గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన వైఎస్ జగన్ కాన్వాయ్: నిడమర్రు వద్ద: ఆసుపత్రి వైపు దూసుకెళ్లిన

|
Google Oneindia TeluguNews

గుంటూరు: ఏదైనా ప్రమాదం చోటు చేసుకుంటే.. క్షతగాత్రులకు సకాలంలో వైద్య సహాయాన్ని అందించడం అత్యవసరం. అంతకుమించి ఇంకేదీ ప్రాధాన్యత కాదు. ప్రమాదానికి గురైన తరువాత ఎంత త్వరగా గాయపడ్డ వారిని ఆసుపత్రికి చేర్చగలిగితే.. అంత వేగంగా ప్రాణాపాయం నుంచి తప్పించడానికి అవకాశం ఉంటుంది. ప్రమాద తీవ్రతను బట్టి.. క్షతగాత్రులకు తగిలిన గాయాల ఆధారంగా.. తొలి 20 నిమిషాల సమయాన్ని అత్యంత విలువైనదిగా భావిస్తారు డాక్టర్లు.

Recommended Video

AP CM Jagan's Convoy Gave Way To An Ambulance At Nidamarru || Oneinda Telugu

ప్రమాదానికి గురైన వారిని సకాలంలో ఆసుపత్రులకు చేర్చడంలో అంబులెన్సులు పోషిస్తోన్న పాత్ర ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. అంబులెన్సులను ప్రాణదాతలుగా అభివర్ణిస్తుంటారు. కుయ్, కుయ్ మంటూ శబ్దం చేసుకుంటూ వచ్చే అంబులెన్సులను దారి ఇవ్వడానికి ప్రాధాన్యత ఇస్తుంటారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా దీనికి అతీతులేమీ కాదు. ఈ విషయం మరోసారి నిరూపితమైంది.

AP Chief Minister YS Jagans convoy gave way to an ambulance

క్షతగాత్రుడిని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి దూసుకెళ్తోన్న ఓ అంబులెన్సుకు వైఎస్ జగన్ కాన్వాయ్ దారి ఇచ్చింది. అమరావతి ప్రాంతంలోని నిడమర్రు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా ఈ ఉదయం కడప జిల్లాలోని ఇడుపుల పాయలో ఆయన సమాధికి నివాళిని అర్పించారు వైఎస్ జగన్. అనంతరం కడప విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో అమరావతికి బయలుదేరారు.

గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన వెంటనే.. కాన్వాయ్‌లో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి బయలుదేరారు. మార్గమధ్యలో నిడమర్రు వద్ద జగన్ కాన్వాయ్ వెళ్తోన్న దారిలో ఓ అంబులెన్స్ వెళ్లాల్సి వచ్చింది. శబ్దం చేసుకుంటూ వస్తోన్న అంబులెన్స్‌ను గమనించిన వెంటనే కాన్వాయ్ డ్రైవర్లు దానికి దారి ఇచ్చారు. వైఎస్ జగన్ ప్రయాణిస్తోన్న కారు సహా.. అన్ని వాహనాలను రోడ్డుకు కుడి వైపునకు తీసుకెళ్లారు. ఎడమ వైపు రోడ్డును ఖాళీ చేశారు. దీనితో ఆ అంబులెన్స్ ఆసుపత్రి వైపునకు దూసుకెళ్లింది.

ఇదివరకు ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ పాదయాత్ర నిర్వహిస్తోన్న సమయంలో క్రిక్కిరిసిన ఓ బహిరంగను ఉద్దేశించిన మాట్లాడుతుండగా.. అంబులెన్స్ రావడంతో.. దానికి దారి ఇచ్చారు. అంబులెన్స్ వెళ్లడానికి దారి ఇవ్వాలంటూ వైఎస్ జగన్ మైకులో ప్రజలను సూచించారు. ఇప్పుడూ అదే తరహాలో అంబులెన్స్‌కు దారి ఇచ్చారు. దీనిపట్ల నెటిజన్లు వైఎస్ జగన్‌ను మరోసారి ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ట్వీట్లు చేస్తున్నారు.

English summary
Chief Minister YS Jagan Mohan Reddy's convoy gave way to an ambulance at Nidamarru. The ambulance was taking a person to hospital who has met with accident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X