గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇన్‌స్టాలో గుంటూరు విద్యార్థిని న్యూడ్ వీడియోలు: ఛార్జిషీట్: భయం పుట్టించేలా: వాసిరెడ్డి పద్మ

|
Google Oneindia TeluguNews

గుంటూరు: గుంటూరు జిల్లాలో ఇంజినీరింగ్ విద్యార్థిని చోటు చేసుకున్న ఆకృత్యంపై ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. తోటి విద్యార్థిని పట్ల ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు అత్యంత అమానవీయంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత విద్యను అభ్యసించిన విద్యార్థులు సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించారని అన్నారు. వారిని ఊరికే వదలబోమని హెచ్చరించారు. చట్టప్రకారం.. వారిపై కఠిన శిక్ష అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ దిశగా పోలీసులకు ఆదేశాలను ఇస్తామని అన్నారు.

సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. 2017లో ఆ విద్యార్థినిపై వరుణ్, కౌశిక్ అనే ఇంజినీరింగ్ విద్యార్థులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని, బాధితురాలు సమాజం పట్ల భయపడటం వల్ల ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని అన్నారు. అమ్మాయిలు ఎవరు భయపడవద్దని, తమపై ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటే ధైర్యంగా దిశ పోలీస్‌స్టేషన్‌‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. వరుణ్, కౌశిక్ వంటి నీచుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. నిందితులపై వారంరోజుల్లో ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించినట్లు వాసిరెడ్డి పద్మ చెప్పారు.

AP Womens Commission Chairperson Vasireddy Padma reacts on Guntur incident

బాధిత విద్యార్థినికి సంబంధించిన కొన్ని అశ్లీల ఫొటోలు, వీడియోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినట్లు సమాచారం ఉందని, వాటిని తొలగించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. దీనికోసం ఇన్‌స్టాగ్రామ్ సంస్థకు లేఖ రాస్తామని వాసిరెడ్డి పద్మ చెప్పారు. అత్యాచారానికి పాల్పడే వారిలో భయం పుట్టించేలా చర్యలను తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అత్యాచారాలను నిరోధించడానికి ప్రభుత్వం దిశ చట్టం కింద ఏర్పాటు చేసిన మహిళా పోలీస్‌స్టేషన్లు ఉన్నవి బాధితులకు న్యాయం చేయడానికేనని అన్నారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు మహిళా పోలీస్‌స్టేషన్లపై లేవని స్పష్టం చేశారు.

ఈ ఘటన పట్ల గుంటూరు పోలీసులు వేగంగా స్పందించారని వాసిరెడ్డి పద్మ అన్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులు.. తమ స్నేహితురాలిపై ఇలాంటి దారుణాలకు పాల్పడతారనే విషయాన్ని కలలో కూడా ఊహించలేమని వాసిరెడ్డి పద్మ అన్నారు. నిందితులు ఎంతటి వారైనా వదిల పెట్టబోమని, వారిపై కఠిన శిక్షలు పడేలా చేస్తామని ఆమె తేల్చి చెప్పారు. మరొకరు ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడాలంటే భయపడేలా చర్యలను తీసుకోవాలని తాము ఇప్పటికే గుంటూరు పోలీసులకు మహిళా కమిషన్ తరపున ఆదేశాలను జారీ చేసినట్లు వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు.

English summary
Andhra Praesh Women's Commission Chairperson Vasireddy Padma reacts on Guntur incident. She said the police responded immediately to the Guntur engineering student case. Two teenagers who filmed videos in close proximity to a fellow student .. tortured them for wanting to resist. If they did not listen to the threat, they would put the videos on the website. The victim complained to the police about the direction
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X