గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుంటూరు జీజీహెచ్ కు రూ.20కోట్ల విలువైన తన మొత్తం ఆస్తిని దానం చేసిన వైద్యురాలు!!

|
Google Oneindia TeluguNews

ఇది ఒక మహిళ కథ.. తన యావదాస్తిని గుంటూరు జిజిహెచ్ ఆస్పత్రికి విరాళంగా ఇచ్చి తన ఔదార్యాన్ని చాటుకున్న ఓ మహిళా వైద్యురాలి కథ. స్వప్రయోజనాలకే పెద్ద పీట వేస్తూ, వైద్యం పేరుతో పేద మధ్య తరగతి ప్రజలను దోపిడీ చేస్తున్న వైద్యులు ఉన్న నేటి రోజుల్లో, వైద్యురాలిగా తాను సంపాదించిన మొత్తం ఆస్తిని గుంటూరు జిజిహెచ్ కు దానం చేసి వార్తల్లో నిలిచారు అమెరికాలో స్థిరపడిన గుంటూరుకు చెందిన వైద్యురాలు డాక్టర్ ఉమా గవిని.

 20కోట్ల రూపాయల ఆస్తిని గుంటూరు జీజీహెచ్ కు విరాళంగా ఇచ్చిన డాక్టర్ ఉమ

20కోట్ల రూపాయల ఆస్తిని గుంటూరు జీజీహెచ్ కు విరాళంగా ఇచ్చిన డాక్టర్ ఉమ


డాక్టర్ ఉమా గవిని తనకు ఉన్న 20 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కు విరాళంగా ఇచ్చేశారు. చివరకు తనకోసం ఉంచుకున్న బ్యాంక్ బ్యాలెన్స్ కూడా మిగుల్చుకోకుండా ఆసుపత్రికి డొనేట్ చేశారు. జీజీహెచ్లో కొత్తగా నిర్మిస్తున్న మాతా శిశు సంక్షేమ భవనానికి విరాళంగా ఇస్తున్నట్లు ఆమె ప్రకటించారు. గుంటూరు జిల్లాకు చెందిన వైద్యురాలు ఉమా అమెరికాలో ఇమ్మునాలజిస్ట్, ఎలర్జీ స్పెషలిస్ట్ గా పనిచేస్తున్నారు.

బ్యాంకు బ్యాలెన్స్ కూడా ఉంచుకోకుండా యావదాస్తిని దానం చేసిన ఉమ

బ్యాంకు బ్యాలెన్స్ కూడా ఉంచుకోకుండా యావదాస్తిని దానం చేసిన ఉమ

1965 సంవత్సరం లో మెడిసిన్ పూర్తి చేసిన ఉమా, ఆ తర్వాత నాలుగు దశాబ్దాల క్రితమే అమెరికా వెళ్లిపోయారు. స్పెషలిస్ట్ డాక్టర్ గా అక్కడే స్థిరపడ్డారు. అయితే డల్లాస్ వేదికగా గత నెల గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం, ఉత్తర అమెరికాకు చెందిన జింకానా 17వ రీ యూనియన్ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశంలో పాల్గొన్న ఉమా తాను మెడిసిన్ చదువుకున్న గుంటూరు జీజీహెచ్ కు విరాళం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కనీసం బ్యాంకు బ్యాలెన్స్ కూడా ఉంచుకోకుండా ఉమా తన యావదాస్తిని విరాళంగా ఇచ్చారు.

భర్త మృతి.. వారసులు లేకపోవటంతో వైద్యురాలి నిర్ణయం .. ఆమె ఔదార్యంపై హర్షం

భర్త మృతి.. వారసులు లేకపోవటంతో వైద్యురాలి నిర్ణయం .. ఆమె ఔదార్యంపై హర్షం

ఉమా భర్త డాక్టర్ కానూరి రామచంద్ర రావు కర్ణాటకలోని గుల్బర్గాలో మెడిసిన్ చేసి అమెరికాలో మత్తు వైద్యులుగా సేవలందించారు. మూడేళ్ల కిందట ఆయన మృతి చెందారు. ఇక ఈ దంపతులకు వారసులు కూడా లేకపోవడంతో డాక్టర్ ఉమ తన ఆస్తినంతా గుంటూరు జిజిహెచ్ కు ఇచ్చేశారు. ఎవరైనా దానం చేయదలుచుకుంటే, తమకోసం కాస్తోకూస్తో మిగిల్చుకుని దానం చేస్తారు. కానీ డాక్టర్ ఉమా మాత్రం తన యావదాస్తిని బ్యాంకు బ్యాలెన్స్ తో సహా దానం చేయడం విశేషం. తన మొత్తం ఆస్తిని దానం చేసిన డాక్టరు ఉమా ఔదార్యం పై ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

English summary
The doctor who donated her entire property worth 20 crores to Guntur GGH, did not keep anything for herself. Dr. Uma Gavini's generosity is widely appreciated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X