గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాగర్జున సాగర్ విహారంలో విషాదం...లైవ్‌లో కొట్టుకుపోయిన యువకుడు

|
Google Oneindia TeluguNews

వర్షాలు విపరీతంగా కురవడంతో ప్రకృతి రమణియతను ఆస్వాధించేందడంతో పాటు నీటీ ప్రవాహాల్లో తేలియాడేందుకు ప్రజలు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా మూడు రోజుల పాటు వరుసగా సెలవులు రావడంతో ఈ తాకిడి మరింత పెరిగింది. దీంతో వాటర్ ఫాల్స్ ఏరియాలతో పాటు పలు నదులు, డ్యామ్‌ల వద్దకు ప్రజలు తండోప తండాలుగా చేరుకుంటున్నారు...మరోవైపు ఎంజాయ్ కోసం పోయిన కుటుంభాల్లో అక్కడక్కడ విషాదం కూడ అలుముకుంటుంది. ఈనేపథ్యంలోనే నాగార్జున సాగర్ వరద జలాల్లో ఓ యువకుడు గల్లంతాయ్యాడు.

 A young man Drown in the stream of Nagarjuna Sagar water flow.

హాలీడే కావడంతో నాగార్జున సాగర్‌కు చేరుకుని సాగర్ శివాయం ఘాట్‌లో ఈతకు వెళ్లిన ఓ పర్యాటకుడు నీటీ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. భారీగా వస్తున్న నీటీ ప్రవాహంలో జహిరాబాద్‌కు చెందిన నర్సింహ ఈతకు దిగాడు. అయితే విపరీతంగా వస్తున్న ప్రవాహం నేపథ్యంలోనే ఆయన మరింత లోపలికి వెళ్లడంతో బయటికి రాలేకపోయాడు. దీంతో పర్యటకులు చూస్తుండంగానే ఆ యువకుడు నీట మునిగాడు. ఇక అక్కడే ఉన్న స్థానికులు ప్రయత్నించిన బయటకు రాలేకపోయాడు. దీంతో నర్సింహ కోసం పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు.

English summary
A young man Drown in the stream of Nagarjuna Sagar water flow. Narsimha who dip in water of Zaheerabad. he was swimming at the ghat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X