గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏకగ్రీవాలు బలవంతమా..? సోము వీర్రాజు ఆగ్రహాం.. కేంద్రం నిధులతోనే..

|
Google Oneindia TeluguNews

కుటుంబ పార్టీలకు స్వస్తి పలకడమే బీజేపీ లక్ష్యమని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అన్నారు. కేంద్ర పథకాలకు వైసీపీ సర్కార్ రంగులేసి గొప్పగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. గురజాల మెడికల్ కాలేజీకి రూ.50 కోట్లు ఇచ్చేది కేంద్రమేనని తెలిపారు. పల్నాడులో అరాచక పాలన నడుస్తోందని సోము వీర్రాజు ధ్వజమెత్తారు. ఏపీ స్థానిక సంస్థల్లో బలవంతపు విజయాలకు విలువ లేదని సోము వీర్రాజు చెప్పారు.

సోమవారం సోము వీర్రాజు ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో బీజేపీ పెద్దలతో భేటీ అవుతారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ, తిరుపతి ఉపఎన్నికపై డిష్కస్ చేస్తారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీకి ఓట్ల శాతం పెరిగిందని వివరించారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై చర్చించే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఏపీలో మరో పంచాయతీ పోలింగ్ జరగాల్సి ఉంది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీకాలం మార్చి 31వ తేదీతో ముగియనున్న సంగతి తెలిసిందే.

ap bjp chief somu veerraju slams cm ys jagan

Recommended Video

#TOPNEWS: FASTag | LPG Price Hike- To Cost ₹ 50 More| AP Municipal Elections

వైసీపీ ప్రభుత్వం చెప్పదీ ఒకటి చేసేదీ మరొకటి అని సోము వీర్రాజు అంటున్నారు. కేంద్ర పథకాలను కూడా తమ సొంత నిధులతో చేపట్టినట్టు బిల్డప్ ఇస్తున్నారని పేర్కొన్నారు. ఫండ్స్ తీసుకుంటూనే పేరు మాత్రం జగన్‌కే రావాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇదీ తగదని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ వాస్తవంగా జరిగే విషయాలు ప్రజలకు మాత్రం తెలుసు అని చెప్పారు.

English summary
ap bjp chief somu veerraju slams cm ys jagan mohan reddy on panchayats unanimous.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X