గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విషాదం : హోంగార్డు ఆత్మహత్య... సూసైడ్ నోట్‌లో 'సారీ ఐలవ్యూ... వాళ్లు జాగ్రత్త....'

|
Google Oneindia TeluguNews

గుంటూరు జిల్లా తాడేపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఓ హోంగార్డు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు భార్యా,పిల్లలను బంధువుల ఇంటికి పంపించిన అతను.. ఇంట్లో ఒక్కడే ఉన్న సమయంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలేంటన్నది ఇంకా తెలియరాలేదు. ఆ గదిలో లభించిన సూసైడ్ నోట్‌లో 'సారీ ఐలవ్యూ.. నువ్వు ఎంత కష్టపడుతావో నాకు తెలుసు... లక్కీ వాళ్లు జాగ్రత్త..' అని పేర్కొనడం గమనార్హం.

అసలేం జరిగింది...

అసలేం జరిగింది...

పోలీసుల కథనం ప్రకారం... గుంటూరు జిల్లా తాడేపల్లి అమరారెడ్డి నగర్‌కి చెందిన హోంగార్డు రాజేష్(31) బుధవారం(నవంబర్ 18) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు భార్య,పిల్లలను బైక్‌పై పాత టోల్‌గేట్‌ సమీపంలో దిగబెట్టాడు. అక్కడినుంచి వారు విజయవాడ వెళ్లాల్సి ఉంది. బైక్‌పై వెళ్తున్న క్రమంలో రాజేష్ పదేపదే భార్యకు ఇంటి గురించి,పిల్లల గురించి జాగ్రత్తలు చెప్పాడు. ఎప్పుడూ లేనిది భర్త ఇలా పదేపదే తనకు జాగ్రత్తలు చెప్పడం ఆమెకు అనుమానం కలిగించింది.

అనుమానంతో ఇంటికి వచ్చేసరికే...

అనుమానంతో ఇంటికి వచ్చేసరికే...

భార్యను టోల్‌గేట్ వద్ద దిగబెట్టాక రాజేష్ తిరిగి ఇంటికి వచ్చాడు. ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకుముందు,సూసైడ్ నోట్ రాసి... అందులో భార్యకు 'సారీ' చెప్పాడు. 'సారీ ఐలవ్యూ... నువ్వు ఎంత కష్టపడుతావో నాకు తెలుసు... లక్కీ వాళ్లు జాగ్రత్త..' అని సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు. భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చిన భార్య.. విజయవాడకు వెళ్లకుండా తిరిగి ఇంటికే వచ్చింది. కానీ తలుపు తెరిచి చూసేసరికి రాజేష్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. దీంతో బిగ్గరగా కేకలు పెట్టింది. స్థానికుల సహాయంతో రాజేష్‌ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు.

Recommended Video

రోజాకు మంత్రి వర్గంలో ఛాన్స్ఇస్తే బాగుండేది : రాములమ్మ || Oneindia Telugu
అప్పులే కారణమా?

అప్పులే కారణమా?

దీపావళి రోజు నుంచి భర్త రాజేష్‌ దిగులుగా ఉంటున్నట్లు భార్య తెలిపింది. పిల్లలను బాగా చూసుకోవాలని ఆరోజు రాజేష్ తనతో చెప్పాడని.. అప్పటినుంచే ఏదో జరుగుతోందన్న అనుమానం తనను వెంటాడుతోందని పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు ఆత్మహత్యపై కేసు నమోదు చేశారు. చేసిన అప్పులు తీర్చలేక తీవ్ర మనస్తాపానికి గురై... రాజేష్ ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. రాజేష్ రాసిన లేఖలో తాకట్టు పెట్టిన బంగారం గురించి కూడా పేర్కొనట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

English summary
Vexed with financial problems, a home guard Shiva committed suicide by hanging at his residence at Tadepalli town on Wednesday.Police registered a case on suicide and started investigation after his wife given complaint.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X