గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హనుమాన్ చాలీసా పారాయణానికి గిన్నిస్‌లో చోటు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

తెనాలి: గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించిన హనుమాన్ చాలీసా పారాయణానికి గిన్నిస్ బుక్‌లో చోటు లభించింది. దత్తపీఠం గణపతి సచ్చిదానంద స్వామి పర్యవేక్షణలో 1,28,913 మందితో హనుమాన్ చాలీసా పారాయణం చేసినట్లు గిన్నిస్ బుక్ ప్రతినిధులు ప్రకటించారు.

తమిళనాడు గవర్నర్ రోశయ్య చేతుల మీదగా గిన్నిస్ బుక్ ప్రతినిధులు గణపతి సచ్చిదానందస్వామికి గిన్నిస్ బుక్ రికార్డు పత్రాన్ని అందజేశారు. తెనాలి సమీపంలోని బుర్రిపాలెం రోడ్డులో జానకీరామ హనుమత్ ప్రాంగణంలో శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నాం 1 గంట వరకు జరిగిన ఈ కార్యక్రమంలో 27 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు.

గతంలో ఆంధ్రప్రదేశ్ లోనే 1.08 లక్షల మంది పేరిట ఉన్న రికార్డును తిరగరాశారు. దత్తపీఠాధిపతి సచ్చిదానంద స్వామి హనుమాన్ చాలీసా సందర్భంగా పారాయణం ప్రాధాన్యతను భక్తులకు వివరించారు.

ఈ సందర్భంలో తమిళనాడు గవర్నర్ రోశయ్య మాట్లాడుతూ దూర ప్రాంతాల నుంచి వచ్చిన వేల మంది భక్తులు ఒకే వేదికపై పారాయణం చేయడం దైవంపై ఉన్న విశ్వాసానికి నిదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చీఫ్ విప్ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్, తమిళనాడు అదనపు డీజీ శ్రీదేవి, సినీ నటుడు అశోక్ కుమార్ పాల్గొన్నారు.

గిన్నిస్ బుక్‌లో హనుమాన్ చాలీసా పారాయణంకు చోటు

గిన్నిస్ బుక్‌లో హనుమాన్ చాలీసా పారాయణంకు చోటు

గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించిన హనుమాన్ చాలీసా పారాయణానికి గిన్నిస్ బుక్‌లో చోటు లభించింది. దత్తపీఠం గణపతి సచ్చిదానంద స్వామి పర్యవేక్షణలో 1,28,913 మందితో హనుమాన్ చాలీసా పారాయణం చేసినట్లు గిన్నిస్ బుక్ ప్రతినిధులు ప్రకటించారు.

 గిన్నిస్ బుక్‌లో హనుమాన్ చాలీసా పారాయణంకు చోటు

గిన్నిస్ బుక్‌లో హనుమాన్ చాలీసా పారాయణంకు చోటు

తెనాలి సమీపంలోని బుర్రిపాలెం రోడ్డులో జానకీరామ హనుమత్ ప్రాంగణంలో శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నాం 1 గంట వరకు జరిగిన ఈ కార్యక్రమంలో 27 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు.

గిన్నిస్ బుక్‌లో హనుమాన్ చాలీసా పారాయణంకు చోటు

గిన్నిస్ బుక్‌లో హనుమాన్ చాలీసా పారాయణంకు చోటు

గతంలో ఆంధ్రప్రదేశ్ లోనే 1.08 లక్షల మంది పేరిట ఉన్న రికార్డును తిరగరాశారు. దత్తపీఠాధిపతి సచ్చిదానంద స్వామి హనుమాన్ చాలీసా సందర్భంగా పారాయణం ప్రాధాన్యతను భక్తులకు వివరించారు.

 గిన్నిస్ బుక్‌లో హనుమాన్ చాలీసా పారాయణంకు చోటు

గిన్నిస్ బుక్‌లో హనుమాన్ చాలీసా పారాయణంకు చోటు

తమిళనాడు గవర్నర్ రోశయ్య చేతుల మీదగా గిన్నిస్ బుక్ ప్రతినిధులు గణపతి సచ్చిదానందస్వామికి గిన్నిస్ బుక్ రికార్డు పత్రాన్ని అందజేశారు.

English summary
Chanting of Hanuman chalisa finds place in Guinness Record Book.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X