సోనూసూద్ ఆశ్చర్యం: 31 వేలకు పైగా విన్నపాలు.. అందరికీ సాయం చేయలేనంటూ ట్వీట్, క్షమించాలని
సోనూ సూద్ .. ఆపద వస్తే ఆదుకునే కనిపించే దేవుడిలా మారిపోయారు. సమస్య ఏదైనా సరే చిటికెలో స్పందిస్తూ మన్ననలు పొందుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందినవారికి కూడా సాయం చేశారు. అయితే అతనికీ కూడా ఒక సమస్య వచ్చింది. సాయం చేయాలని వేలాది మెయిల్స్ రావడంతో.. ఆయనే ఆశ్చర్యపోయారు. మెయిల్స్ వివరాలు, సమస్యలకు సంబంధించి ఇవాళ ట్వీట్ చేశారు.
సోనూ సూద్, రైతు నాగేశ్వరరావు మాటా మంతీ, ఊరికి రావాలని కోరిన రైతు, వస్తానని రియల్ హీరో హామీ
31,690 విన్నపాలు..
సమస్యల్లో ఉన్నామని అని చెబితే చాలు సోనూ సూద్ సాయం చేస్తున్నారు. దీంతో గత 24 గంటల్లో ఆయనకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. 1137 మెయిల్స్, 19 వేల ఫేస్బుక్ మెసేజ్, 4812 ఇన్ స్ట్రాగ్రామ్ మెసేజ్, 6741 ట్వీట్ మెసేజ్ వచ్చాయని పేర్కొన్నారు. ఇవీ అన్నీ కలిపితే 31 వేల 690 ఉన్నాయి. ఇన్నీ మెసేజ్ చూసి సోనూ సూద్ ఆశ్చర్యపోయారు.

ఇంతమందికి సాయమా..? అసాధ్యం...
ఇంతమందికి సాయం చేయడం అసాధ్యం అని చెప్పారు. వీలైనంత మందికి సాయం చేయడానికి ప్రయత్నిస్తానని వివరించారు. ఎవరైనా మెసేజ్ మిసయితే క్షమించాలని కోరారు. సోనూ సూద్‌కు వివిధ సమస్యలతో అందరూ మెసేజ్ చేస్తున్నారు. కొందరు విద్యార్థులు ల్యాప్ ట్యాప్ కావాలని కూడా కోరుతున్నారు. అలా చాలా మెసేజ్ వస్తున్నాయి. ఇందులో సీరియస్‌గా అవసరం ఉన్న మెయిల్స్ కొన్ని కాగా.. అవసరం లేనివి కూడా ఉండి ఉంటాయి. దీంతో వాటిని స్క్రూటినీ చేసి.. సాయం చేయడం సోనూ సూద్ అండ్ టీమ్‌కు కత్తిమీద సాములా మారింది.

చిత్తూరు రైతుకు ట్రాక్టర్..
తెలుగు రాష్ట్రాలకు చెందిన వారికి కూడా సోనూసూద్ సాయం చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన నాగేశ్వరరావు మదనపల్లెలో టీ స్టాల్ నాగేశ్వరరావు నడిపేవారు. లాక్ డౌన్ వల్ల గ్రామానికి వచ్చి.. తన కూతుళ్లతో దున్నడం, ఆ ఫోటోలు సోనూసూద్ చూశారు. దీంతో వెంటనే సోనాలికా ట్రాక్టర్ పంపించేశారు. దీంతో ఆ కుటుంబం ఆనందానికి అవధి లేకుండా పోయింది. మరోవైపు జిల్లాలోని గంగవరం మండలం కలగటూరుకి చెందిన వెంకటరామయ్య కుటుంబానికి కూడా ఆర్థికసాయం చేస్తానని ప్రకిటించారు.

సాప్ట్ వేర్ శారదకు జాబ్ ఆఫర్
కరోనా వైరస్ వల్ల విధించిన లాక్ డౌన్ మార్కెట్ కుదేలైపోయింది. వరంగల్‌కి చెందిన శారద.. సాప్ట్ వేర్ ఇంజినీర్ కానీ, ఉద్యోగం కోల్పోయింది. కూరగాయాలు అమ్ముతూ తన ఇంటిని గడుపుతోంది. ఇంకేముంది కూరగాయాలు విక్రయిస్తూ జీవిస్తోన్న టెకీ అనే వార్త సోషల్ మీడియాలో జోరుగా వైరలైంది. ఈ విషయం తెలుసుకొని సోనూసూద్ స్పందించారు. శారదకు ఉద్యోగం ఆఫర్ చేశాడు. అయితే శారద మాత్రం సోనూసూద్ ఆఫర్ తీసుకోలేదు. శ్రీనగర్ కాలనీలో కూరగాయాలు అమ్ముతూ జీవిస్తోంది.