గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రత్యామ్నాయ రాజకీయాలా.. పత్తి వ్యాపారమా..? గుంటూరులో కన్నా వర్సెస్ రాయపాటి..!!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : ఒక్కసారి రాజకీయాల్లో అధికారం అనుభవించిన తర్వాత సైలెంట్ గా కూర్చోమంటే ఏ రాజకీయ నాయకుడికైనా మా చెడ్డ చిరాకబ్బా..! ఓడిపోయిన పార్టీలో ఉండలేక, శత్రుశేషం ఉన్న అదికార పార్టీలోకి వెళ్లలేక నానా చిత్రహింస అనుభవిస్తుంటారు కొందరు నేతలు. చివరకు ఎలాగోలా బాదలన్నీ అదిగమించి అదికార పార్టీలో చేరిపోయేందుకు మానసికంగా సిద్దమైతే అక్కడే తిష్టవేసుకుని కూర్చున్న శత్రు వర్గం ముప్పేట దాడిచేసే సందర్బాలు ఎదురవుతుంటాయి. మాజీ ఎంపీ, టీడిపి నేత రాయ‌పాటి సాంబ‌శివ‌రావు బీజేపి తీర్థం పుచ్చుకుందామని భావిస్తున్నా కన్నా లక్ష్మీనారాయణ రూపంలో ఆయన పెద్ద అవరోదం ఎదురవుతోంది. దీంతో పత్తాపారం చేసుకోవాలా..? ప్రత్యామ్నాయం ఆలోచించాలా అనే సందిగ్దంలో రాయపాటి ఉన్నట్టు తెలుస్తోంది.

బీజేపి వైపు చూస్తున్న రాయపాటి..! నిలువరిస్తున్న కన్నా..!!

బీజేపి వైపు చూస్తున్న రాయపాటి..! నిలువరిస్తున్న కన్నా..!!

నువ్వొస్తానంటే నేను రానిస్తానా! ఇదేదో సినిమా టైటిల్ అనుకునేరు. ఏపీ రాజ‌కీయాల్లో ఇదో కీల‌క ఘ‌ట్టం. నిప్పు.. ఉప్పు రెండు క‌ల‌సి స‌హ‌వాసం చేయడం ఎంతటి కష్ట సాద్యమో రాయపాటి, కన్నా ఒకే పార్టీలో కొనసాగడం అంతే అంటున్నారు విశ్లేషకలు. టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు కాషాయ కండువా క‌ప్పుకునేందుకు రెడీ అవుతున్నట్టు గుంటూరు రాజకీయాల్లో చర్చ జరగుతోంది. ఇప్పటికిప్పుడు అంత పెద్ద నిర్ణయం ఎందుకంటే అధికారంలో లేక‌పోవ‌ట‌మే అనే సమాధానం వినిపిస్తోంది. ఏదో ఒక పదవి కోసం అదికార పార్టీలో చేరేందుకు రాయపాటి ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. రాయ‌పాటి కుటుంబం వార‌స‌త్వంగా వ్యాపారం సాగిస్తుంటుంది. పొగాకు ఎగుమ‌తుల్లో దేశ‌, విదేశాల్లో పేరు.. అప‌ఖ్యాతి రెండు తెచ్చుకున్నారు. అప్పట్లో పొగాకు బండిళ్లలో రాళ్లు పెట్టి ఎగుమ‌తి చేశార‌నే అప‌వాదు ఉంది.

కన్నా వర్సెస్ రాయపాటి..! గుంటూరులో రాజకీయ ప్రత్యర్థులు..!!

కన్నా వర్సెస్ రాయపాటి..! గుంటూరులో రాజకీయ ప్రత్యర్థులు..!!

