గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యరపతినేని అక్రమ మైనింగ్ సీబీఐకు అప్పగింత: ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..!

|
Google Oneindia TeluguNews

టీడీపీ సీనియర్ నేత..మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు అక్రమ మైనింగ్ వ్యవహారం పైన సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో రాష్ట్ర స్థాయిలో ఇప్పటికే సీఐడీ విచారణ దాదాపు పూర్తయింది. ఇదే సమయంలో కోర్టులో సైతం ఏపీ ప్రభుత్వం తాము యరపతినేని అక్రమ మైనింగ్ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని నిర్ణయించామనే విషయాన్ని నివేదించింది. ఈ మేరకు రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తొలి సీబీఐ విచారణకు సిఫార్సు చేసింది. ఉత్తర్వులు సైతం జారీ చేసింది. ఇక, దీని పైన పూర్తి నివేదికను కేంద్రానికి పంపింది. ఈ మొత్తం వ్యవహారం పైన సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరింది. ఇక..కేంద్రం దీని పైన నిర్ణయం త్వరలోనే తీసుకొనే అవకాశం ఉంది.

యరపతినేని కేసు సీబీఐకి...
టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు గుంటూరు జిల్లా పల్నాడులో అక్రమ మైనింగ్ వ్యవహారాన్ని సీబీఐ కి అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఈ వ్యవహారం పైన సీఐడి విచారణ చేసి కోర్టుకు నివేదించింది. అక్రమ మైనింగ్ నిజమేనని తేల్చింది. ఇందులో అనేక మంది సాక్ష్యులను విచారించింది. ఇదే సమయంలో కోర్టు దీని పైన సీబీఐ విచారణ పైన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సూచించింది. దీంతో..ఏపీ కేబినెట్ లో ఈ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించే విధంగా నిర్ణయం జరిగింది. ఇక, గతంలో చంద్రబాబు హాయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఏపీలో సీబీఐ విచారణకు అనుమతి లేకుండా ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ ఉత్తర్వులను రద్దు చేసి..తిరిగి సీబీఐకి అవకాశం కల్పించారు. యరపతినేని అక్రమ మైనింగ్ తో పాటు బ్యాంకు ఖాతాల్లో నూ అక్రమ లావాదేవీలు జరిగాయని సీఐడీ నివేదించింది. ఈ మొత్తం వ్యవహారాన్ని సీబీఐకి అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో కేంద్రం సీబీఐకి అప్పగించేందుకు వీలుగా కావాల్సిన సమాచారం..కోర్టులో జరగిన ప్రొసీడింగ్స్.. రాష్ట్ర ప్రభుత్వ జారీ చేసిన ఉత్తర్వులతో కూడిన పూర్తి నివేదికను కేంద్ర హోం శాఖకు ఏపీ ప్రభుత్వం అందచేసింది.

AP Govt orders CBI probe in Yarapathineni illegal mining in palnadu

పల్నాడు ప్రాంతంలో అక్రమంగా..
గురజాల ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అక్కడ సున్నపురాయిని అక్రమంగా మైనింగ్ చేసారని ఫిర్యాదు వచ్చింది. దీని పైన రాజకీయంగా పల్నాడు ప్రాంతంలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. పల్నాడు ప్రాంతంలోని పిడుగురాళ్ల మండలంలోని కోనంకి గ్రామం.. అదే విధంగా దాచేపల్లిలోని కేసానుపల్లి..నడికూడి గ్రామాల్లో అక్రమంగా మైనింగ్ నిర్వహించారు. ఇందులో మైనింగ్ అధికారుల ప్రమేయం సైతం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. సీఐడీ విచారణ సమయంలో అక్రమ మైనింగ్ లో విచారించిన సాక్షులతో పాటుగా బ్యాంకు ఖాతాల పైన ఆరా తీసారు. పూర్తి నివేదికను కోర్టు కాపీలతో పాటుగా సీఐడీ దర్యాప్తు నివేదికను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తొలి సీబీఐ విచారణ ఇదే కానుంది. అయితే, ఈ వ్యవహారంలో ప్రభుత్వ నిర్ణయం పైన టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

English summary
AP Govt ordered CBI investigation on TDP leader Yarapatineni Srinivas illegal mining in palnadu area. CID report and court proceedings submitted to central govt for futher enquiry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X