చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రజనీతో కరచాలనం, పంచకట్టులో మోడీ(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

చెన్నై: భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ సమర్థనాయకుడని దక్షిణాది సూపర్ స్థార్ రజనీకాంత్ అన్నారు. మోడీకి మంచే జరగాలని కోరుకుంటున్నట్లు రజనీ తెలిపారు. ఆదివారం మోడీతో సమావేశం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోడీ అక్కణ్నుంచి విమానంలో చెన్నైకి వెళ్లారు.

అనంతరం మోడీ విమానాశ్రయం నుంచి నేరుగా చెన్నైలోని పోయెస్‌గార్డెన్‌లోని రజనీకాంత్ ఇంటికి వెళ్లారు. సుమారు 30 నిమిషాలపాటు వీరిద్దరూ ఏకాంతంగా సమావేశమై మాట్లాడుకున్నారు. తమిళనాట కమలం జెండా ఎగురవేయడానికి మోడీ.. సూపర్‌స్టార్ సాయం కోరినట్టు సమాచారం. భేటీ అనంతరం రజనీకాంత్ స్వయంగా ఇంటి బయటకు వచ్చి మోడీకి వీడ్కోలు పలికారు. ఈ సమయంలో వీరు కరచాలనం చేసుకుని ఒకరినొకరు హత్తుకున్నారు. మోడీకి రజనీ అందరి ముందూ 'ఆల్ ది బెస్ట్' అని చెప్పారు.

తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. తమది మర్యాదపూర్వక సమావేశం మాత్రమేనని, మోడీ తనకు పాత స్నేహితుడని.. గతంలో తాను అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆయన ఆస్పత్రికి వచ్చి పరామర్శించారని తెలిపారు. అప్పుడు తాను.. ఆయన ఎప్పుడు చెన్నైకు వస్తే అప్పుడు తన ఇంటికి వచ్చి టీ తాగి వెళ్లాల్సిందిగా కోరానని, మోడీకి సమయం కుదరడంతో ఇప్పుడు వచ్చారని రజనీకాంత్ తెలిపారు. ఆయన రాక తనకెంతో ఆనందం కలిగించిందన్నారు. తాను మోడీ శ్రేయోభిలాషినైతే.. మోడీ తన శ్రేయోభిలాషి అని నవ్వుతూ అన్నారు.

రజనీకాంత్ తనకు మంచి స్నేహితుడని, సోమవారం తమిళ సంవత్సరాది సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపానని మోడీ చెప్పారు. ఈ సమావేశానికి ఇంతకంటే రాజకీయ ప్రాధాన్యం లేదని పేర్కొన్నారు. రజనీని కలిసిన సందర్భంగా మోడీ అచ్చమైన తమిళుడిలా తెల్లటి పంచె అడ్డకట్టు కట్టారు. పైన కాషాయ, తెలుపు రంగులున్న చారల చొక్కా వేసుకుని ఆకుపచ్చ అంచు కండువా భుజాలమీద వేసుకున్నారు. ఏప్రిల్ 24న తమిళనాడులో లోకసభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రజనీతో మోడీ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

మంచే జరగాలి

మంచే జరగాలి

భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ సమర్థనాయకుడని దక్షిణాది సూపర్ స్థార్ రజనీకాంత్ అన్నారు. మోడీకి మంచే జరగాలని కోరుకుంటున్నట్లు రజనీ తెలిపారు.

చిరునవ్వులు

చిరునవ్వులు

కర్ణాటకలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోడీ అక్కణ్నుంచి విమానంలో చెన్నైకి వెళ్లారు. అనంతరం మోడీ విమానాశ్రయం నుంచి నేరుగా చెన్నైలోని పోయెస్‌గార్డెన్‌లోని రజనీకాంత్ ఇంటికి వెళ్లారు.

కరచాలనం

కరచాలనం

రజనీకాంత్ తనకు మంచి స్నేహితుడని, సోమవారం తమిళ సంవత్సరాది సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపానని మోడీ చెప్పారు.

పాత స్నేహమే

పాత స్నేహమే

తమది మర్యాదపూర్వక సమావేశం మాత్రమేనని, మోడీ తనకు పాత స్నేహితుడని.. గతంలో తాను అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆయన ఆస్పత్రికి వచ్చి పరామర్శించారని రజనీ తెలిపారు.

పంచకట్టులో మోడీ

పంచకట్టులో మోడీ

రజనీని కలిసిన సందర్భంగా మోడీ అచ్చమైన తమిళుడిలా తెల్లటి పంచె అడ్డకట్టు కట్టారు. పైన కాషాయ, తెలుపు రంగులున్న చారల చొక్కా వేసుకుని ఆకుపచ్చ అంచు కండువా భుజాలమీద వేసుకున్నారు.

నాకు ఆయన.. ఆయనకు నేను

నాకు ఆయన.. ఆయనకు నేను

మోడీ రాక తనకెంతో ఆనందం కలిగించిందన్నారు. తాను మోడీ శ్రేయోభిలాషినైతే.. మోడీ తన శ్రేయోభిలాషి అని నవ్వుతూ అన్నారు.

మర్యాద పూర్వకమే..

మర్యాద పూర్వకమే..

రజనీకాంత్ తనకు మంచి స్నేహితుడని, సోమవారం తమిళ సంవత్సరాది సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపానని మోడీ చెప్పారు. ఈ సమావేశానికి ఇంతకంటే రాజకీయ ప్రాధాన్యం లేదని పేర్కొన్నారు.

English summary
BJP's prime ministerial candidate Narendra Modi on Sunday met Tamil superstar Rajinikanth at his residence in Chennai, setting off speculation, but the actor termed it as a courtesy call and said no political significance should be attached to it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X