గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బరితెగింపు: దళిత కుటుంబంపై 20 మంది యువకుల దాడి, అట్రాసిటీ కేసు నమోదు

|
Google Oneindia TeluguNews

కుల వివక్ష ఎక్కడో ఓ చోట వెలుగుచూస్తూనే ఉంది. ఇతర వర్గాల చేత బలహీనవర్గాల వారు వేధింపులకు గురవుతూనే ఉన్నారు. తాజాగా ఏపీలో జరిగిన ఘటన కలకలం రేపింది. ఓ దళిత కుటుంబంపై పదుల సంఖ్యలో యువకులు విచక్షణరహితంగా దాడి చేశారు. జరిగిన దాడి గురించి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విచారణ చేపట్టారు. అట్రాసిటీ కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

దళిత మహిళ గుడిసెను తగులబెట్టిన వైసీపీ నేతలు: చంద్రబాబు: సాక్ష్యంగా వీడియో క్లిప్దళిత మహిళ గుడిసెను తగులబెట్టిన వైసీపీ నేతలు: చంద్రబాబు: సాక్ష్యంగా వీడియో క్లిప్

గుంటూరు జిల్లా బాపట్లలో భానుప్రసాద్ ఫ్యామిలీతో ఉంటున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మార్చురీ బాక్సులు అద్దెకు ఇస్తూ కుటుంబాన్ని గడుపుతున్నాడు. అయితే బుధవారం రాత్రి కాలనీ వద్ద డ్రింక్ చేస్తున్న కొందరు అతనిని అడ్డగించారు. అసభ్యంగా మాట్లాడి.. వాగ్వివాదానికి దిగారు. గొడవ జరగడంతో స్థానికులు సర్దిచెప్పి పంపించేశారు. కానీ ఆ యువకులు మాత్రం రగిలిపోయారు. ఇంటికెళ్లీ మరీ దాడి చేశారు.

20 man attacked by dalit family in bapatla

Recommended Video

#IndiaChinaFaceOff : Watch IAF Apache, IAF’s Fighter Aircraft Jets Patrolling At LAC || Oneindia

అతని ఇంటికి యువకులు వెళ్లారు. భానుప్రసాద్, అతని భార్య, కుమారులపై దాడి చేశారు. కులం పేరుతో కూడా దూషించారని భానుప్రసాద్ ఆరోపించారు. యువకుల దాడిలో భానుప్రసాద్, భార్య, పిల్లలకు స్వల్ప గాయాలు అయ్యాయి. అతను వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కులం పేరుతో అనడంతో డీఎస్పీ పర్యవేక్షణలో విచారణ జరుగుతుంది. యువకులపై అట్రాసిటీ కింద కేసు నమోదు చేశామని స్థానిక సీఐ తెలిపారు. మరోవైపు దళిత సంఘాలు ఘటనపై స్పందించాయి. దళిత కుటుంబంపై దాడిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాయి. బలహీనవర్గాలను లక్ష్యంగా చేసుకొని దాడుల చేయడం సరికాదని మండిపడ్డాయి.

English summary
20 man attacked by dalit family in guntur bapatla. police filed a atrocity case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X