హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీ ధూంధాం: అంబరాన్నంటిన సంబరాలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ద్వితీయ అవతరణ దినోత్సవ వేడుకలు నగరంలో అంగరంగ వైభవంగా జరిగాయి. సంబురాలు అంబరాన్నంటాయి. బుధవారం అర్ధరాత్రి నుంచే వీధుల్లో వేడుకల సందడి మొదలైంది. గురువారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ప్రతి ఒక్కరూ ఈ పండుగ వాతావరణంలో పాలుపంచుకున్నారు. కార్యాలయాల్లో అధికారులు జెండా వందనం నిర్వహించారు. పిల్లలకు పుస్తకాలు, మిఠాయిలు పంచారు.

ట్యాంకుబండ్‌పై ఉదయం నుంచే సందర్శకుల తాకిడి కనిపించింది. విద్యుత్తు వెలుగులు, బాణాసంచాలతో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ధూంధాంగా జరిగింది. రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక, జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, జలమండలి, ఆర్టీసీ తదితర అన్ని ప్రభుత్వ శాఖలు పూర్తిస్థాయిలో వేడుకల్లో పాల్గొన్నాయి. ప్రభుత్వ కార్యాలయాలను సుందరంగా అలంకరించారు.

పూల తోరణాలతో కొత్త శోభ తీసుకొచ్చారు. విద్యుద్దీపాలతో ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. డివిజన్లలో కార్పొరేటర్ల ఆధ్వర్యంలో కేక్‌ కోసి సంతోషాన్ని పంచుకున్నారు. ప్రముఖ హోటళ్లు వేడుకలకు ఆహ్వానం పలుకుతూ ఆహారోత్సవాలు నిర్వహించాయి. తెలంగాణ రుచులతో శాకాహార, మాంసాహార ప్రియులను ఆకర్షించాయి.

మిరుమిట్లు గొలిపిన వెలుగులు:

నెక్లెస్‌ రోడ్డుకి ఇరువైపులా విద్యుద్దీపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హుస్సేన్‌ సాగర్‌లో వాటర్‌ ఫౌంటెన్లు ఆకట్టుకున్నాయి. రంగురంగుల వెలుగులతో హోరెత్తించే పాటలతో ట్యాంక్‌బండ్‌ పండుగ వాతావరణానికి అద్దం పట్టింది. వివిధ రంగులతో బుద్ధుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
బాణాసంచా అదుర్స్:

హుస్సేన్‌ సాగర్‌లో పర్యాటక శాఖ 'ఫైర్‌వాల్‌' కార్యక్రమాన్ని నిర్వహించింది. రాత్రి 8.30 నుంచి ప్రారంభమైన బాణాసంచా వెలుగులను చూసేందుకు అధిక సంఖ్యలో సందర్శకులు ట్యాంకుబండ్‌కు చేరుకున్నారు. ఇక్కడకు కుటుంబ సమేతంగా రావడంతో రద్దీ బాగా పెరిగింది.

ఆవిర్భావ సంబరాలు

ఆవిర్భావ సంబరాలు

తెలంగాణ రాష్ట్ర ద్వితీయ అవతరణ దినోత్సవ వేడుకలు నగరంలో అంగరంగ వైభవంగా జరిగాయి. సంబురాలు అంబరాన్నంటాయి. బుధవారం అర్ధరాత్రి నుంచే వీధుల్లో వేడుకల సందడి మొదలైంది.

ఆవిర్భావ సంబరాలు

ఆవిర్భావ సంబరాలు

గురువారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ప్రతి ఒక్కరూ ఈ పండుగ వాతావరణంలో పాలుపంచుకున్నారు. కార్యాలయాల్లో అధికారులు జెండా వందనం నిర్వహించారు. పిల్లలకు పుస్తకాలు, మిఠాయిలు పంచారు.

ఆవిర్భావ సంబరాలు

ఆవిర్భావ సంబరాలు

ట్యాంకుబండ్‌పై ఉదయం నుంచే సందర్శకుల తాకిడి కనిపించింది. విద్యుత్తు వెలుగులు, బాణాసంచాలతో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ధూంధాంగా జరిగింది.

ఆవిర్భావ సంబరాలు

ఆవిర్భావ సంబరాలు

రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక, జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, జలమండలి, ఆర్టీసీ తదితర అన్ని ప్రభుత్వ శాఖలు పూర్తిస్థాయిలో వేడుకల్లో పాల్గొన్నాయి. ప్రభుత్వ కార్యాలయాలను సుందరంగా అలంకరించారు.

ఆవిర్భావ సంబరాలు

ఆవిర్భావ సంబరాలు

పూల తోరణాలతో కొత్త శోభ తీసుకొచ్చారు. విద్యుద్దీపాలతో ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. డివిజన్లలో కార్పొరేటర్ల ఆధ్వర్యంలో కేక్‌ కోసి సంతోషాన్ని పంచుకున్నారు.

ఆవిర్భావ సంబరాలు

ఆవిర్భావ సంబరాలు

ప్రముఖ హోటళ్లు వేడుకలకు ఆహ్వానం పలుకుతూ ఆహారోత్సవాలు నిర్వహించాయి. తెలంగాణ రుచులతో శాకాహార, మాంసాహార ప్రియులను ఆకర్షించాయి.

