గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోడెలను కడసారి చూసుకోకుండా కుట్ర.. భయభ్రాంతులకు గురిచేస్తున్న సర్కార్.. చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : ఏపి మాజీ సభాపతి కోడెల శివప్రసాద రావు మృతి పట్ల టీడిపి శ్రేణులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అంతే కాకుండా కోడెల శివ ప్రసాద్ మృతి పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకూడా సరిగా లేదని టీడిపి జాతీయ అద్యక్షుడు చంద్రదబాబు నాయుడు ఘాటుగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహాస్తామని ప్రకటించిన ఏపి ప్రభుత్వం గుంటూరులో 144 సెక్షన్ విధించండం విధించడం వెనక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వ తీరు పట్ల టీడిపి శ్రేణులే కాకుండా ఏపి ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు బాబు పేర్కొన్నారు.

కోడెల అంత్యక్రియల్లో కూడా డ్రామాలెందుకు..! ఏపి సర్కార్ పై మండిపడ్డ చంద్రబాబు..!!

కోడెల అంత్యక్రియల్లో కూడా డ్రామాలెందుకు..! ఏపి సర్కార్ పై మండిపడ్డ చంద్రబాబు..!!

అంతే కాకుండా తమ ప్రియతమ నేతను కడసారి కూడా చూసుకోకుండా వైసిపి కుటిల రాజకీయాలకు పాల్పడుతోందని చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు అంటూనే ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారని ఫైర్ అయ్యారు. వైసిపి నేతలు వారి దశ్చర్యలను కప్పి పుచ్చుకోవడానికి ఎన్ని నాటకాలు వేస్తున్నా, కోడెల విషయంలో ఎన్ని అసత్యాలు ప్రచారం చేయాలని చూసినా ప్రజలకు జగన్ ప్రభుత్వం తాలూకా నిజస్వరూపం తెలిసిపోయిందని చంద్రబాబు ట్వీట్ చేసారు.

అభిమానులను కడచూపు చూసుకోకుండా చేసారు..! 144 సెక్షన్ ఎందుకన్న బాబు..!!

అభిమానులను కడచూపు చూసుకోకుండా చేసారు..! 144 సెక్షన్ ఎందుకన్న బాబు..!!

అంతే కాకుండా గుంటూరులో కోడెల శివప్రసాద్ ను కడసారి చూసుకోవడానికి వీలు లేకుండా కోడెల అభిమానులను ఎన్నో ఇబ్బందులకు గురి చేయడానికే నరసారావు పేటలో 144 సెక్షన్ విధించారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అంతే కాకుండా 30పోలీస్ యాక్ట్ ను కూడా అమలు చేసి టీడిపి శ్రేణులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. కక్ష్యపూరిత రాజకీయాలను ప్రజలు ఎక్కువ కాలం సహించరని, సమయం వచ్చినప్పుడు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు.

కోడెల మృతి పట్ల సీబీఐ విచారణ జరపాలి..! ఏపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన చంద్రబాబు..!!

కోడెల మృతి పట్ల సీబీఐ విచారణ జరపాలి..! ఏపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన చంద్రబాబు..!!

కోడెల మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. అంతేకాకుండా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోడెల పై 19 కేసులు 2016, 17, 18 లలో పెట్టారన్నారు. విజయసాయి రెడ్డి ట్విట్టర్ ద్వారా కేసులు పెట్టాలని రెచ్చకొట్టాడన్నారు. దీంతో కోడెలను మానసికంగా కుంగతిసారన్నారు. కోడెల మరణానికి ప్రభుత్వమే కారణమన్నారు. తనపై రాజశేఖర్ రెడ్డి 26 కేసులు పెట్టారు కానీ ఎక్కడా రుజువు చెయ్యలేక పోయారని బాబు తెలిపారు.

తనపై పెట్టిన కేసులు ఏమయ్యాయి..! నిరూపించలేక పోయారన్న టీడిపి ఛీఫ్..!!

తనపై పెట్టిన కేసులు ఏమయ్యాయి..! నిరూపించలేక పోయారన్న టీడిపి ఛీఫ్..!!

కాగా తాను గతంలో ఎప్పుడూ ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదన్నారు చంద్రబాబు. కోడెల మరణం పై సీబీఐ విచారణ జరిపించాలన్నారు. జరిగిన వందరోజుల్లో జరిగిన డ్యామేజ్ పై విచారణ జరిపించాలన్నారు. పోలీస్ యంత్రాంగం సైతం ఎందుకు సరెండర్ అయిందో అర్థం కావడం లేదన్నారు. నా రాజకీయ చరిత్రలో ఎప్పుడు చూడని క్షోభని నేను అనుభవించానన్నారు. వ్యక్తుల మనోభావాలపై దెబ్బకొట్టాలని ప్రభుత్వం చూస్తుందన్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి తాను మానసింకంగా చిత్ర వధ అనుభవిస్తున్నాని, ప్రభుత్వ చర్యలపై తాను పోరాటం ఉదృతం చేస్తానని చంద్రబాబు పేర్కొన్నారు.

English summary
TDP national President Chandrababu Naidu has been accused of not being properly treated by the government for the death of Koala Shiva Prasad. The VP government, which announced that the funeral would be conducted with government formalities, questioned the conclusion behind the imposition of a section of 144 in Guntur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X