గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పల్నాడులో 144 సెక్షన్.. అనుమతులు లేవు : ఒకే కుటుంబానికి చెందిన ఎస్సీల మధ్య గొడవ..డీజీపీ !!

|
Google Oneindia TeluguNews

పల్నాడు లో హోరెత్తుతున్న రాజకీయాలు..ఛలో ఆత్మకూరు పిలుపుల నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది. పల్నాడులో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని డీజీపీ సవాంగ్ చెప్పారు. పల్నాడులో 144,30 సెక్షన్‌ విధించామని చెప్పుకొచ్చారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆత్మకూరులో ఒకే కుటుంబానికి చెందిన ఎస్సీల మధ్య గొడవలు జరిగాయని, అవన్ని కుటుంబ వివాదాలే అన్నారు. వాటితో రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రేపటి ఛలో ఆత్మకూరు కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు గుంటూరు రేంజ్‌ ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ను కలిశారు.

ప్రభుత్వాన్ని వదిలిపెట్టం..చంద్రబాబు వార్నింగ్ : పోటీగా వైసీపీ ఛలో ఆత్మకూరు..టెన్షన్..!!ప్రభుత్వాన్ని వదిలిపెట్టం..చంద్రబాబు వార్నింగ్ : పోటీగా వైసీపీ ఛలో ఆత్మకూరు..టెన్షన్..!!

కఠిన చర్యలు తీసుకుంటాం..
టీడీపీ..వైసీపీ పోటా పోటీగా ఛలో ఆత్మకూరుకు పిలుపునివ్వటంతో రాజకీయంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీలో ఛలో ఆత్మకూరుకు పిలుపునిచ్చింది. టీడీపీ నేతలంతా గుంటూరుకు రావాలని పార్టీ అధినేత చంద్రబాబు సూచించారు. ఇదే సమయంలో ప్రభుత్వం నుండి ప్రారంభించిన సంప్రదింపుల పట్ల టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

AP Dgp Sawang says no permission for any party to conduct rallies or protests in Palnadu

ఉన్నత స్థాయి అధికారులతో కాకుండా ఏఎస్పీతో మాట్లాడించటం సరి కాదనే అభిప్రాయం వ్యక్తం చేసారు. ఇదే సమయంలో ఛలో ఆత్మకూరు నిర్వహించి తీరుతామని..పోలీసులు అడ్డుకొనే ప్రయత్నం చేస్తారని చెప్పిన చంద్రబాబు అడ్డుకుంటే నేతలు అక్కడికక్కడే ధర్నాలు చేయాలని చంద్రబాబు సూచించారు. ఇదే సమయంలో వైసీపీ సైతం ఛలో ఆత్మకూరు కు పిలుపునిచ్చింది. దీంతో..పోలీసులు అప్రమత్తమయ్యారు. పల్నాడులో 144,30 సెక్షన్‌ విధించామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.

ఊరేగింపులు, ధర్నాలు, ప్రదర్శనలకు అనుమతి ఇవ్వబోమన్నారు. శాంతి భద్రతల విషయంలో అన్ని వర్గాలు, రాజకీయ పార్టీలు పోలీసులకు సహకరించాలని కోరారు. వినాయక నిమజ్జనం, మొహరం పండుగల నేపథ్యంలో ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పల్నాడులో ఎటువంటి అవాంచనీయ పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు పోలీసు శాఖ సి​ద్ధంగా ఉందని డీజీపీ తెలిపారు.

ఒకే కుటుంబానికి చెందిన ఎస్సీల గొడవ..
తమ శ్రేణులపై దాడులు చేస్తున్నారంటూ టీడీపీ, వైఎస్సార్‌సీపీ నేతలు ఒకరి ఒకరు పోటీగా బాధితుల కోసం పల్నాడులో పునరావాస శిబిరాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పల్నాడులో ఉద్రిక్తత కొనసాగుతోంది. దీని పైన పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. దీని పైన గురజాల డీఎస్పీ అక్కడే మకాం వేసారు. ఆత్మకూరులో ప్రశాంత వాతావరణం నెలకొందని గురజాల డీఎస్పీ శ్రీహరి అన్నారు. గతంలో ఒకే కుటుంబానికి చెందిన ఎస్సీల మధ్య గొడవలు జరిగాయని, అవన్ని కుటుంబ వివాదాలే అన్నారు.

వాటితో రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. పోలీసుల చొరవతో వారంతా కలిసిపోయారని, ఇప్పడు గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొందని శ్రీహరి తెలిపారు. ఛలో ఆత్మకూరు కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు గుంటూరు రేంజ్‌ ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ను కలిశారు. టీడీపీ బాధితులకు న్యాయం చేసేందుకు చేపట్టబోయే ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రెండు పార్టీలు రాజకీయంగా పట్టింపులకు పోతుండటంతో రెండు పార్టీలు కార్యక్రమ నిర్వహణకు సమాయత్తం అవుతున్నాయి. ఇదే సమయంలో ఎక్కడా ఉద్రిక్తతలు తలెత్తకుండా జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. స్వయంగా డీజీపీ ముందస్తు చర్యల పైన ఆరా తీసారు.

English summary
AP Dgp Sawang says no permission for any party to conduct rallies or protests in Palnadu. Police department already imposed 144 section and implement section 30. Local police syas that is purely one family dispute in Atmakur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X