ఆవిర్భావ సంబరాలు

ఆవిర్భావ సంబరాలు

నెక్లెస్‌ రోడ్డుకి ఇరువైపులా విద్యుద్దీపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హుస్సేన్‌ సాగర్‌లో వాటర్‌ ఫౌంటెన్లు ఆకట్టుకున్నాయి

ఆవిర్భావ సంబరాలు

ఆవిర్భావ సంబరాలు

నెక్లెస్‌ రోడ్డుకి ఇరువైపులా విద్యుద్దీపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హుస్సేన్‌ సాగర్‌లో వాటర్‌ ఫౌంటెన్లు ఆకట్టుకున్నాయి.

ఆవిర్భావ సంబరాలు

ఆవిర్భావ సంబరాలు

రంగురంగుల వెలుగులతో హోరెత్తించే పాటలతో ట్యాంక్‌బండ్‌ పండుగ వాతావరణానికి అద్దం పట్టింది. వివిధ రంగులతో బుద్ధుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఆవిర్భావ సంబరాలు

ఆవిర్భావ సంబరాలు

ఉదయం నుంచి సందర్శకులతో ఉద్యానవనాలు రద్దీగా దర్శన మిచ్చాయి. చెట్లకు విద్యుద్దీపాలు, పూలతో తోరణాలు కట్టి సుందరంగా తీర్చిదిద్దారు. ప్రవేశం ఉచితం చేయడంతో సందర్శకులు వరుస కట్టారు.

ఆవిర్భావ సంబరాలు

ఆవిర్భావ సంబరాలు

చారిత్రక కట్టడాలు, ప్రభుత్వ భవనాలు ముస్తాబు చేశారు. అసెంబ్లీ, గన్‌పార్కు, చార్మినార్‌, లుంబినీ పార్కు తదితర ప్రదేశాల్లో అర్ధరాత్రి వరకు సందడి నెలకొంది.

ఆవిర్భావ సంబరాలు

ఆవిర్భావ సంబరాలు

హుస్సేన్‌ సాగర్‌లో పర్యాటక శాఖ ‘ఫైర్‌వాల్‌' కార్యక్రమాన్ని నిర్వహించింది. రాత్రి 8.30 నుంచి ప్రారంభమైన బాణాసంచా వెలుగులను చూసేందుకు అధిక సంఖ్యలో సందర్శకులు ట్యాంకుబండ్‌కు చేరుకున్నారు. ఇక్కడకు కుటుంబ సమేతంగా రావడంతో రద్దీ బాగా పెరిగింది.

ఆవిర్భావ సంబరాలు

ఆవిర్భావ సంబరాలు

బుద్ధవిగ్రహం వద్దతోపాటు సంజీవయ్య పార్కు వైపు ఉన్న సెయిలింగ్‌ క్లబ్‌ వద్ద అరగంట సేపు బాణాసంచా వెలుగులతో ఆ ప్రాంతం మొత్తం కూడా హోరెత్తింది.

ఆవిర్భావ సంబరాలు

ఆవిర్భావ సంబరాలు

బుద్ధుడి విగ్రహం వద్ద నిర్వహించిన లేజర్‌ షో కార్యక్రమానికి ప్రజలు మంత్రముగ్ధులయ్యారు. వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఆవిర్భావ సంబరాలు

ఆవిర్భావ సంబరాలు

నగరంలో పలు ప్రాంతాల్లో కాగడాల ప్రదర్శన, బాణాసంచా, రక్తదాన శిబిరాలు జోరుగా సాగాయి. లుంబినీ పార్కు, ట్యాంక్‌బండ్‌ వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు హైదరాబాద్‌ కలెక్టర్‌, నగర మేయరు పర్యవేక్షించారు.

ఆవిర్భావ సంబరాలు

ఆవిర్భావ సంబరాలు

కార్యాలయాల్లో పండుగలా..: నగరంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ పండుగ వాతావరణం కనిపించింది. ఉదయం కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఆవిర్భావ సంబరాలు

ఆవిర్భావ సంబరాలు

తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులకు నివాళులు అర్పించారు. పలు కార్యాలయాల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

ఆవిర్భావ సంబరాలు

ఆవిర్భావ సంబరాలు

ఆటపాటలతో కార్యాలయాలు సందడిగా మారిపోయాయి. నాంపల్లి క్రిమినల్‌ న్యాయస్థానంలో ఘనంగా నిర్వహించారు.

ఆవిర్భావ సంబరాలు

ఆవిర్భావ సంబరాలు

మెట్రోపాలిటిన్‌ సెషన్స్‌ న్యాయమూర్తి ఎం.రజని కోర్టు ఆవరణలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జితేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీగా గన్‌పార్కు వరకూ వెళ్లి నివాళులు అర్పించారు.

ఆవిర్భావ సంబరాలు

ఆవిర్భావ సంబరాలు

సికింద్రాబాద్ సిటీసివిల్ కోర్టులో తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ న్యాయవాదుల పాత్రపై గద్దర్ అన్న ఆట పాట పేరిట నిర్వహించిన వేడుకల్లో తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదం డరామ్, ప్రజా గాయకులు గద్దర్, విమలక్క, సికింద్రాబాద్ కోర్టు చీఫ్ జడ్జి విష్ణు వర్దన్‌రెడ్డిలు ముఖ్యఅతిథులు పాల్గొన్నారు.

ఆవిర్భావ సంబరాలు

ఆవిర్భావ సంబరాలు

బర్కత్‌పురలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ శాసన సభాపక్ష నేత అంబర్‌పేట శాసనసభ్యుడు జి. కిషన్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

English summary
telangana formation day celebrations held in Hyderabad and other districts of Telangana State.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X