ఆ త‌రువాత పొగాకు సాగు త‌గ్గటంతో క్రమంగా హ‌స్తంతో స్నేహం వ‌ల్ల ఎంపీ కాగ‌లిగారు. కోట్లాదిరూపాయ‌లు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల‌ను చెల్లించే క్రమంలో ఉదాశీనంగా ఉన్నారు. అవి ఇప్పుడు వ‌డ్డీలు..చ‌క్రవ‌డ్డీల‌తో క‌ల‌పి వంద‌ల కోట్ల వ‌రకూ చేరాయ‌నేది బ‌హిరంగ ర‌హ‌స్యం. పైగా వ‌య‌సు మీద ప‌డుతుంది. ఇప్పుడీ వ‌య‌సులో అప్పులు తీర్చటం ఎలా ఉన్నా నోటీసులు పంపితే భ‌రించ‌లేని ప‌రిస్థితి. న్నటి వ‌ర‌కూ ఎంపీగా ఉన్నాడు కాబ‌ట్టి స‌రిపోయింది. మ‌రి ఇప్పుడు.. టీడీపీ అంటేనే మోదీ మండిప‌డుతున్నాడు. పైగా పోల‌వ‌రంలో కోట్ల పెట్టుబ‌డి ఏం కావాల‌నే భ‌యం రాయ‌పాటిని వేదిస్తుంది.

ఒక ఒరలో రెండు కత్తులు..! సాద్యం కాదంటున్న బీజేపి నేతలు..!!

ఒక ఒరలో రెండు కత్తులు..! సాద్యం కాదంటున్న బీజేపి నేతలు..!!

అందుకే సుజ‌నా బాట‌లో తానుకూడా క‌మ‌లం గూటికి చేరితే పోయేదేమింది.. మూడోపార్టీ కండువా క‌ప్పుకోవ‌టం మిన‌హా అనుకున్నార‌ట‌. అయితే ఏపీ బీజేపీ అద్యక్షుడిగా క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ ఉన్నాడు. కాంగ్రెస్‌లో ఉన్నపుడు రాయ‌పాటి వ‌ర్సెస్ క‌న్నా రాజ‌కీయాల‌తో హ‌స్తం విసుగెత్తింది. గుంటూరు జిల్లా అభివృద్ధికి విఘాతం క‌ల‌గ‌టంలో ఇద్దరూ కీల‌క‌మే అనే విమ‌ర్శలూ లేక‌పోలేదు. అంత‌టి వైరం ఉన్న నేత‌ల మ‌ద్య దోస్తీ చిగురిస్తుందా అనే అనుమానాలు లేక‌పోలేదు.

రాయపాటికి అవకాశం ఇవ్వని కన్నా..! గుంటూరు బీజేపీలో పరాకాష్ట రాజకీయాలు..!!

రాయపాటికి అవకాశం ఇవ్వని కన్నా..! గుంటూరు బీజేపీలో పరాకాష్ట రాజకీయాలు..!!

కానీ రాయ‌పాటి ఇప్పుడున్న ప‌రిస్థితి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు త‌ప్పకుండా ఏదో ఒక అండ చేరాల‌నేది ఖ‌రారైంది. అది వైసీపీ కావ‌చ్చు. బీజేపీ కావ‌చ్చు. అయితే వైసీపీతో న‌డ‌చి ప‌రువు పోగొట్టుకున్నట్టే అవుతుంద‌ని రాయ‌పాటి వ‌ర్గం సూచ‌న‌. అందుకే క‌న్నాను మెప్పించి.. వీలు చిక్కకుంటే బీజేపీతో తెర‌చాటు మంత్రాంగం న‌డ‌పి క‌న్నాను త‌ప్పించైనా స‌రే క‌మ‌లం చెంత‌కు చేరి విశ్రాంతి తోపాటు పోల‌వ‌రం కాంట్రాక్టును కాపాడుకోవ‌టం ఇప్పుడు రాయపాటి ముందున్న లక్ష్యమని గుంటూరు కేంద్రంగా పెద్ద చర్చ జరగుతోంది.

English summary
Guntur politics is known by many leaders, most notably two of them. Rayapati Sambasiva Rao, Kanna Lakshminarayana. Until 2014, the two were in Congress. Even though the two fighting continues.now Rayapati planing to join in bjp while Kanna becoming angry on the decission.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X