వావ్.. వనిత, యాక్సిడెంట్ బాధిుతులకు సాయం.. అంబులెన్స్‌కు కాల్
అప్పుడప్పుడు కొందరు నేతలు జాలి, దయ, కరుణ చూపిస్తుంటారు. ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి తానేటి వనిత నిలుస్తారు. ఆమె తన ఔదార్యాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు మంత్రి స్వయంగా దగ్గరుండి సహాయం అందించారు. బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద ఒక ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొట్టిన సంగతి తెలసిందే. వీరికి మంత్రి సాయం చేశారు.
ప్రమాదంలో బైక్ పై వెళుతున్న దంపతులు స్వల్పంగా గాయపడ్డారు. హోంమంత్రి తానేటి వనిత తన కాన్వాయితో సహా అటుగా వెళ్తూ..ప్రమాదాన్ని గమనించారు. వెంటనే కాన్వాయిని ఆపించిన మంత్రి..ప్రమాద బాధితుల వద్దకు వెళ్లి సహాయం అందించారు. మంత్రి వనిత స్వయంగా అంబులెన్సుకి ఫోన్ చేసి సమాచారం అందించి..ప్రమాద బాధితులను సమీప ఆసుపత్రికి తరలించారు.

గాయపడిన దంపతులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. ప్రమాదం పై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రెప్పపాటులో జరిగిన ప్రమాదాన్ని గమనించిన మంత్రి వనిత..వెంటనే స్పందించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. మంత్రి మనసు వెన్న అంటూ ప్రశంసించారు.
కొందరు సాయం చేయమని అడిగినా స్పందించరు. హోదా ఉన్నా లేకున్నా పట్టించుకోరు. కానీ మరికొందరీలో మానవత్వం పరిమళిస్తోంది. హెల్ప్ అని అరిస్తే చాలు వాలిపోతారు. అలాంటి జాబితాలో వనిత నిలిచారు.