గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ హోంమంత్రి పేరుతో వేధింపులు: రూ.3 కోట్లు నొక్కేసి, అకౌంటెంట్ సూసైడ్‌పై లోకేశ్ (వీడియో)

|
Google Oneindia TeluguNews

ఏపీలో జగన్ రాక్షస పాలన కొనసాగుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ఎవరినీ వదలడం లేదు అని విరుచుకుపడ్డారు. గుంటూరులో అకౌంటెంట్ ఆత్మహత్య చేసుకునే ముందు వీడియోను ట్వీట్ చేశారు. అతని సూసైడ్‌కు శ్రీనివాసరావు కారణం అని... ఆయన హోంమంత్రి పేరు చెప్పి బెదిరిస్తున్నాడని పేర్కొన్నారు. అతని వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని సెల్ఫీ వీడియో తీసి.. బలవన్మరణం చేసుకున్నాడు.

ఏం జరిగిందంటే..

గుంటూరుకు చెందిన రావిపాటి బసవయ్య అకౌంటెంట్. ఇతని స్నేహితుడు వెంకటేశ్వర్లు, మరొకరు శ్రీనివాసరావు ఇద్దరు కలిసి మోసం చేశారు. అకౌంటెంట్‌గా పనిచేస్తున్న బసవయ్య కాటన్ బిల్లులు రాస్తున్నందున.. బిజినెస్ పెడదామని చెప్పారు. దీంతో వారిని బసవయ్య నమ్మి.. ముందగుడు వేశాడు. బ్యాంకులో లోన్, ఇతరుల వద్ద నుంచి అప్పు తీసుకున్నాడు. అలా రూ.3 కోట్ల వరకు తీసుకొని.. తర్వాత వెంకటేశ్వరావు ఉడాయించాడు. దీంతో బసవయ్యకు బ్యాంకు నుంచి, అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి తప్పలేదు. అప్పటికీ వారికి వడ్డీ కడుతోన్న ఫలితం లేదు. మొత్తం అసలు నగదు కట్టాలని ఒత్తిడి తీసుకొచ్చారు.

రూ.3 కోట్లు తీసుకొని ఉడాయించి...

శ్రీనివాసరావు రంగంలోకి దిగి బసవయ్యతో సంప్రదింపులు జరిపారు. గొడవ చేయొద్దని చెప్పడంతో.. బ్యాంకు వారు ఒత్తిడి చేస్తున్నారని.. వారితో మాట్లాడాలని బసవయ్య సూచించారు. దీంతో ఆయన బ్యాంకు మేనేజర్‌తో మాట్లాడారని బసవయ్య తెలిపారు. అయితే ఏడాది సమయం ఇచ్చేందుకు మేనేజర్ నిరాకరించారు. వెంటనే కట్టాలని కోరగా.. శివారులో గల అపార్ట్ మెంట్ వద్దకు తీసుకెళ్లాడని చెప్పాడు. ఇదీ తమదేనని కన్ స్ట్రక్షన్ జరుగుతోందని చెప్పాడు. మరో 30 లక్షలు ఇస్తే.. ఇప్పించిన 3 కోట్లు ఇస్తామని చెప్పడంతో అందుకు తాను నిరాకరించానని బసవయ్య తెలిపారు. దీనిపై వెంటకేశ్వరావు కేసు పెడతానని అంటే .. తనను శ్రీనివాసరావు దుర్బషలాడనని వాపోయారు.

రూ.2.70 కోట్లు ఇచ్చానని పచ్చి అబద్దం చెప్పాడు..

రూ.2.70 కోట్లు ఇచ్చానని పచ్చి అబద్దం చెప్పాడు..

ఎస్పీకి ఫిర్యాదు చేశానని వివరించారు. ఎస్పీ సూచనతో పట్టాభిపురం సీఐకి కంప్లైంట్ ఇచ్చానని తెలిపారు. వెంకటేశ్వరరావుని పిలిపించగా.. తన భార్యకు రూ.2.70 కోట్ల చెక్ ఇచ్చానని పచ్చి అబద్దం చెప్పాడని బసవయ్య వాపోయారు. చెక్కుకు సంబంధించి జిరాక్స్ చూపించాడని.. అదీ కూడా తన భార్య పేరుతో ఉందని తెలిపారు. తర్వాత బ్యాంక్ స్టేట్ మెంత్ తీసుకొని.. సీఐ వద్దకొచ్చానని తెలిపారు. వారు చేసిన మోసం గురించి వివరించగా.. సీఐ కూడా వెంకటేశ్వరరావు ఛీటర్ అని.. తనకు న్యాయం చేస్తానని చెప్పాడని పేర్కొన్నారు. తర్వాత తనకు శ్రీనివాసరావు నుంచి వేధింపులు ఎక్కువయ్యాయని చెప్పారు. రోజు ఫోన్ చేసి వేధించేవాడని గుర్తుచేశారు.

తన భార్యను కోర్టు చుట్టూ తిప్పుతానని వార్నింగ్..

తన భార్యను కోర్టు చుట్టూ తిప్పుతానని వార్నింగ్..


తనను కాదు.. తన భార్యను కోర్టు చుట్టూ తిప్పుతానని బెదిరించేవాడని వాపోయారు. తన సూసైడ్‌కు శ్రీనివాసరావు, వెంకటేశ్వరావు ఇద్దరూ కారణం అని పేర్కొన్నారు. కానీ శ్రీనివాసరావు 60 శాతం వేధించాడని.. మిగతా 40 శాతం వెంకటేశ్వరరావు అని చెప్పారు. వెంకటేశ్వరరావు తనకు ఎస్పీ తెలుసు అని చెప్పేవాడు అని తెలిపారు. దీంతో తనకు న్యాయం జరగలేదా అనే సందేహాం కలిగేదని వివరించారు. ఇక శ్రీనివాసరావు అయితే ఏకంగా తనకు హోంమంత్రి తెలుసు అని.. నువ్వు ఏమీ చేయలేవు అని సూటి పోటీ మాటలతో కుంగదీశాడని వాపోయారు. తన చావుకు వారిద్దరూ కారణం అని నిట్టూర్చారు. తన భార్యకు, అప్పలు ఇచ్చినవారికి న్యాయం చేయాలని వేడుకున్నారు.

హోంమంత్రి పేరుతో వేధింపులా: లోకేశ్

హోంమంత్రి పేరుతో వేధింపులా: లోకేశ్

అకౌంటెంట్‌ రావిపాటి బసవయ్య ఆత్మహత్య సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై నారా లోకేశ్ స్పందించారు. సీఎం జగన్ పాలనలో రాక్షస పాలన సాగుతోందని విమర్శించారు. శాంతి భద్రతలను గాలికొదిలేయడంతో.. కొందరు రెచ్చిపోతున్నారని తెలిపారు. హోంమంత్రి పేరు చెప్పి అంతుచూస్తామని బెదిరించడం ఏంటీ అని ప్రశ్నించారు. శ్రీనివాసరావు, వెంకటేశ్వరావుకు వైసీపీ నేతలతో ఉన్న సంబంధాలు ఉండటంతోనే వేధించారని తెలిపారు. బసవయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని కోరాు. అకౌంటెంట్ బసవయ్య ఆత్మహత్యకు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

English summary
guntur accountant basavaiah harassed by use of andhra pradesh home minister and sp name nara lokesh said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X