్రి; ఏలూరు జిల్లాలో ఘటన
ఏలూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన కుమార్తె వెంట పడుతున్నాడన్న కారణంతో ఓ యువకుడిపై యువతి తండ్రి విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన అందరినీ షాక్ కు గురి చేసింది. ఇక ఈ ఘటన వివరాల్లోకి వెళితే

ఏలూరులో షాకింగ్ ఘటన.. కూతురు వెంటపడుతున్న యువకుడిపై తండ్రి దారుణం
ఏలూరు
జిల్లాలోని
చాట్రాయి
మండలం
నరసింహారావు
పాలెంలో
జరిగిన
సంఘటన
స్థానికంగా
చర్చనీయాంశంగా
మారింది.
నరసింహారావు
పాలెం
గ్రామానికి
చెందిన
శ్రీకాంత్
అనే
యువకుడు
అదే
గ్రామానికి
చెందిన
ఒక
యువతిని
ప్రేమించాడు.
ఇక
తన
కుమార్తెను
శ్రీకాంత్
వెంట
పడుతున్నాడని
గమనించిన
యువతి
తండ్రి
జాన్
అతడిని
ఇంటికి
పిలిపించి
చీకటి
గదిలో
బంధించి
చిత్రహింసలకు
గురిచేశాడు.
తన
కుమార్తె
కావాలా
అంటూ
ఆగ్రహంతో
ఊగిపోయాడు.

యువకుడి మర్మాంగాలను రోకలిబండతో చితక్కొట్టిన యువతి తండ్రి
తన కుమార్తె వెంట పడుతున్నాడని కోపంతో యువతి తండ్రి యువకుడి మర్మాంగాలపై రోకలిబండతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఇక ఈ దాడిలో యువకుడు శ్రీకాంత్ తీవ్ర గాయాలపాలయ్యాడు. యువకుడి పరిస్థితి విషమంగా మారడంతో, ఈ విషయం తెలిసిన స్థానికులు వెంటనే యువకుడిని హుటాహుటిన విజయవాడ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

కేసు నమోదు... యువతి తండ్రి కోసం గాలింపు
యువకుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు యువతి తండ్రి జాన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఈ ఘటన నేపధ్యంలో గ్రామంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక ఈ ఘటన తర్వాత జాన్ పరారయ్యాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు ప్రస్తుతం జాన్ కోసం గాలింపు చేపట్టారు. తప్పు చేస్తే మందలించాలి. ఇంకా ఇబ్బందికరంగా ప్రవర్తిస్తే పోలీసులకు ఫిర్యాదు చెయ్యాలి కానీ ఈ విధంగా దాడి చెయ్యటం దారుణం అని స్థానికులు అంటున్నారు.

రోజురోజుకీ పెరుగుతున్న దారుణ ఘటనలు ..తెలంగాణాలోనూ పరువు హత్య
ఇక
సమాజంలో
ఇటువంటి
దారుణ
ఘటనలు
రోజురోజుకు
పెరిగిపోతున్నాయి.
ఇక
తాజాగా
తెలంగాణ
రాష్ట్రంలోనూ
నచ్చని
వ్యక్తిని
తన
కుమార్తె
పెళ్లి
చేసుకుందని,
సుపారీ
గ్యాంగ్
తో
అల్లుడిని
దారుణంగా
హతమార్చేలా
చేశాడు
ఓ
మామ.
రెండేళ్లక్రితం
2020లో
ప్రేమించుకున్న
ఓ
జంట
ప్రేమ
వివాహం
చేసుకున్నారు.
ఇక
వారి
పెళ్లిని
అంగీకరించని
యువతి
తండ్రి
10లక్షలు
సుపారీ
ఇచ్చి
11మందితో
అల్లుడిని
హత్య
చేయించాడు.
ఇదిలా
ఉంటే
ఏపీలోని
ఏలూరు
జిల్లాలో
తన
కుమార్తె
వెంటపడుతున్నాడు
అన్న
కారణంతోనే
యువకుడిని
చీకటి
గదిలో
బంధించి
రోకలిబండతో
మర్మాంగాలను
చితక్కొట్టాడు
మరో
తండ్రి.