• search
 • Live TV
గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

బామ్మ..అమ్మగా మారిన వేళ : 74 ఏళ్ల వయసులో ఇద్దరు కవలలకు జన్మ: ప్రపంచ రికార్డుతో సంచలనం..!!

|
  కవలలకు జన్మనిచ్చిన బామ్మ || Andhra Woman Sets World Record By Delivering Twins At 74 || Oneindia

  ఇది ఒక అధ్బుతం. ప్రపంచ రికార్డు. అవ్వగా పిలిపించుకోవాల్సిన వయసులో తల్లి అయ్యారు. తన 57 ఏళ్ల నిరీక్షణకు ఫలితం దక్కింది. 74 ఏళ్ల వయసులో కవలలకు సిజేరియన్ ద్వారా జన్మనిచ్చారు. ఇందు కోసం ఈ రోజు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఆపరేషన్ చేయగా ఇద్దరు ఫిమేల్ బేబీస్ పుట్టారు. గుంటూరు కేంద్రంగా జరిగిన ఈ అద్బుతం ప్రపంచ రికార్డుగా నమోదు కానుంది. గతంలో 72 ఏళ్ల వయసులో ప్రకాశం జిల్లాకు చెందిన మహిళ బిడ్డకు జన్మ ఇచ్చారు. అప్పట్లోనే అది ప్రపంచ రికార్డు అన్నారు. ఈ లెక్కన 74 ఏళ్ల వయసులో మంగాయమ్మ కవల పిల్లకు జన్మనిచ్చి ఆ రికార్డు బద్దలు చేసి ..ఇదే ప్రపంచ రికార్డు గా నమోదు చేసారు..

  74 ఏళ్ల వృద్ధాప్యంలో గర్బం :పెళ్లైన 57 ఏళ్లకు కడుపు పంట: కవలలకు జన్మనివ్వనున్న అవ్వ..!!74 ఏళ్ల వృద్ధాప్యంలో గర్బం :పెళ్లైన 57 ఏళ్లకు కడుపు పంట: కవలలకు జన్మనివ్వనున్న అవ్వ..!!

  74 ఏళ్ల వయసులో గర్బం..కవల పిల్లలకు జన్మ
  ఎలాగైనా అమ్మ అని పిలిపించుకోవాలనే ఆ పిలుపు కోసం అయిదు దశాబ్దాలకు పైగా నిరీక్షించింది. ఆమె కల ఇన్నాళ్లకు పెళ్లయిన 57 ఏళ్లకు.. 74 సంవత్సరాల వయసులో నెరవేరింది. తూర్పు గోదావరి జిల్లా నెలపర్తిపాడుకు చెందిన ఎర్రమట్టి రాజారావు, మంగాయమ్మ దంపతులకు 1962 మార్చి 22న వివాహమైంది. పెళ్లయి ఎన్నాళ్లయినా పిల్లలు పుట్టకపోవడంతో ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. ఏళ్లు గడిచినా వారి ఆశలు నెరవేరలేదు. చివరికి వారి కోరిక, ఆశలు నెరవేరకుండానే.. ఇద్దరూ వృద్ధాప్యంలోకి అడుగుపెట్టారు. అయినప్పటికీ మంగాయమ్మకు మాత్రం తల్లి కావాలనే కోరిక మాత్రం తగ్గలేదు. దీంతో..గత నవంబర్ లో గుంటూరులోని ఒక ప్రయివేటు ఆస్పత్రిలో ఐవీఎఫ్‌ పద్దితిలో కృత్రిమ సంతాన సాఫల్య విధానం ద్వారా గర్బం దాల్చారు. కలిశారు. మంగాయమ్మకు బీపీ, షుగర్‌ లాంటి ఆరోగ్య సమస్యలేవీ లేకపోవడంతో వైద్యులు ఆమెకు సంతాన సాఫల్య చికిత్స ప్రారంభించారు. మంగాయమ్మ మెనోపాజ్‌ దశ దాటిపోవడంతో వేరే మహిళ నుంచి అండాన్ని.. మంగాయమ్మ భర్త నుంచి వీర్యాన్ని సేకరించి ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్‌ (ఐవీఎఫ్‌) పద్ధతిలో ప్రయత్నం చేశారు. మొదటి సైకిల్‌లోనే వైద్యుల కృషి ఫలించింది. ఈ ఏడాది జనవరిలో మంగాయమ్మ గర్భం ధరించినట్లు తేలింది.

  74 years lady given birth for twins in Guntur. After 57 years of marriage lady got pregnancy by IVF system

  నేడు సిజేరియ్ ద్వారా డెలివరీ..ఆరోగ్యంగా శిశువులు
  వయసు రీత్యా ఆమెకు సాధారణ ప్రసవం కష్టం కాబట్టి.. సిజేరియన్‌ ద్వారా కాన్పు చేసారు. నెలలు నిండటంతో సెప్టెంబర్‌ 5న ఇవాళ ఉదయం 10.30 గంటలకు ఆపరేషన్‌ నిర్వహించారు. కాగా.. స్కానింగ్‌లో మంగాయమ్మ గర్భం నుండి ఇద్దరు ఫిమేల్ బేబీస్ ను వైద్యులు బయటకు తీసారు. తల్లితో పాటుగా శిశువులు ఆరోగ్యంగా ఉన్నారు. శస్త్రచికిత్స కోసం ఇద్దరు గైనకాలజిస్టులు, ఇద్దరు శిశు వైద్యనిపుణులు, ఇద్దరు మత్తు మందు డాక్టర్లను, కార్డియాలజి స్ట్‌ల సహకారం తీసుకున్నారు. సుదీర్ఘకాలం తర్వాత తన స్వప్నం నెరవేరి, తల్లి అయిన శుభ సందర్బంలో మంగాయమ్మతో పాటుగా కుటుంబ సభ్యులు ఆనందంతో మురిసిపోతున్నారు. గతంలో 72 సంవత్సరాలకు ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మహిళ మగ బిడ్డకు జన్మ ఇచ్చారు. ఇప్పుడు 74 ఏళ్ల వయసులో మంగాయమ్మ కవలలను కని ఆ రికార్డును అధిగమించారు. ఇప్పుడు ఇదే ప్రపంచ రికార్డు కానుంది. దీని పైన ఇప్పుడు వైద్య నిపుణులుతో పాటుగా అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. తల్లితో పాటుగా ఇద్దరు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు. వారు కొంత బరువు తగ్గినా ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు స్పష్టం చేసారు. మరి కొద్ది రోజులు వారిని తమ వద్దే పరిశీలన కోసం ఉంచుతామని వైద్యులు స్పష్టం చేసారు.

  English summary
  74 years lady given birth for twins in Guntur. After 57 years of marriage lady got pregnancy by IVF system. it becoming world record.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X