వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎండ్ ఆఫ్ ద రోడ్: చెన్నై సూపర్ కింగ్స్‌కు మిస్టర్ ఐపీఎల్ రివర్స్ షాక్: ధోనీ సేన నుంచి బయటికి?

|
Google Oneindia TeluguNews

చెన్నై: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో కొనసాగుతోన్న ఐపీఎల్-2020 సీజన్ 13వ ఎపిసోడ్‌లో టైటిల్ హాట్ ఫేవరెట్ చెన్నై సూపర్ కింగ్స్ చవి చూసిన రెండు వరుస పరాజయాలు.. ఓ నిఖార్సయిన ఆల్‌రౌండర్ అవసరాన్ని ఎత్తి చూపాయి. బ్యాటింగ్, బౌలింగ్.. చివరికి ఫీల్డింగ్‌లోనూ మెరుపులు మెరిపించగల సత్తా ఉన్న నాణ్యమైన ఆల్‌రౌండర్‌ను అర్జెంట్‌గా జట్టులోకి తీసుకోవాల్సి ఉంటుందనే సంకేతాలను పంపించాయి. ఈ పరిణామాలు- టోర్నమెంట్ ప్రారంభానికి ముందే జట్టుకు దూరమైన సురేష్ రైనా ఎంత విలువైన ఆటగాడో తెలిసేలా చేశాయి.

Come back Mr IPL: రక్షకుడతడే: నువ్వు లేక: అతనొస్తే గెలుపు గ్యారంటీ: ఫ్యాన్స్ పట్టుCome back Mr IPL: రక్షకుడతడే: నువ్వు లేక: అతనొస్తే గెలుపు గ్యారంటీ: ఫ్యాన్స్ పట్టు

 సురేష్ రైనాను పిలిపించబోమంటూ..

సురేష్ రైనాను పిలిపించబోమంటూ..

ఈ పరిస్థితుల్లో Come back Mr IPL అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా గళమెత్తిన వేళ.. టీమ్ మళ్లీ విజయాల బాట పట్టాలంటే సురేష్ రైనా వంటి ఆల్‌రౌండర్ అవసరం ఉందంట చెన్నై సూపర్ కింగ్స్ ఓ నిర్ణయానికి వచ్చిన సమయంలో..ఆయనను వెనక్కి పిలిపించే ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదంటూ జట్టు ముఖ్య కార్యనిర్వహణాధికారి కాశీ విశ్వనాథన్ తేల్చి చెప్పారు. టోర్నమెంట్‌కు దూరంగా ఉండాలనేది సురేష్ రైనా వ్యక్తిగత నిర్ణయమని, దాన్ని తాము గౌరవిస్తామని ఆయన చేసిన వ్యాఖ్యలు ఓ రకంగా సురేష్ రైనాకు షాక్ ఇచ్చినట్టయిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయ

 మరింత దూరం అయ్యేలా సంకేతాలు..

మరింత దూరం అయ్యేలా సంకేతాలు..

తనను మళ్లీ పిలిపిస్తారేమోననే ఆశలు ఏవైనా సురేష్ రైనాలో ఉండి ఉంటే.. కాశీ విశ్వనాథన్ చేసిన ప్రకటనతో అవి అడుగంటిపోయినట్టే. తనకు తానుగా రాజీపడితే తప్ప సురేష్ రైనాను ఎట్టి పరిస్థితుల్లోనూ జట్టులోకి ఆహ్వానించబోమని చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ మేనేజ్‌మెంట్ పరోక్షంగా వెల్లడించినట్టయింది. కాశీ విశ్వనాథన్ ప్రకటన వెలువడిన తరువాత.. సురేష్ రైనా తీసుకున్న ఓ నిర్ణయం.. తీసుకున్న చర్యలు.. చెన్నై సూపర్ కింగ్స్‌తో తన బంధం ఇక తెగినట్టేనని, తాను జట్టుకు మరింత దూరం అవుతున్నానని, విషయాన్ని చెప్పకనే చెప్పినట్టయింది.

 ట్విట్టర్ పేజీ నుంచి

ట్విట్టర్ పేజీ నుంచి

చెన్నై సూపర్ కింగ్స్ అధికారిక ట్విట్టర్ పేజీని సురేష్ రైనా అన్ ఫాలో చేశాడు. కాశీ విశ్వనాథన్ ప్రకటన వెలువడిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన సీఎస్‌కే ట్విట్టర్ పేజీ నుంచి వైదొలిగాడు. అతని చర్యలు అనేక అనుమానాలకు తావిస్తోంది. టీమ్ మేనేజ్‌మెంట్-సురేష్ రైనా మధ్య ఓ మినీ ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోందా? లేక.. జట్టును వీడటానికి తాను సిద్ధంగా ఉన్నాననే సందేశాన్ని అతను పంపించాడా? అనేది చర్చనీయాంశమౌతోంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అధికారిక ట్విట్టర్ పేజీని అన్ ఫాలో చేసిన సురేష్ రైనా.. తన స్నేహితుడు, స్కిప్పర్ మహేంద్ర సింగ్ ధోనీ మైక్రో బ్లాగింగ్‌లో కొనసాగుతున్నాడు.

సీఎస్‌కే నెక్స్ట్ మ్యాచ్‌లో ఏం చేస్తుందో?

సీఎస్‌కే నెక్స్ట్ మ్యాచ్‌లో ఏం చేస్తుందో?

చెన్నై సూపర్ కింగ్స్.. తన తరువాతి మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌ను ఢీ కొట్టబోతోంది. ఈ మ్యాచ్ ఈ రెండు జట్లకూ ప్రతిష్ఠాత్మకమైనవే. ఈ రెండింట్లో ఏ టీమ్ ఓడిపోయినా.. దానికి తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంది. టోర్నమెంట్‌లో మరింత ముందుకెళ్లడానికి దారులు మూసుకుని పోవచ్చు. ఆడిన మూడు మ్యాచుల్లో రెండింట్లో ఓటమిని చవి చూసింది చెన్నై సూపర్ కింగ్స్. రెండుకు రెండు మ్యాచుల్లోనూ దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్. శనివారం రాత్రి కోల్‌కత నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైంది.

 రాయుడు రాక ఖాయం..

రాయుడు రాక ఖాయం..

అక్టోబర్ 2వ తేదీన ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు. బోణీ కొట్టాలనే ఉద్దేశంతో సన్ రైజర్స్ హైదరాబాద్.. వరుస పరాజయాలకు తెర దించాలనే కసి ధోనీ సేనలో కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌కు అంబటి రాయుడు అందుబాటులోకి రావడం దాదాపు ఖాయమైనట్టే. దీనితో- హైదరాబాద్‌తో పోల్చుకుంటే.. బ్యాటింగ్ లైనప్ చెన్నై సూపర్ కింగ్స్ బలంగా మారుతుంది. విజయం ఎవరిని వరిస్తుందనేది అత్యంత ఆసక్తిని రేపుతోంది.

English summary
It looks like everything is over between Suresh Raina and CSK and that is pretty much confirmed by the batsman’s recent activity on Twitter. On Saturday, he unfollowed the franchise’s official Twitter handle and interestingly, the franchise has unfollowed him
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X